ఇది కదా కిక్ అంటే.. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ఈ స్కూటర్లను నడపొచ్చు తెలుసా.??.. ధర కూడా చాలా తక్కువ.!!
మన దేశంలో వాహనం నడపాలంటే డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి. అయితే చాలా మందికి డ్రైవింగ్ వచ్చినా వారి వద్ద డ్రైవింగ్ లైసెన్స్ ఉండదు. దీంతో వేరే దారిలేక ట్యాక్సీలపై ఆధారపడుతుంటారు. అలాంటి వారికోసమే ఇక్కడ ఓ గుడ్ న్యూస్ ఉంది. డ్రైవింగ్ లైసెన్స్ లేకపోయినా.. రోడ్డుపై నడపగలిగే కొన్ని ఎలక్ట్రిక్ స్కూటర్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వాటి ధరలు కూడా చాలా తక్కువ..
ప్రతి ఒక్కరికీ ఇప్పుడు ద్విచక్ర వాహనం వారి జీవితంలో భాగమైపోయింది. కాస్తంత దూరంలో ఉన్న షాప్ నుంచి మొదలుకుని ఉద్యోగ అవసరాల వరకూ బైక్ లేదా స్కూటర్ లేనిదే జనజీవనం గడవడం లేదు. ఈ క్రమంలో మీ వద్ద డ్రైవింగ్ లెసెన్స్(Driving License) లేకపోయినా మీరు దర్జాగా రోడ్డుపై ప్రయాణించేందుకు చాలా చవకైన ఈవీల వివరాలు ఇక్కడ మీకు అందిస్తున్నాం.

భారత్‌లో తక్కువ వేగం(Electric Scooters Without Driving License)తో నడిచే ద్విచక్ర వాహనాలకు డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదని మీకు తెలుసా.??.. గంటకు 25 కి.మీ వేగంతో మాత్రమే వెళ్లే టూ వీలర్లకు లైసెన్స్ అవసరం ఉండదు. ప్రస్తుతం దేశంలోని కొన్ని కంపెనీలు కేవలం 25 kmph వేగంతో నడిచే EV స్కూటర్లను మార్కెట్లో అందుబాటులో ఉంచాయి. వాటి వివరాలు..
కైనెటిక్ జింగ్: భారత మార్కెట్లో కైనెటిక్ జింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను రూ. 71,990 నుంచి మొదలుకుని రూ. 84,990 (ఎక్స్-షోరూమ్) వరకు కొనుగోలు చేయవచ్చు. ఇది 22 Ah బ్యాటరీతో పనిచేస్తుంది. దీనిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 100 కి.మీల రేంజ్‌ను అందిస్తుంది.

హీరో ఎలక్ట్రిక్ ఫ్లాష్: Hero Electric Flash 28 Ah లెడ్-అసిటేట్ బ్యాటరీతో వస్తుంది. ఈ స్కూటర్‌ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే 50 కి.మీ రేంజ్ అందిస్తుంది. భారత మార్కెట్లో Hero Electric Flash ధర రూ. 59,640 (ఎక్స్-షోరూమ్) గా ఉంది. ఇది చిన్న 250 వాట్ల BLDC హబ్ మోటార్‌ను కలిగి ఉంటుంది.

హీరో ఎడ్డీ: హీరో మోటోకార్ప్ నుంచి మరో ఎలక్ట్రిక్ స్కూటర్ Hero Eddy రూ. 72,000 ఎక్స్-షోరూమ్ ధరతో అందుబాటులో ఉంది. ఇది 30 Ah బ్యాటరీ ప్యాక్‌ను ప్యాక్‌ను కలిగి ఉంటుంది. పూర్తి ఛార్జ్ చేయటడానికి 4 నుంచి 5 గంటలు పడుతుంది. 85 కి.మీ రేంజ్‌ను అందిస్తుంది. దీని గరిష్ఠ వేగం గంటకు 25 కి.మీ.
కొమాకి XGT KM: మార్కెట్లో తక్కువ ధరలో అందుబాటులో ఉన్న మరో స్కూటర్.. Komaki XGT KM స్కూటర్. ఇది పూర్తి ఛార్జ్‌పై గరిష్ఠంగా 85 కి.మీ రేంజ్‌ను అందిస్తుందని సంస్థ వెల్లడించింది. ఈ EV స్కూటర్ ధర రూ. 56,890 నుండి రూ. 93,045 (ఎక్స్-షోరూమ్) వరకు అందుబాటులో ఉంది.

ఒకినావా లైట్: తక్కువ ధరలో అందుబాటులో ఉన్న మరో ఈవీ ఒకినావా లైట్. దీనిని రూ. 74,999 (ఎక్స్-షోరూమ్) ధరకు కొనుగోలు చేయవచ్చు. ఇది 1.25 కిలోవాట్ రిమూవబుల్ లిథియం-అయాన్ బ్యాటరీతో వస్తుంది. ఇది 60 కి.మీ రేంజ్‌ను అందిస్తుండగా.. పూర్తిగా ఛార్జ్ చేయడానికి 4-5 గంటలు సమయం పడుతుంది.

ఒకినావా R30: భారత మార్కెట్లో రూ. 61,998(ఎక్స్-షోరూమ్) ధరతో Okinawa R30 EV స్కూటర్ అందుబాటులో ఉంది. ఇది 1.25 కిలోవాట్ లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌తో పనిచేస్తుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 60 కిమీల రేంజ్‌ను అందిస్తుండగా.. పూర్తిగా ఛార్జ్ చేయడానికి 4-5 గంటలు పడుతుంది.
డెల్టిక్ డ్రిక్స్: దేశంలో Deltik Drixx రూ. 58,490 నుంచి రూ. 84,990(ఎక్స్-షోరూమ్) ధరలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ఈ స్కూటర్ 1.58 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. పూర్తి ఛార్జింగ్‌పై 70 కి.మీ నుండి 100 కి.మీల రేంజ్‌ను అందిస్తుంది.


Click it and Unblock the Notifications








