భారత్లో లభించే ప‌వ‌ర్‌పుల్ బైకులు ఇవే!.. ధర తెలిస్తే దడ పుట్టడం పక్కా!

ఒక బైక్ రేటు ఎంతంటే కొంతమంది లక్ష నుంచి ఐదు లక్షల వరకు ఉంటుందని చెబుతారు. ఈ కథనంలో రూ.16.63 లక్షల ఖరీదైన బైక్ నుంచి అక్షరాలా రూ.79.9 లక్షల బైక్ వరకు ఉన్న అత్యంత శక్తివంతమైన మోటార్‌సైకిల్స్ గురించి తెలుసుకుందాం.

బిఎమ్‌డబ్ల్యూ ఎం 1000 ఆర్ఆర్ (BMW M 1000 RR)

భారతదేశంలో అత్యంత ఖరీదైన బైకుల జాబితాలో ఒకటైన 'బిఎమ్‌డబ్ల్యూ మోటోరాడ్' కంపెనీకి చెందిన ఎం 1000 ఆర్ఆర్ ఒకటి. దీని ధర రేప్. 49 లక్షల నుంచి రూ. 55 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంటుంది. ఈ బైక్ 999 సీసీ ఇంజిన్ పొందుతుంది. ఇది 14500 rpm వద్ద 209.1 bhp పవర్ మరియు 11000 rpm వద్ద 113 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

BMW S 1000 RR

బిఎమ్‌డబ్ల్యూ ఎం 1000 ఆర్ఆర్ బైక్ కేవలం 3.1 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఈ బైక్ టాప్ స్పీడ్ 306 కిమీ/గం నుంచి 314 కిమీ/గం వరకు ఉంటుంది. అద్భుతమైన డిజైన్ కలిగిన ఈ బైక్ అంతకు మించిన ఫీచర్స్ పొందుతుంది. పనితీరు పరంగా ఈ బైక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు.

బిఎమ్‌డబ్ల్యూ ఎస్ 1000 ఆర్ఆర్

అత్యంత శక్తివంతమైన బైకులలో మరొకటి బిఎమ్‌డబ్ల్యూ ఎస్ 1000 ఆర్ఆర్. రూ.20.30 లక్షల (ఎక్స్ షోరూమ్) ప్రారంభ ధర వద్ద లభించే ఈ బైక్ 999 సీసీ లిక్విడ్-కూల్డ్ ఫోర్ సిలిండర్ ఇంజిన్ పొందుతుంది. 13750 rpm వద్ద 206.5 bhp పవర్ మరియు మరియు 11000 rpm వద్ద 113 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 3.2 సెకన్లలో 0-100 కిమీ వరకు వేగవంతం అవుతుంది.

Ducati Panigale V4 R

డుకాటీ పానిగలే వీ4 ఆర్

రూ.69.9 లక్షల ధర వద్ద లభించే డుకాటీ కంపెనీకి చెందిన పానిగలే వీ4 ఆర్ కూడా అత్యంత శక్తివంతమైన బైకుల జాబితాలో ఒకటి. ఇది 998 సీసీ డెస్మోసెడిసి స్ట్రాడేల్ ఆర్ ఇంజిన్ పొందుతుంది. 15500 rpm వద్ద 237 Bhp పవర్ 118 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది అక్రాపోవిక్ రేసింగ్ ఎగ్జాస్ట్ పొందుతుంది. ఈ బైక్ టాప్ స్పీడ్ గంటకు 300 కిమీ/గం కంటే ఎక్కువ.

కవాసకి నింజా హెచ్2ఆర్

కవాసకి కంపెనీకి చెందిన హెచ్2ఆర్ మన జాబితాలో చెప్పుకోదగ్గ మరియు అత్యంత ఖరీదైన బైక్. దీని ధర అక్షరాలా రూ. 79 9 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ బైక్ రేస్ ట్రాకులో రైడ్ చేయడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ బైక్ 14000 rpm వద్ద 320 bhp పవర్ మరియు 12500 rpm వద్ద 165 Nm టార్క్ అందించే 998 సీసీ ఇంజిన్ పొందుతుంది.

Kawasaki Ninja ZX-10R

కవాసకి నింజా జెడ్ఎక్స్-10ఆర్

కవాసకి కంపెనీకి చెందిన మరో బైక్ నింజా జెడ్ఎక్స్-10ఆర్. దీని ధర రూ. 16.63 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ బైక్ 998 సీసీ ఇన్‌లైన్ ఫోర్ సిలిండర్ ఇంజిన్ కలిగి 13200 rpm వద్ద 210Bhp పవర్ మరియు 11400 rpm వద్ద 114.9 Nm టార్క్ అందిస్తుంది. భారతదేశంలో అత్యంత సరసమైన మరియు అత్యంత శక్తివంతమైన పనితీరుని అందించే బైకులలో ఇది ఒకటి కావడం గమనార్హం.

సుజుకి హయబుసా

సుజుకి మోటార్‌సైకిల్ కంపెనీకి చెందిన హయబుసా కూడా చెప్పుకోదగ్గ అత్యంత ప్రజాదరణ పొందిన పాపులర్ బైక్. దీని ధర రూ. 16.90 లక్షలు (ఎక్స్ షోరూమ్). మంచి డిజైన్ మరియు ఫీచర్స్ కలిగిన ఈ బైక్ 1340 సీసీ ఇన్‌లైన్ ఫోర్ సిలిండర్ ఇంజిన్ కలిగి 9700 rpm వద్ద 187 Bhp పవర్ మరియు 7000 rpm వద్ద 150 Nm టార్క్ అందిస్తుంది.

ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.

More from DriveSpark

Article Published On: Sunday, March 31, 2024, 10:18 [IST]
English summary
Most powerful bikes in india from bmw m 1000 rr to suzuki hayabusa
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+