New Bajaj Chetak E Scooter Full Review Video 126 కి.మీ రేంజ్‌తో బజాజ్‌ చేతక్‌ స్కూటర్‌ ఫుల్‌ రివ్యూ వీడియో

కొత్త బజాజ్‌ చేతక్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌(Bajaj Chetak Premium E Scooter Review Video) మరింత శక్తివంతమైన పవర్‌ట్రెయిన్ మరియు మరింత సాంకేతికతను కలిగి ఉంటూ చాలా మార్పులను కలిగి ఉంది. ఇందులో కొత్త 5-అంగుళాల TFT డిస్‌ప్లే, రివర్స్ మోడ్, ఇండికేటర్‌లు మరియు లైట్లను కలిగి ఉంది. బజాజ్‌ చేతక్‌ ప్రీమియం 5-అంగుళాల మల్టీ-కలర్ డిస్‌ప్లే చాలా ప్రకాశవంతంగా ఉంటుంది. ఇందులో అన్ని వివరాలను అందిస్తుంది.

కొత్త 2024 బజాజ్ చేతక్ ప్రీమియం బ్యాటరీ విషయానికొస్తే.. ఇందులో పెద్ద 3.2kWh బ్యాటరీ ప్యాక్‌ను ఉపయోగించారు. ఇది IDC ఎకో మోడ్‌లో పూర్తి ఛార్జ్‌పై 126 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుంది. కాగా చేతక్ ప్రీమియం బ్యాటరీ ప్యాక్‌ ఛార్జింగ్‌ కోసం 650w ఆన్‌బోర్డ్ ఛార్జర్‌తో వస్తుంది. ఇది 5.63 bhp తో పాటు 22.7 nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

బజాజ్‌ చేతక్‌ ప్రీమియంలో పవర్‌ట్రెయిన్‌లో మార్పుల విషయానికొస్తే కొత్త చేతక్ స్పోర్ట్స్ మోడ్‌లో ఉన్నప్పటికీ, గంటకు 55 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది. కాగా ఎకో మోడ్‌ విషయానికొస్తే ఇందులో పెద్దగా మార్పులు ఏమీ లేవు. రివర్స్‌ గేర్‌ ఆప్షన్‌ బాగా పనిచేస్తుంది. దీని ద్వారా మీరు పార్కింగ్‌ నుంచి ఈజీగా స్కూటర్‌ను బయటకు తీయొచ్చు.

New-Bajaj-Chetak-Premium-Electric-Scooter

కొత్త బజాజ్‌ చేతక్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌లో సస్పెన్షన్ సెటప్‌ను పరిశీలిస్తే.. కొన్ని ఇతర ఎలక్ట్రిక్ స్కూటర్ల మాదిరిగానే, కొంచెం గరుకుగా ఉండే రోడ్లపై కొంచెం కఠినంగా అనిపిస్తుండటాన్ని గమనించవచ్చు. అయితే ఈ స్కూటర్‌లోని సౌకర్యవంతమైన సీటు కారణంగా మీరు కొంతకాలం తర్వాత దానికి అలవాటు పడిపోతారు.

More from DriveSpark

Article Published On: Tuesday, January 16, 2024, 10:52 [IST]
English summary
New bajaj chetak electric scooter battery design performance full review video
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+