కొత్త బజాజ్‌ పల్సర్‌ 250 స్పై ఫొటోలు వైరల్‌.. బ్లూటూత్‌, డీజీ కన్సోల్‌, USD ఫోర్క్స్‌ సహా కీలక ఫీచర్లు

ప్రముఖ ద్విచక్ర వాహన తయారీదారు బజాజ్‌ ఆటో.. తన బెస్ట్‌ సెల్లింగ్‌ బ్రాండ్‌ పల్సర్‌ బైక్‌లను అప్‌డేట్‌ చేస్తోంది. ఈ క్రమంలో పల్సర్‌ N250 బైక్‌కు సంబంధించి స్పై చిత్రాలు ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతున్నాయి. దీనికి సంబంధించి పలు ఫీచర్లు, స్పెసిఫికేషన్లు బయటకు వచ్చాయి. పూర్తి సమాచారం ఈ కథనంలో..

బజాజ్‌ ఆటో(Bajaj Auto)కు భారత మార్కెట్లో ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా దాని పల్సర్‌ మోడల్‌ బైక్‌లు.. యూత్‌ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలో కస్టమర్లకు ఇంకా మెరుగైన ప్రయాణ అనుభవాన్ని అందించడానికి బజాజ్‌.. పల్సర్(Bajaj Pulsar) N160, N250 మరియు F250 బైక్‌లను అప్‌డేట్‌ చేస్తోంది.

Bajaj-Pulsar-N250-F350

బజాజ్‌ తన పల్సర్‌ మోడల్‌ బైక్‌లను వరుసగా అప్‌డేట్‌ చేస్తోంది. ఈ క్రమంలో 2023-24 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి, బజాజ్ ఆరు కొత్త పల్సర్ బైక్‌లను విడుదల చేసే యోచనలో ఉంది. ఈ మేరకు అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. కాగా పల్సర్‌ N150, N160, N250 మరియు F250 బైక్‌ అప్‌డేట్‌లు త్వరలో రానున్నాయి. ఈ మేరకు పల్సర్‌ N250, F250 తాజా స్పై షాట్‌లు ఔత్సాహికుల్లో ఆసక్తిని రేకిత్తిస్తున్నాయి.

Bajaj-Pulsar-N250-F350

స్పై ఫొటోల ద్వారా బజాజ్‌ పల్సర్‌ N250, F250(Bajaj Pulsar N250, F250) కీలకమైన అప్‌డేట్‌లను పరిశీలిస్తే.. ఇందులో ముఖ్యమైనది USD ఫ్రంట్ ఫోర్క్స్. కాగా ప్రస్తుతం, పల్సర్‌ N160 డ్యూయల్-ఛానల్ ABS మోడల్‌తో 37 mm టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్‌ను కలిగి ఉంది. ఇంకా సింగిల్-ఛానల్ ABS మోడల్‌తో 31 mm టెలిస్కోపిక్ ఫోర్క్‌లతో పనిచేస్తుంది.

కాగా పల్సర్ N250 మరియు F250 37 mm టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్‌లను ఉన్నట్లుగా స్పై ఫొటోల ద్వారా తెలుస్తోంది. ఇంకా USD ఫోర్క్‌లతో అప్‌గ్రేడ్ చేయడం వల్ల బ్రేకింగ్ సామర్థ్యంలో మెరుగదల ఉండే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇప్పటికే పల్సర్ NS160, NS200 లో USD ఫోర్క్‌లను అందించడంతో.. అప్‌డేటెడ్‌ పల్సర్ N160, N250 మరియు F250 అదే కిట్‌ను ఉపయోగించే అవకాశాలు ఉన్నాయి.

