బజాజ్‌ నుంచి కొత్త ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ లాంచ్‌.. సింగిల్ ఛార్జ్‌లో 137 కి.మీ రేంజ్‌, ప్రీమియం లుక్‌

దేశంలో ఎలక్ట్రిక్ వెహికిల్స్ సేల్స్‌ పెరుగుతున్నాయి. ముఖ్యంగా టూవీలర్‌ విభాగంలో చాలా వరకు కొత్త కొత్త స్టార్టప్‌ కంపెనీలు స్కూటర్లను ఉత్పత్తి చేస్తున్నాయి. ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్‌లో ఓలా, ఏథర్‌ ఎనర్జీ తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాయి. అయితే ఈ కంపెనీకి చెందిన స్కూటర్లకు గట్టి పోటీని ఇచ్చేందుకు బజాజ్ సన్నద్ధమవుతోంది. అందులో భాగంగా కొత్త ఉత్పత్తిలతో మార్కెట్‌లో తన వాటాను పెంచుకుంటూ వస్తుంది. ఈ బ్రాండ్ నుంచి ప్రస్తుతం చేతక్ స్కూటర్ అందుబాటులో ఉంది. ఇప్పుడు దీనిని కొత్త వేరియంట్లను మార్కెట్లోకి తీసుకురావడంలో బిజీగా ఉంది. ఈ మోడల్ కొత్త స్పెషల్ ఎడిషన్ వెర్షన్‌ని ఇటీవల లాంచ్ చేసింది. తాజాగా మరో మరో వేరియంట్‌ని మార్కెట్లోకి తీసుకువచ్చింది.

బజాజ్ ఆటో చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ కొత్త వేరియంట్ చేతక్ బ్లూ 3202 (Bajaj Chetak Blue 3202)ను కూడా తన వెబ్‌సైట్‌లో లిస్ట్‌ చేసింది. ఈ కొత్త వెర్షన్ 2901, అర్బన్ వేరియంట్ల మధ్య స్కూటర్‌గా రానుంది. దీని ధర కేవలం రూ.1.15 లక్షల ఎక్స్ షోరూమ్ మాత్రమే. దీనిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 137 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు.

Bajaj Chetak Blue 3202 variant launched

చేతక్ ఈవీ అర్బన్ వేరియంట్ కంటే ఈ కొత్త వేరియంట్ ధర రూ.8,000 తక్కువ ధరలో అందుబాటులో ఉంది. కొత్త చేతక్ బ్లూ 3202 మోడల్ను కొనుగోలు చేయాలనుకునే వారు రూ .2,000 టోకెన్ అమౌంట్‌ చెల్లించి బుక్ చేసుకోవచ్చు. ఈ వేరియంట్ బ్రూక్లిన్ బ్లాక్, సైబర్ వైట్, ఇండిగో మెటాలిక్, మ్యాట్ కోర్స్ గ్రే అనే నాలుగు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

ఇక డిజైన్ పరంగా చూస్తే ఇది ఇతర వేరియంట్లను పోలి ఉంటుంది. LED డీఆర్ఎల్, కనెక్టివిటీ ఫీచర్లు, TFT ఇన్‌స్ట్రూమెంట్ కన్సోల్, ఆల్ మెటల్ బాడీ, USB ఛార్జింగ్ పోర్ట్, LED హెడ్‌ల్యాంప్ వంటి అన్ని ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఇల్యూమినేటెడ్ స్విచ్ గేర్, సాఫ్ట్ క్లోజ్ సీట్, రివర్స్ ఫంక్షన్, స్మార్ట్ కీ ఈవీ మరింత ఆకర్షణను పెంచాయి.

Bajaj Chetak Blue 3202 variant launched

బజాజ్ చేతక్ బ్లూ 3202 స్కూటర్‌ స్పోర్ట్స్, క్రాల్ మోడ్స్‌తో పాటు ఎక్కువ రేంజ్‌ అందిచడానికి ఎకో మోడ్ కూడా ఉంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో టెక్ ప్యాక్‌ని ఎంచుకుంటే వినియోగదారులు అదనపు హిల్ హోల్డ్, రోల్-ఓవర్ డిటెక్షన్‌ని కూడా పొందుతారు. కొత్త వెర్షన్ ప్రీమియం వేరియంట్ మాదిరిగానే 3.2 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్‌ని కలిగి ఉంటుంది.

కొత్త బ్యాటరీ సెల్స్ కారణంగా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ రేంజ్‌ 126 కిలోమీటర్ల నుంచి 137 కిలోమీటర్లకు పెరిగింది. బజాజ్ చేతక్ 3202 ఈవీ ఇతర వేరియంట్ల మాదిరిగానే ఏథర్ రిజ్టా, ఓలా ఎస్ 1 ప్రో, టీవీఎస్ ఐక్యూబ్ వంటి మోడళ్లకు గట్టి పోటీ ఇవ్వనుంది. బజాజ్ గత 12 నెలల్లో చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ల అమ్మకాలు గణనీయంగా పెరిగాయి.

ఆగస్టు 2023 మరియు జూలై 2024 మధ్య బజాజ్ 1,51,308 యూనిట్ల ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించింది. 2022 ఆగస్టు నుంచి 2023 జూలై మధ్య విక్రయించిన 52,169 యూనిట్లతో పోలిస్తే అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. ఆగస్టు 2023 నుంచి జూలై 2024 మధ్య కాలంలో ఎలక్ట్రిక్ వాహనాల సగటు నెలవారీ అమ్మకాలు 12,609 యూనిట్లుగా ఉన్నాయి.

డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Tuesday, September 3, 2024, 11:46 [IST]
English summary
New bajaj chetak blue 3202 variant launched at rs 1 15 lakhs check full details here
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+