భారత్‌లోని బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఇవే!.. ధర రూ. లక్ష కంటే తక్కువే..

ఇండియన్ మార్కెట్లోకి ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఎలక్ట్రిక్ బైకులు, స్కూటర్లు లాంచ్ అవుతూనే ఉన్నాయి. అయితే చాలామంది ఎక్కువ రేంజ్ అందించే ఎలక్ట్రిక్ బైకులు కొనుగోలు చేయడానికి ఇష్టపడితే.. మరికొందరు తక్కువ ధరలో లభించే ఎలక్ట్రిక్ స్కూటర్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. రూ.1 లక్ష కంటే తక్కువ ధర వద్ద లభించే ఎలక్ట్రిక్ స్కూటర్ల జాబితాలో ఓలా ఎలక్ట్రిక్ యొక్క ఎస్1 ఎక్స్, ప్యూర్ ఈవీ ఈప్లూటో 7జీ, బజాజ్ చేతక్ 2901, ఆంపియర్ మాగ్నెస్ ఈఎక్స్ మరియు కొమాకి ఎస్ఈ ఎకో వంటివి ఉన్నాయి. వీటి గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

ఓలా ఎస్1 ఎక్స్

భారతదేశంలో ఓలా ఎలక్ట్రిక్ ప్రారంభమైనప్పటి నుంచి ఎక్కువమంది కస్టమర్లను ఆకర్షిస్తూ.. ఉత్తమ అమ్మకాలు పొందటంలో విజయం సాధిస్తోంది. కంపెనీ మార్కెట్లో లాంచ్ చేసిన ఎలక్ట్రిక్ బైకుల జాబితాలో ఎస్1 ఎక్స్ కూడా ఒకటి. దీని ధర రూ. 69999 (ఎక్స్ షోరూమ్) మాత్రమే. ఇది 2 కిలోవాట్, 3 కిలోవాట్ మరియు 4 కిలోవాట్ అనే మూడు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్ పొందుతుంది.

Ola S1 X

ఓలా ఎస్1 ఎక్స్ యొక్క 2 కిలోవాట్ బ్యాటరీ 95 కిమీ రేంజ్, 3 కిలోవాట్ బ్యాటరీ 143 నుంచి 151 కిమీ రేంజ్ అందిస్తుంది. ఇక 4 కిలోవాట్ బ్యాటరీ ఒక సింగిల్ చార్జితో 190 కిమీ కంటే ఎక్కువ రేంజ్ అందిస్తుందని ధృవీకరించబడింది. రేంజ్ అనేది వివిధ వాతావరణ పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. డిజైన్ మరియు ఫీచర్స్ పరంగా ఇది చాలా ఉత్తమంగా ఉంటుంది.

సింపుల్ డిజైన్ కలిగిన ఓలా ఎస్1 ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ 5 ఇంచెస్ లేదా 4.3 ఇంచెస్ డిస్‌ప్లే పొందుతుంది. అంతే కాకూండా కీలెస్ ఇగ్నిషన్, స్మార్ట్ కనెక్టివిటీ, 34 లీటర్ అండర్ బూట్ స్పేస్, క్రూయిజ్ కంట్రోల్ మరియు రీజెనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ వంటివి కూడా ఓలా ఎస్1 ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్లో లభిస్తాయి. ఇది 6 kW మోటార్ ద్వారా శక్తిని పొందుతుంది.

Pure EV ePluto 7G

ప్యూర్ ఈవీ ఈప్లూటో 7జీ

లక్ష రూపాయల కంటే తక్కువ ధర వద్ద లభించే ఎలక్ట్రిక్ స్కూటర్లలో ప్యూర్ ఈవీ ఈప్లూటో 7జీ ఒకటి. దీని ప్రారంభ ధర రూ. 77999 (ఎక్స్ షోరూమ్) మాత్రమే. ఇది 2.4 కిలోవాట్ ఎంసీయూ టెక్నలజీతో 1.5 కిలోవాట్ మోటారు ద్వారా శక్తిని పొందుతుంది. ఇందులో 2.5 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ఒక సింగిల్ చార్జితో 111 కిమీ నుంచి 151 కిమీ పరిధిని అందిస్తుంది.

బజాజ్ చేతక్ 2901

బజాజ్ ఆటో కంపెనీకి చెందిన చేతక్ 2901 ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 95998 (ఎక్స్ షోరూమ్). ఇందులోని 2.8 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ఒక సింగిల్ చార్జితో 123 కిమీ రేంజ్ అందిస్తుందని ARAI చేత ధృవీకరించబడింది. ఈ స్కూటర్ టాప్ స్పీడ్ గంటకు 63 కిమీ. ఇందులో ఎల్ఈడీ లైటింగ్, డిజిటర్ స్క్రీన్, మ్యూజిక్ కంట్రోల్స్ మరియు స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ వంటివి ఉన్నాయి.

Ampere Magnus EX

ఆంపియర్ మాగ్నస్ ఈఎక్స్

రూ. 94900 (ఎక్స్ షోరూమ్) ధర వద్ద లభించే ఆంపియర్ మాగ్నస్ ఈఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ భారతదేశంలో అత్యుత్తమ అమ్మకాలు పొందుతున్న ఉత్తమ్ మోడల్. ఇది 2.2 కిలోవాట్ బ్యాటరీ కలిగి ఒక సింగిల్ చార్జితో 100 కిమీ రేంజ్ అందిస్తుంది. ఈ స్కూటర్ టాప్ స్పీడ్ గంటకు 53 కిమీ మాత్రమే. ఇది కేవలం 10 సెకన్లలో 40 కిమీ వేగవంతం అవుతుంది.

కొమాకి ఎస్ఈ ఎకో

కొమాకి కంపెనీకి చెందిన ఎస్ఈ ఎకో కూడా రూ.లక్ష కంటే తక్కువ ధర వద్ద లభించే ఉత్తమ ఎలక్ట్రిక్ స్కూటర్. దీని ధర రూ.97259 (ఎక్స్ షోరూమ్). ఇది 55 కిమీ / గం వేగంతో 100 కిమీ రేంజ్ అందిస్తుంది. ఇందులో TFT డిస్ప్లే, ఎల్ఈడీ లైటింగ్, క్రూయిజ్ కంట్రోల్, రివర్స్ అసిస్ట్ వంటి అనేక ఫీచర్స్ ఉన్నాయి. ఇవన్నీ వాహన వినియోగదారులకు మంచి రైడింగ్ అనుభూతిని అందిస్తాయి.

ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.

More from DriveSpark

Article Published On: Wednesday, June 12, 2024, 16:00 [IST]
English summary
Most affordable electric scooters under rs 1 lakh
Read more on: #electric vehicles
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+