పవర్‌ఫుల్ బైక్ కొనాలా.. ఎంచుకో ఓ మంచి ఆప్షన్ - ధర ఎంతంటే?

భారతదేశంలో సరసమైన ధర వద్ద లభించే బైకులు మాత్రమే కాకుండా.. ఖరీదైన బైకులు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇందులో కేవలం రూ. 1 లక్ష కంటే తక్కువ ధరలో లభించే బైకులు ఉన్నాయి. రూ. 10 లక్షల కంటే ఎక్కువ విలువైన బైకులు ఉన్నాయి. ఈ కథనంలో రూ. 5 లక్షల కంటే తక్కువ ధర వద్ద లభించే యమహా ఎమ్‌టీ-03, ఆర్3, కేటీఎమ్ RC 390, 390 అడ్వెంచర్, 390 డ్యూక్ మొదలైన ఉత్తమ బైకుల గురించి మరిన్ని వివరాలు వివరంగా ఈ కథనంలో తెలుసుకుందాం..

యమహా ఎమ్‌టీ-03, ఆర్3

దేశీయ మార్కెట్లో అత్యంత స్టైలిష్ బైకులు లాంచ్ చేసి విక్రయిస్తున్న యమహా కంపెనీ కూడా రూ. 5 లక్షల కంటే తక్కువ ధర వద్ద బైక్స్ విక్రయిస్తోంది. ఇందులో ఎమ్‌టీ-03 మరియు ఆర్3 ఉన్నాయి. వీటి ధరలు వరుసగా రూ. 4.60 లక్షలు మరియు రూ. 4.65 లక్షలు (ఎక్స్ షోరూమ్, ఇండియా). ఇవి రెండూ మంచి డిజైన్ మరియు ఫీచర్స్ కలిగి ఉత్తమ పనితీరును అందిస్తాయి. పనితీరు పరంగా చాలా ఉత్తమంగా ఉంటాయి.

KTM RC 390

కేటీఎం ఆర్సీ 390, 390 అడ్వెంచర్

కేటీఎం కంపెనీకి చెందిన ఆర్సీ 390, 390 అడ్వెంచర్ బైకులు కూడా రూ. 5 లక్షల కంటే తక్కువ ధర వద్ద లభించే బైకుల జాబితాలో చెప్పుకొద్దవి. కేటీఎం ఆర్సీ 390 అనేది ప్రస్తుతం దేశంలో అత్యంత శక్తివంతమైన సింగిల్ సిలిండర్ స్పోర్ట్‌బైక్. ఇది మునుపటి తరం 373 సీసీ మోటార్‌ను ఉపయోగిస్తున్నప్పటికీ 43.5 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. దీని ధర రూ. 3.20 లక్షలు.

ఇక కేటీఎం 390 అడ్వెంచర్ విషయానికి వస్తే.. దీని ధర రూ. 2.83 లక్షల నుంచి రూ. 3.63 లక్షల (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) మధ్య ఉంది. ఇది కూడా ఆర్సీ 390 మాదిరిగానే ఉత్తమ అవుట్‌పుట్ అందిస్తుంది. కాబట్టి మంచి రైడింగ్ అనుభూతిని అందిస్తుంది. డిజైన్ మరియు ఫీచర్స్ పరంగా ఇది చాలా ఉత్తమంగా ఉంటుంది. ధర కూడా కొంత తగ్గువే కాబట్టి ఎక్కువమంది ఇష్టపడి కొనుగోలు చేస్తుంటారు.

KTM 390 Duke

మూడవ తరం కేటీఎం 390 డ్యూక్

కేటీఎం కంపెనీ యొక్క మూడో తరం 390 డ్యూక్ 399 సీసీ ఇంజిన్ కలిగిన బైక్. దీని ధర రూ. 3.12 లక్షలు (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ). ఇది దాని మునుపటి మోడల్స్ కంటే కొంత భిన్నంగా ఉన్నప్పటికీ.. మంచి డిజైన్ మరియు పనితీరును అందిస్తుంది. అంతే కాకుండా ధర పరంగా ఆర్సీ 390 మరియు 390 అడ్వెంచర్ కంటే కొంత తక్కువే అని తెలుస్తోంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ 650, బెనెల్లీ లియోన్సినో 500

మన జాబితాలో చెప్పుకోదగ్గ బైక్స్ రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ 650 మరియు బెనెల్లీ లియోన్సినో 500. ఇంటర్‌సెప్టర్ 650 ధర రూ. 3.03 లక్షల నుంచి రూ. 3.45 లక్షల (ఎక్స్ షోరూమ్, చెన్నై) మధ్య ఉంది. అదే సమయంలో బెనెల్లీ లియోన్సినో 500 ధర రూ. 4.99 లక్షలు (ఎక్స్ షోరూమ్, ఇండియా). డిజైన్ మరియు ఫీచర్స్ పరంగా ఇఇ రెండూ చాలా అద్భుతంగా ఉంటాయి.

Aprilia RS 457

అప్రిలియా ఆర్ఎస్ 457

రూ. 5 లక్షల కంటే తక్కువ ధర వద్ద లభించే ఉత్తమ బైకులలో చెప్పుకోదగ్గ మోడల్ అప్రిలియా ఆర్ఎస్ 457. దీని ధర రూ. 4 లక్షల కంటే ఎక్కువే. కంపెనీ ఈ బైక్ డెలివరీలను ఈ మధ్య కాలంలోనే ప్రారంభించింది. ఇది ఆధునిక డిజైన్, అధునాతన ఫీచర్స్ పొందుతుంది. పనితీరు పరంగా చాలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ఇది ఎక్కువమంది వాహన ప్రియులను ఆకర్శించడంలో విజయం పొందింది.

ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.

More from DriveSpark

Article Published On: Friday, June 7, 2024, 11:00 [IST]
English summary
Most powerful bikes under rs 5 lakh in indian market
Read more on: #auto news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+