Hero New Bike: హీరో మోటోకార్ప్‌ నుంచి కొత్త బైక్‌ లాంచ్‌.. ఎప్పుడంటే.??

కొత్త సంవత్సరం ప్రారంభమైంది. ఈ ఏడాది జనవరిలో కొత్త టూ వీలర్లను లాంచ్‌ చేసేందుకు ప్రముఖ కంపెనీలు సిద్ధంగా ఉన్నాయి. హీరో, హోండా, రాయల్‌ ఎన్‌ఫీల్డ్ నుంచి ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ద్విచక్ర వాహనాలు విడుదల కానున్నాయి. మరి ఆ బైక్‌ల వివరాలు ఈ కథనంలో..

భారత మార్కెట్లో అతి పెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్‌ నుంచి త్వరలో కొత్త బైక్‌ విడుదల కానుంది. ఈ మేరకు హీరో నుంచి ఆసక్తికర టీజర్ విడుదలైంది. కాగా ఇప్పటికే హీరో మోటోకార్ప్‌కు చెందిన అనేక బైక్‌లు మార్కెట్లో మంచి డిమాండ్‌ను ఏర్పరుచుకోగా.. కొత్త ఏడాది సందర్భంగా వస్తున్న ఈ సరికొత్త బైక్‌పై ఆటో రంగంలో ఆసక్తి నెలకొంది.

Hero-2-5r-Xtunt

ఈ క్రమంలో హీరో లైనప్‌లోకి మరో కొత్త బైక్‌ చేరబోతున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ విషయాన్ని అధికారికంగా ధ్రువీకరిస్తూ ఆ సంస్థ టీజర్‌ను కూడా విడుదల చేసింది. దాంతో పాటు ఈ కొత్త బైక్‌ విడుదల తేదీని కూడా ప్రకటించారు. కొత్త బైక్‌ను ఈ నెల(జనవరి 2024) 22వ తేదీన హీరో మోటోకార్ప్‌ ప్రవేశపెట్టనుంది.

ఈ నేపథ్యంలో కొత్త సంవత్సరంలో విడుదల కాబోతున్న మొదటి బైక్‌ ఇదే కావడం విశేషం. ఈ బైక్‌ 440 సీసీ బైక్‌గా రాబోతుందని నివేదికల ద్వారా తెలుస్తోంది. అయితే, ఈ సమాచారాన్ని హీరో మోటోకార్ప్ అధికారికంగా ప్రకటించలేదు. ప్రస్తుతం భారత మార్కెట్లో హీరో మోటోకార్ప్, హార్లే-డేవిడ్సన్ ఒక కూటమి కింద పనిచేస్తున్నాయి. ఈ రెండింటి భాగస్వామ్యంతో X440 విడుదలైంది. ఇది రోడ్‌స్టర్ తరహా బైక్ మోడల్.

కాగా హీరో సంస్థ నుంచి రాబోయే బైక్ మోడల్ ఈ బైక్ మోడల్‌, అదే ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడి ఉండొచ్చని ఆటో నిపుణులు భావిస్తున్నారు. దీనిపై లాంచ్‌ రోజు స్పష్టత రానుంది. అదే ఎయిర్‌, ఆయిల్-కూల్డ్ ఇంజిన్‌తో వస్తున్నా.. పవర్ క్రూయిజర్‌లో మార్పులు ఉండొచ్చు. తక్కువ ధరలోనే ఈ బైక్‌ విడుదలయ్యే అవకాశం ఉంది.

Royal-Enfield-Shotgun-650

రాయల్ ఎన్‌ఫీల్డ్ షాట్‌గన్(Royal Enfield Shotgun 650) 650ను ఇటివీల యునైటెడ్ స్టేట్స్‌లో ఆవిష్కరించారు. సూపర్ మెటోర్ 650 ఫ్లాగ్‌షిప్ క్రూయిజర్‌తో పోలిస్తే ఇది చిన్న వీల్స్‌, విభిన్న ఎర్గోనామిక్స్ ఇంకా కొత్త సబ్‌ఫ్రేమ్‌ను కలిగి ఉండొచ్చు. ధర దాదాపు రూ. 3.3-3.4 లక్షలు (ఎక్స్-షోరూమ్) మధ్య ఉండొచ్చు. 648 cc సమాంతర-ట్విన్ ఇంజిన్‌, 6-స్పీడ్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది. లాంచ్‌ తేదీపై స్పష్టత రావాల్సి ఉంది.

జపనీస్‌ ఆటో మేకర్ హోండా.. జనవరి 9, 2024న తన ఆరవ తరం మోడల్ ఆధారంగా Activa యొక్క ఎలక్ట్రిఫైడ్ వెర్షన్‌ను ఆవిష్కరించనున్నట్లు సమాచారం. హీరో ప్లాన్‌ చేసినట్లుగా రెండు సరికొత్త జీరో-ఎమిషన్ స్కూటర్‌లలో ఇది భాగం కానుంది. అయితే ఫీచర్లు, స్పెసిఫికేషన్లకు సంబంధించి వివరాలేవీ అందుబాటులో లేవు. స్థిరమైన బ్యాటరీ ప్యాక్‌, ఆకర్షణీయమైన ఫీచర్లతో ఈ స్కూటర్‌ విడుదల కానుంది.

Honda-Activa-Electric

తదుపరి తరం Husqvarna Svartpilen 401 ఈ నెలలో భారత మార్కెట్లోకి వచ్చే సూచనలు ఉన్నాయి. ఈ బైక్‌ చాలా వరకు ఆల్-న్యూ మోటార్‌సైకిల్ న్యూ జెన్‌ KTM 390 డ్యూక్‌ను పోలి ఉంటుంది. ఇందులో మెకానికల్ అండర్‌పిన్నింగ్‌లు ఉండగా.. కొత్త 399 cc లిక్విడ్-కూల్డ్ ఇంజిన్‌తో పనిచేస్తుంది.

ఈ నెల 6 న ఏథర్ ఎనర్జీ 450 అపెక్స్‌(Ather 450 Apex)ను లాంచ్ చేయనుంది. అధిక పనితీరుతో ఈ స్కూటర్‌ విడుదల కానుంది. దాని విభాగంలో అత్యంత వేగవంతమైన స్కూటర్‌గా సంస్థ వెల్లడించింది. ఇందులో ఇతర రైడ్ మోడ్‌లతో పాటు అదనంగా warp+ మోడ్‌ను కలిగి ఉంది.

More from DriveSpark

Article Published On: Monday, January 1, 2024, 18:59 [IST]
English summary
New bikes and electric scooters launch in january 2024 check full details here
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+