Ather Rizta ఏథర్‌ నుంచి త్వరలో మరో కొత్త ఎలక్ట్రిక్‌ స్కూటర్‌.. స్పై ఫొటోలు వైరల్‌

ప్రముఖ ఎలక్ట్రిక్‌ టూ వీలర్‌ తయారీదారు ఏథర్‌ ఎనర్జీ త్వరలో మరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే ఏథర్‌ 450 సిరీస్‌ స్కూటర్లు మార్కెట్లో కొనసాగుతుండగా.. త్వరలో ఏథర్‌ రిజ్టా(Ather Rizta) పేరుతో కొత్త స్కూటర్‌ను తీసుకురాబోతుంది. ఈ స్కూటర్‌కు సంబంధించి స్పాట్‌ టెస్ట్‌ ఫొటోలు వైరల్‌ అవుతున్నాయి.

బెంగళూరుకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ(Ather Energy).. ఎలక్ట్రిక్ టూ వీలర్‌ సెగ్మెంట్‌లో సత్తా చాటుతోంది. కాగా త్వరలో ఏథర్‌ నుంచి మరో కొత్త ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ ఏథర్‌ రిజ్టా విడుదల కాబోతోంది. కొత్త ఏథర్‌ రిజ్టా స్పాట్‌ టెస్ట్‌ ఫొటోలు ఇంటర్నెట్‌లో ప్రత్యక్షమయ్యాయి.

Ather-Rizta

కొత్త ఏథర్ రిజ్టా(Ather Rizta) ఎలక్ట్రిక్ స్కూటర్ స్పై షాట్‌లను పరిశీలిస్తే.. ప్రాక్టికాలిటీ, కంఫర్ట్, ఫ్యామిలీ అప్పీల్ మిశ్రమంగా ఈ స్కూటర్‌ కనిపిస్తుంది. యువ కస్టమర్లను ఆకట్టుకునే విధంగా దీనిని రూపొందించారు. ఇంకా ల్యాండ్‌స్కేప్‌ ద్వారా ఈ స్కూటర్‌ మరింత పెద్దదిగా, రైడింగ్‌కు అనుకూలంగా ఉండొచ్చని తెలుస్తోంది. ఈ మేరకు ఏథర్‌ ఎనర్జీ కో ఫౌండర్‌ ఈ కొత్త స్కూటర్‌ పేరును ఇటీవల సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించారు.

ఏథర్ రిజ్టా 2019 నుండి అభివృద్ధి దశలో ఉందని పోస్ట్‌లో మెహతా పేర్కొన్నారు. ఈ మోడల్ ఇతర ఏథర్ స్కూటర్‌ల మాదిరిగానే అదే స్థాయి నాణ్యత మరియు విశ్వసనీయతను కొనసాగిస్తుందని చెప్పుకొచ్చారు. మరిన్ని ఫీచర్లను జోడించడం ద్వారా రైడర్ సౌకర్యం మరియు భద్రతను మెరుగుపరుస్తుందని వెల్లడించారు.

Ather-Rizta

స్పై ఫొటోల ద్వారా విశాలమైన మరియు సౌకర్యవంతమైన సీటును ఏథర్‌ రిజ్టా ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ కలిగి ఉంది. అంతే కాకుండా ఫ్లాట్ ఫ్లోర్‌బోర్డ్, పిలియన్ గ్రాబ్ రైల్, ఇంటిగ్రేటెడ్ ఫుట్ రెస్ట్‌లు ఇంకా క్షితిజ సమాంతర LED టెయిల్-లైట్ వంటి ఫీచర్లను కలిగి ఉంది. ఇంకా లగేజీ సౌకర్యం కోసం 22-లీటర్ల కంటే ఎక్కువ సీట్ స్టోరేజ్ స్పేస్‌ను కలిగి ఉండటం మరో అడ్వాంటేజ్‌.

కాగా కొత్త ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్ 450 సిరీస్ ఇ-స్కూటర్‌ల కంటే చాలా పెద్దదిగా ఉన్నట్లుగా ఫొటోల ద్వారా స్పష్టమవుతోంది. ఈ కొత్త ఇ స్కూటర్(Electric Scooter) ఆకర్షణీయమైన హెడ్‌లైట్‌ని కలిగి ఉండటంతో పాటు.. టెలిస్కోపిక్ ఫోర్క్, 12-అంగుళాల అల్లాయ్ వీల్స్ మరియు ఫ్రంట్ డిస్క్ బ్రేక్ వంటి వాటితో వస్తుంది.

ఏథర్ ఎనర్జీ రిజ్టా ఎలక్ట్రిక్‌ మోటార్‌ విషయానికొస్తే.. ఇది 450 మోడల్‌ మాదిరిగానే అదే మిడ్-డ్రైవ్ మోటారును ఉపయోగింస్తున్నట్లుగా తెలుస్తోంది. కాగా 450 సిరీస్ అల్యూమినియంను ఉపయోగిస్తుండటంతో.. ఇందులో ఎలాంటి మార్పులు చేస్తారో వేచి చూడాలి. కాగా టచ్‌స్క్రీన్‌ ఫీచర్‌ను ఎంట్రీ లెవెల్ ట్రిమ్‌లో కాకుండా టాప్ ట్రిమ్‌లలో అందించే అవకాశం ఉంది.

కాగా ఏథర్‌ 450 సిరీస్‌లో ప్రస్తుతం రెండు బ్యాటరీ ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. 450S మరియు 450X ఎలక్ట్రిక్‌ స్కూటర్లు 9 kWh ప్యాక్‌తో వస్తుండగా.. 450X ఇ స్కూటర్‌ 3.7 kWh ప్యాక్‌తో కూడా అందుబాటులో ఉంది. ఇటీవల ఏథర్‌ ఎనర్జీ 450 అపెక్స్‌ స్కూటర్‌ను కూడా లాంచ్‌ చేసింది.

450 సిరీస్‌ స్కూటర్ల మాదిరిగానే కొత్త ఈథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా రెండు బ్యాటరీ ప్యాక్‌ ఆప్షన్లతో విడుదలయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే ధరను పెంచి అధిక పర్ఫామెన్స్‌ ఉన్న బ్యాటరీ ప్యాక్‌తో విడుదలవుతుందా.. లేక స్కూటర్ ధరను తగ్గించి, చిన్న బ్యాటరీ ప్యాక్‌తో లాంచ్‌ చేస్తుందా అనేది వేచి చూడాలి.

More from DriveSpark

Article Published On: Monday, January 22, 2024, 19:05 [IST]
English summary
New ather rizta electric scooter spied on roads ahead of launch details here
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+