అత్యంత ఖరీదైన బైక్‌ను లాంచ్ చేసిన BMW.. గంటకు 278 కి.మీ వేగం

లగ్జరీ ద్విచక్ర వాహన తయారీ సంస్థ బీఎమ్‌డబ్ల్యూ మోటోరాడ్ ఇండియా తన కొత్త బీఎమ్‌డబ్ల్యూ ఎమ్ 1000 ఎక్స్‌ఆర్ బైక్‌ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. అత్యంత ఖరీదైన ధరలో ఈ బైక్‌ను సంస్థ ప్రవేశపెట్టింది. ఈ కొత్త BMW M 1000 XR ధర, డిజైన్, ఫీచర్లు పూర్తి వివరాలు ఈ కథనంలో..

కొత్త BMW M 1000 XR ను బీఎండబ్ల్యూ మోటోరాడ్ రూ. 45 లక్షల ధరతో లాంచ్ చేసింది. కొత్త BMW M 1000 XR బైక్ యొక్క M కాంపిటీషన్ వేరియంట్‌ను కలిగి ఉంటుంది. ఈ బైక్ చక్రాలు, సైడ్ ప్యానెల్‌లు, ఫ్రంట్ వీల్ కవర్ మరియు మరిన్ని కార్బన్ ఫైబర్ భాగాలను కలిగి ఉంటుంది.

New-BMW-M-1000-XR-Launched-In-India

M కాంపిటీషన్ ట్రిమ్‌లోని M 1000 XR ప్రత్యేకమైన హై-గ్లాస్ బ్లాక్ కలర్‌తో వస్తుంది. ఇది హై గ్లాస్ కార్బన్ ఫైబర్ సైడ్ ప్యానెల్‌లతో ఉంటుంది. బాడీవర్క్ విషయానికొస్తే BMW M 1000 XR షార్ప్ మరియు స్పోర్టీగా ఉంటుంది. ఇంటిగ్రేటెడ్ DRLలతో కూడిన స్ప్లిట్ LED హెడ్‌లైట్‌లు, ఒక చిన్న విండ్‌స్క్రీన్ మరియు ఫెండర్‌లు, పిలియన్ గ్రాబ్ హ్యాండిల్స్ ఆకర్షణీయంగా ఉంటాయి.

M 1000 XR బైక్‌లో క్లచ్ మరియు బ్రేక్ లివర్‌ల కోసం తేలికపాటి భాగాలు, టైటానియం సైలెన్సర్‌పై కార్బన్ ఎండ్ క్యాప్, సీట్లపై M లోగో మరియు మరిన్ని ఫీచర్లు ఉన్నాయి. ఈ కొత్త BMW M 1000 XR బైక్‌లో 999cc, ఇన్‌లైన్-ఫోర్ ఇంజిన్‌తో పనిచేస్తుంది.

New-BMW-M-1000-XR-Launched-In-India

ఈ ఇంజిన్ 12,750rpm వద్ద 201bhp మరియు 11,000rpm వద్ద 113Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. BMW M 1000 XR బైక్ 3.2 సెకన్లలో 0 నుండి 100 kmph వేగాన్ని అందుకుంటుంది. ఈ ఖరీదైన బైక్ గరిష్ఠంగా గంటకు 278 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది. ఈ కొత్త బైక్ నాలుగు రైడ్ మోడ్‌లను కలిగి ఉంటుంది.

ఈ బైక్ రోడ్, డైనమిక్, రేస్ మరియు రేస్ ప్రో అనే నాలుగు రైడింగ్ మోడ్ సెట్టింగ్‌లతో వస్తుంది. ఈ కొత్త BMW M 1000 XR బైక్‌లో M GPS డేటాలాగర్ మరియు ల్యాప్ టైమర్ కోసం OBD ఇంటర్‌ఫేస్ ప్రత్యేకంగా ఉంటుంది. ఈ బైక్ మోడ్‌లతో పాటు, బైక్ లాంచ్ కంట్రోల్, పిట్‌లేన్ స్పీడ్ లిమిటర్ మరియు బ్రేక్ స్లైడ్ అసిస్ట్ ఫంక్షనాలిటీని కూడా కలిగి ఉంటుంది.

New-BMW-M-1000-XR-Launched-In-India

ఇది రైడర్ బైక్‌ను టర్నింగుల్లో సులభంగా యాక్సెస్ చేయడానికి అనుమతిస్తుంది. బైక్ ముందువైపు 120 సెక్షన్ టైర్లు మరియు వెనుకవైపు 200 సెక్షన్ టైర్లతో 17 అంగుళాల చక్రాలపై ప్రయాణిస్తుంది. బ్రేకింగ్ సిస్టమ్ విషయానికొస్తే ఈ బైక్ ముందు భాగంలో ట్విన్ డిస్క్ బ్రేక్ మరియు వెనుక భాగంలో డిస్క్ బ్రేక్‌ను సంస్థ అందిస్తోంది.

కొత్త BMW M 1000 XR బైక్ యొక్క సస్పెన్షన్ సెటప్ గురించి పరిశీలిస్తే, బైక్ ముందు భాగంలో USD ఫోర్క్‌తో ఫ్రేమ్‌ను కలిగి ఉంటుంది, రీబౌండ్, కంప్రెషన్ మరియు ప్రీలోడ్ కోసం 10-లెవెల్ సర్దుబాట్లు ఉన్నాయి. వెనుక భాగంలో సర్దుబాటు చేయగల మోనోషాక్ సెటప్‌ను పొందుతుంది.

కాగా ఖరీదైన BMW M 1000 XR బైక్ కొనుగోలు చేయాలనుకునే కస్టమర్ల కోం బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. ఆసక్తి గల కస్టమర్లు సమీకృత డీలర్‌షిప్ లేదా సంస్థ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. స్పోర్టీ పర్ఫామెన్స్‌తో విడుదలైన ఈ బైక్.. యూత్‌కు తప్పకుండా నచ్చుతుందని సంస్థ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

More from DriveSpark

Article Published On: Tuesday, May 14, 2024, 15:09 [IST]
English summary
New bmw m 1000 xr launched in india price specs features details here
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+