Bajaj-Pulsar-N250-F350

బజాజ్‌ పల్సర్‌ N250 లో మరో కొత్త అప్‌డేట్.. కొత్త డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్‌గా స్పై షాట్‌ల ద్వారా వెల్లడైంది. అయిత్‌ బజాజ్ బ్లూటూత్ ఆధారిత కనెక్టివిటీ ఫీచర్లను ఇందులో తీసుకువస్తే రైడర్లకు ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే బజాజ్‌ ప్రత్యర్థి బ్రాండ్లు హీరో మోటోకార్ప్ మరియు టీవీఎస్ ఇప్పటికే టెక్నాలజీ పరంగా ముందున్నాయి.

Bajaj-Pulsar-N250-F350

అయినప్పటికీ మార్కెట్లో పల్సర్ విక్రయాలు టాప్‌ ప్లేస్‌లోనే కొనసాగుతున్నాయి. కానీ కస్టమర్లు కొత్తదనాన్ని, టెక్నాలజీ పరంగా ఎక్కువ అప్‌డేట్లను కోరుకుంటుండటంతో.. బజాజ్‌ పల్సర్‌ ఆ విషయంలో ముందుండాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా యువ కస్టమర్లు.. కాల్స్‌, మెసేజెస్‌, నావిగేషన్‌, మ్యూజిక్‌ను అనుమతించే కనెక్టివిటీ ఫీచర్లను ఎక్కువగా కోరుకుంటారు.

కాగా బజాజ్‌ పల్సర్‌ N160, N250 మరియు F250 బైక్‌లు కొత్త కలర్స్‌లో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. కొత్త గ్రాఫిక్స్ మరియు డీకాల్స్‌తో కూడా రావచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న పల్సర్ N160 మోడల్‌ను బ్రూక్లిన్ బ్లాక్, రేసింగ్ రెడ్ మరియు కరేబియన్ బ్లూ కలర్ ఆప్షన్‌లతో అందుబాటులో ఉండగా.. N250, F250 బైక్‌లను రేసింగ్ రెడ్, టెక్నో గ్రే మరియు కరేబియన్ బ్లూ కలర్‌తో కొనుగోలు చేయవచ్చు.

Bajaj-Pulsar-N250-F350

ఇక ఇంజిన్‌ విషయానికొస్తే పల్సర్‌ N250 లో ఎలాంటి మార్పులు లేనట్లుగా తెలుస్తోంది. అప్‌డేటెడ్‌ బైక్‌లు ప్రస్తుత ఇంజన్ ఆప్షన్‌లతోనే కొనసాగే అవకాశాలు ఉన్నాయి. అయితే కొన్ని చిన్న ఇంజిన్ ట్వీక్‌లతో పనితీరు కొంచెం మెరుగుపడవచ్చు. కాగా పల్సర్ N160 164.82 cc, సింగిల్ సిలిండర్, SOHC, ఆయిల్ కూల్డ్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. గరిష్ఠంగా 16 PS పవర్, 14.65 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

పల్సర్‌ N160 5-స్పీడ్ స్థిరమైన మెష్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. ఇక బజాజ్ పల్సర్ N250 మరియు F250 లలో 249.07 cc, సింగిల్ సిలిండర్, SOHC, ఆయిల్ కూల్డ్ ఇంజిన్‌తో పనిచేస్తాయి. 24.5 PS మరియు 21.5 Nm శక్తిని ఉత్పత్తి చేస్తాయి. 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటాయి.

Bajaj-Pulsar-N250-F350

అప్‌డేటెడ్‌ పల్సర్ N160, N250 మరియు F250 బైక్‌లు మార్చి 2024 చివరిలోపు మార్కెట్లో లాంచ్‌ అయ్యే సూచనలు ఉన్నాయి. వీటి ధరలు కూడా రూ. 5,000 వరకు పెరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అయినప్పటికీ, పల్సర్ బైక్‌లు మార్కెట్లో తక్కువ ధరలోనే అందుబాటులో ఉంటున్నాయి. రూ. 1.50 లక్షల లోపే కొనుగోలు చేయవచ్చు.

More from DriveSpark

Article Published On: Tuesday, January 23, 2024, 11:43 [IST]
English summary
New bajaj pulsar 250 spied testing bluetooth digi console and usd forks updates
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+