Ather 450 Apex డెలివరీలు ఎప్పుడో తెలిసిపోయింది - ఇక్కడ చూడండి
2024 ప్రారంభంలోనే దేశీయ విఫణిలో లాంచ్ అయిన కొత్త 'ఏథర్ 450 అపెక్స్' (Ather 450 Apex) స్కూటర్ యొక్క ఉత్పత్తి మైసూరులోని ఫ్యాక్టరీలో ప్రారంభమైనట్లు కంపెనీ కో ఫౌండర్ 'స్వప్నిల్ జైన్' (Swapnil Jain) సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
ఏథర్ ఎనర్జీ యొక్క కొత్త స్కూటర్ ఉత్పత్తి ప్రారంభమవ్వడంతో డెలివరీలు త్వరలోనే.. అంటే మార్చి ప్రారంభంలో ప్రారంభమయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ స్కూటర్ చూడటానికి దాని మునుపటి మోడల్ మాదిరిగా ఉన్నప్పటికీ.. వెనుక భాగం మొత్తం పారదర్శకంగా ఉండటం వల్ల లోపల ఉన్న పరికరాలు బయటకు కనిపించడం గమనించవచ్చు. బాడీ ప్యానెల్ కూడా స్పెషల్ ఇండియన్ బ్లూ కలర్ పొందుతుంది.

కొత్త ఏథర్ అపెక్స్ స్కూటర్ యొక్క సీటు ఎత్తు, వీల్ బేస్, టైర్ పరిమాణం మరియు గ్రౌండ్ క్లియరెన్స్ వంటివన్నీ దాని మునుపటి మోడల్ మాదిరిగానే ఉన్నాయి. ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇందులో 7-ఇంచెస్ TFT స్క్రీన్ ఉంటుంది. ఇది బ్లూటూత్ కనెక్టివిటీకి సపోర్ట్ చేస్తుంది. పార్క్ అసిస్ట్, హిల్ హోల్డ్ అసిస్ట్ వంటి వాటితో పాటు ఆటో ఇండికేటర్ కట్ ఆఫ్ కూడా న్యావిగేషన్ వంటి ఫీచర్స్ ఉన్నాయి.
ఏథర్ 450 అపెక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ 3.7 కిలోవాట్ బ్యాటరీ కలిగి ఉంటుంది. ఈ స్కూటర్ రీ-జనరేటివ్ బ్రేకింగ్ సిస్టం కలిగి ఉండటం వల్ల 157 కిమీ రేంజ్ అందిస్తుంది. అదే సమయంలో ఈ స్కూటర్ 0 నుంచి 40 కిమీ వేగవంతం కావడానికి పట్టే సమయం కేవలం 2.9 సెకన్లు మాత్రమే. దీన్ని బట్టి ఇది ఇది దాని మునుపటి మోడల్ కంటే కూడా వేగవంతమైనదిగా ఉంటుందని తెలుస్తోంది.

ఏథర్ కంపెనీ యొక్క కొత్త 450 అపెక్స్ మంచి డిజైన్ మరియు ఫీచర్స్ కలిగి ఉండటమే కాకుండా.. టెలిస్కోపిక్ ఫ్రంట్ మరియు మోనోషాక్ వంటి వాటిని పొందుతుంది. బ్రేకింగ్ విషయానికి వస్తే.. ఇది ముందు వైపు 200 మిమీ డిస్క్ మరియు వెనుక 190 మిమీ డిస్క్ బ్రేక్స్ పొందుతుంది. ఇందులో 12 ఇంచెస్ ఫ్రంట్ అండ్ రియర్ వీల్స్ ఉంటడం చూడవచ్చు.
ఏథర్ 450 అపెక్స్ సుమారు 22 లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్ కలిగి వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది. భారతీయ మార్కెట్లో లాంచ్ అయిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 1.89 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది ఇప్పటికే మార్కెట్లో విక్రయానికి ఓలా ఎలక్ట్రిక్ యొక్క ఎస్1 ప్రో, టీవీఎస్ కంపెనీ యొక్క ఐక్యూబ్ మరియు బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్లకు ప్రత్యర్థిగా ఉంటుంది.
ఇండియన్ మార్కెట్లో ప్రారంభం నుంచి అత్యత్తమ అమ్మకాలు పొందుతూ ముందుకు సాగుతున్న ఏథర్ కంపెనీ ప్రస్తుతం మార్కెట్లో ఓ విన్నూతమైన స్కూటర్ ప్రవేశపెట్టడంతో వాహన ప్రేమికులు ఈ స్కూటర్ కోసం ఎదురు చూస్తున్నట్లు సమాచారం. ఎందుకంటే ఈ స్కూటర్ ఇప్పటి వరకు ఉన్న స్కూటర్ల కంటే భిన్నంగా లోపలున్న పరికరాలను బయటకు కనిపించేలా రూపొందించబడి ఉంది. ఈ కారణంగా చాలామంది చూపు దీనిపైన పడింది.
ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications








