కొత్త కలర్ ఆప్షన్‌లో లాంచ్ అయిన కవాసకి నింజా 650 - వివరాలు
భారతీయ మార్కెట్లో ఎప్పటికప్పుడు కొత్త బైకులు లేదా అప్డేటెడ్ బైకులు లాంచ్ అవుతూనే ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం వాహన ప్రియులు కొత్త ఉత్పత్తులను కోరుకోవడం, ఇది మాత్రమే కాకుండా మార్కెట్లో కంపెనీ తమ ఉనికిని చాటుకోవడానికి మరియు ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇవ్వడానికి అని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో భాగంగానే ప్రముఖ బైక్ తయారీ సంస్థ కవాసకి గ్లోబల్ మార్కెట్లో సరికొత్త 2025 నింజా 650 బైక్ లాంచ్ చేసింది. ఇది దాని మునుపటి మోడల్స్ కంటే కూడా భిన్నంగా ఉంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
కవాసకి లాంచ్ చేసిన కొత్త 2025 నింజా 650 బైక్ ఇప్పుడు రెండు కొత్త కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. కవాసకి స్టాండర్డ్ వేరియంట్‌తో పాటు, రేసింగ్ టీమ్ యొక్క లైవరీ అండ్ గ్రాఫిక్‌లను ప్రదర్శిస్తూ నింజా 650 కేఆర్టీ ఎడిషన్‌ను కూడా విడుదల చేసింది. ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉండటం గమనించవచ్చు. డిజైన్ మాత్రమే కాకుండా ఫీచర్స్ కూడా బైక్ రైడర్లకు చాలా అనుకూలంగా ఉంటాయి.

కంపెనీ లాంచ్ చేసిన కొత్త కలర్ ఆప్షన్స్ లైమ్ గ్రీన్ / ఎబోనీ / పెర్ల్ బ్లిజార్డ్ వైట్ మరియు క్యాండీ స్టీల్ ఫర్నేస్ ఆరెంజ్ / మెటాలిక్ స్పార్క్ బ్లాక్ / మెటాలిక్ రాయల్ పర్పుల్. ఇవి రెండు చాలా కొత్తగా కనిపిస్తాయి. అయితే ఈ కలర్ బైకులు భారతీయ మార్కెట్లో అందుబాటులో లేదు. ప్రస్తుతం ఇవి రెండూ అంతర్జాతీయ మార్కెట్లో మాత్రమే అందుబాటులో ఉన్నట్లు సమాచారం.
2012లో కవాసకి తన నింజా 650 బైకును భారతదేశంలో విక్రయించడం ప్రారంభించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ బైక్ చిన్న చిన్న అప్డేట్స్ పొందుతూనే ఉంది. అంతే కాకుండా మంచి అమ్మకాలను పొందుతోంది. ఈ బైక్ కేవలం భారతదేశంలో మాత్రమే కాకుండా అంతర్జాతీయ మార్కెట్లో కూడా గొప్ప అమ్మకాలను పొందుతూ.. ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇస్తోంది.

గ్లోబల్ మార్కెట్లో లాంచ్ అయిన కవాసకి 2025 నింజా 650 బైకులు డిజైన్ పరంగా కొంత అప్డేట్స్ పొందినప్పటికీ యాంత్రికంగా ఎటువంటి మార్పులకు లోను కాలేదు. కాబట్టి ఈ బైకులో అదే 649సీసీ ప్యారలల్ ట్విన్ ఇంజిన్ ఉంది. ఇది 8000 rpm వద్ద 68 హార్స్ పవర్ మరియు 6700 rpm వద్ద 64 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. పనితీరు పరంగా కూడా ఉత్తమంగా ఉంటుందని తెలుస్తోంది.
కొత్త కలర్ ఆప్షన్ పొందిన 2025 కవాసకి 650 బైక్ TFT కలర్ డిస్‌ప్లే, ఎల్ఈడీ లైటింగ్, బ్లూటూత్ కనెక్టివిటీ, ట్రాక్షన్ కంట్రోల్, మల్టిపుల్ రైడింగ్ మోడ్స్ మరియు డ్యూయెల్ ఛానల్ ఏబీఎస్ వంటివాటిని పొందుతుంది. ఇవన్నీ వాహన వినియోగదారులకు మంచి రైడింగ్ అనుభూతిని అందిస్తాయి. ఇప్పుడు గ్లోబల్ మార్కెట్లో కనిపించిన ఈ కొత్త కలర్ ఆప్షన్ బైకులు మన దేశంలో లాంచ్ అవుతాయా? లేదా అనేది తెలియల్సి ఉంది.

ప్రస్తుతం కవాసకి నింజా 650 ధర భారతదేశంలో రూ. 7.16 లక్షలు (ఎక్స్ షోరూమ్). కవాసకి కంపెనీ యొక్క బైకులకు కూడా భారతీయ మార్కెట్లో డిమాండ్ ఉంది. అయితే వీటిని సాధారణ ప్రజలకంటే సెలబ్రిటీలే ఎక్కువ కొనుగోలు చేస్తుంటారు. దీనికి ప్రధాన కారణం ధర ఎక్కువగా ఉండటమే. కంపెనీ ఇటీవల కొన్ని ఆధునిక మోడల్స్ అధికారికంగా లాంచ్ చేసింది. ఇవన్నీ తప్పకుండా మార్కెట్లో మంచి ఆధారణ పొందుతాయని భావిస్తున్నాము.
ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications








