mXmoto M16 e bike మార్కెట్లోకి అదిరిపోయే లుక్‌తో స్టైలిష్ ఎలక్ట్రిక్ బైక్ లాంచ్.. 200 కి.మీ రేంజ్
మార్కెట్లోకి మరో సరికొత్త ఎలక్ట్రిక్ బైక్ విడుదలైంది. యూత్‌ను ఆకట్టుకునే ఫీచర్లు, అదిరిపోయే డిజైన్‌తో mXmoto సంస్థ M16 e-bike ను లాంచ్ చేసింది. అంతేకాకుండా అధిక రేంజ్‌తో కూడా కస్టమర్లకు అందుబాటులో ఉంటుంది. ఈ బైక్ ఫీచర్లు, డిజైన్, రేంజ్ పూర్తి సమాచారం ఈ కథనంలో..
భారత మార్కెట్లో ఎంఎక్స్ మోటో(mXmoto) సంస్థ తన కొత్త ఎలక్ట్రిక్ బైక్ మోడల్ ఎం16(M16) ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ సరికొత్త ఎలక్ట్రిక్ బైక్‌ను రూ .1.98 లక్షల(ఎక్స్-షోరూమ్) ధరతో సంస్థ ప్రవేశపెట్టింది. ఎంపిక చేసిన ఔట్ లెట్స్‌లో ఈ బైక్ అందుబాటులో ఉంటుంది.

ఎంఎక్స్‌మోటో ఎం16 ఇ-బైక్‌ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే 160 కిలోమీటర్ల నుంచి 200 కిలోమీటర్ల వరకు రేంజ్‌ను అందిస్తుంది. పూర్తి ఛార్జింగ్‌పై ఇందులోని బ్యాటరీ కేవలం 1.6 యూనిట్ల విద్యుత్‌ను తీసుకుంటుంది. మూడు గంటల్లో 0 నుంచి 90 శాతం ఛార్జింగ్ పూర్తవుతుంది. ఈ బైక్ బ్యాటరీపై సంస్థ 8 ఏళ్ల వారంటీని అందిస్తుంది.
అదేవిధంగా mXmoto M16 మోటార్ అండ్ కంట్రోలర్‌పై మూడేళ్ల వారంటీ లేదా 80,000 కిలోమీటర్ల వారంటీని కస్టమర్లకు అందిస్తుంది. అంతేకాకుండా mXmoto M16 e-bike బైక్ డ్రైవింగ్ సామర్ధ్యాన్ని మరింత పెంచడానికి మోటార్ కంట్రోలర్ ఇన్‌పుట్ శక్తిని 16 శాతం పెంచుతుందని కంపెనీ వెల్లడించింది. ఇందులో 80 amp హై ఎఫీషియెన్సీ కంట్రోలర్లు రీజెనరేటివ్ బ్రేకింగ్‌ను కలిగి ఉన్నట్లు ఎంఎక్స్ మోటో తెలిపింది.

mXmoto M16 ఇ బైక్ క్రూయిజర్లలో డైనమిక్ LED హెడ్ లైట్స్, మెరుగైన బ్రేకింగ్ పనితీరు కోసం ట్రిపుల్ డిస్క్ బ్రేక్ సిస్టమ్, ఎల్ఈడీ డైరెక్షన్ ఇండికేటర్స్, స్మార్ట్ యాప్, ఆన్-బోర్డ్ నావిగేషన్, ఆన్-రైడ్ కాలింగ్, బ్లూటూత్ సౌండ్ సిస్టమ్, క్రూయిజ్ కంట్రోల్, రివర్స్ అసిస్ట్, యాంటీ స్కిడ్ అసిస్ట్, పార్కింగ్ అసిస్ట్ వంటి అత్యాధునిక ఫీచర్లను కస్టమర్ల కోసం అందిస్తోంది.
కాగా పనితీరు పరంగా mXmoto M16 ఇ బైక్‌ను ప్రపంచంలోనే అగ్రగామిగా నిలపాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుందని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రాజేంద్ర మల్హోత్రా పేర్కొన్నారు. 2023 అక్టోబర్‌లో ఎంఎక్స్ మోటో.. mx V Eco ఎలక్ట్రిక్ స్కూటర్‌ను భారత మార్కెట్లో సంస్థ లాంచ్ చేసింది.

ఈ చిన్న బ్యాటరీ ప్యాక్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 80 కి.మీ నుంచి 100 కి.మీ వరకు రేంజ్‌ను అందిస్తుండగా.. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ. 84,999గా ఉంది. ఇందులోని పెద్ద బ్యాటరీ ప్యాక్ 105 కి.మీ నుంచి 120 కి.మీ వరకు రేంజ్‌ను ఇస్తుంది. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ. 94,999గా ఉంది.
ఫీచర్ల విషయానికొస్తే, ఈ mx V Eco ఇ స్కూటర్‌లో టీఎఫ్‌టీ స్క్రీన్, ఆన్ బోర్డ్ నావిగేషన్, ఎల్ఈడీ లైటింగ్, సెల్ఫ్-డయాగ్నోసిస్, బ్లూటూత్ కాలింగ్ సపోర్ట్, క్రూయిజ్ కంట్రోల్, రివర్స్ అసిస్ట్ వంటి అధునాతన ఫీచర్లను కలిగి ఉంది. సీటుకు ఫ్రంట్ డిస్క్ బ్రేక్ మరియు కాంట్రాస్ట్ స్టిచింగ్‌ను కూడా సంస్థ అందిస్తోంది.
ఇంకా ఈ ఎంఎక్స్ వీ ఎకో ఎలక్ట్రిక్ స్కూటర్‌లో ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ ల్యాంప్, అడాప్టివ్ లైటింగ్, వేరియబుల్ లైట్ ఇంటెన్సిటీతో వస్తుంది. కస్టమర్ల కోసం అదనంగా ఇందులో రియర్ టాప్ బాక్స్‌ను ఉచిత యాక్సెసరీగా అందిస్తున్నామని ఎంఎక్స్ మోటో వెల్లడించింది. యువత అభిరుచిని దృష్టిలో ఉంచుకుని ఆకట్టుకునే డిజైన్, ఫీచర్లతో ఎంఎక్స్‌మోటో మార్కెట్లో తన ఉనికిని చాటుకునేందుకు యత్నిస్తోంది.


Click it and Unblock the Notifications