కైనెటిక్‌ లూనాకు పోటీగా హీరో Vida లైనప్‌లో కొత్త స్కూటర్.. ఫస్ట్‌ లుక్‌ ఇదిగో..

భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ స్కూటర్లకు ఆదరణ పెరుగుతోంది. ప్రజాదరణకు తగినట్లుగా ఈవీ కంపెనీలు కూడా సరికొత్త మోడళ్లలో ఎలక్ట్రిక్‌ స్కూటర్లను విడుదల చేస్తున్నాయి. కాగా కైనెటిక్‌ ఇ లూనాకు కమర్షియల్‌ సెగ్మెంట్‌లో పోటీగా హీరో మోటోకార్ప్‌ నుంచి త్వరలో మరో కొత్త స్కూటర్‌ లాంచ్‌ కానుంది. ఇందుకు సంబంధించి ఫస్ట్‌ లుక్‌ను సంస్థ విడుదల చేసింది.

దేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్ల సెగ్మెంట్‌లో స్టార్టప్‌లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. మార్కెట్లో అత్యధిక శాతం వాటాతో ఇ స్కూటర్లను విక్రయిస్తున్నాయి. ఓలా, ఏథర్‌ ఎనర్జీ, క్వాంటమ్‌ ఎనర్జీ సంస్థలతో పాటు పలు కంపెనీలు స్టార్టప్‌లుగా ప్రవేశించి మంచి సేల్స్‌ను రాబడుతున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ ఆటోమొబైల్‌ కంపెనీలు కూడా ఈవీ సెగ్మెంట్‌లోకి ప్రవేశించాయి.

Hero-Vida-B2B-E-Scooter-First-Look

1970, 80 వ దశకంలో భారత మార్కెట్‌ను ఏలిన కైనెటిక్‌ లూనా.. ఇటీవల మళ్లీ కైనెటిక్‌ ఇ లూనాతో మార్కెట్లోకి ప్రవేశించింది. తాజాగా ఈ ఎలక్ట్రిక్‌ మోపెడ్‌ ది బెస్ట్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్ మోడల్‌గా కూడా అవార్డు గెలుచుకుంది. కాగా ఈ స్కూటర్‌కు పోటీగా ఇప్పుడు హీరో మోటోకార్ప్‌.. Vida లైనప్‌లో మరో స్కూటర్‌ను త్వరలో తీసుకువచ్చేందుకు సన్నాహాలు మొదలుపెట్టింది. ఇందుకు సంబంధించి ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేసింది.

కాగా ఈ రాబోయే Vida మోడల్‌లోని కొన్ని భాగాలు V1 ఎలక్ట్రిక్‌ స్కూటర్‌తో సిరీస్‌లోని కొన్ని భాగాలను పోలి ఉన్నట్లుగా తెలుస్తోంది. Hero MotoCorp CEO నిరంజన్ గుప్తా ఇంతకుముందు Vida పోర్ట్‌ఫోలియో.. వచ్చే ఏడాదిలో మూడు కొత్త మోడళ్లతో విస్తరిస్తుందని గతంలో వెల్లడించారు. 'Mid-Price స్కూటర్', "Financial Scooter" స్కూటర్ మరియు B2B మోడల్‌తో రానున్నట్లు తెలిపారు.

Hero-Vida-B2B-E-Scooter-First-Look

కాగా సంస్థ ఇటీవల Vida V1 Plus స్కూటర్‌ను మళ్లీ రీలాంచ్‌ చేసిన సంగతి తెలిసిందే. ఇక కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ డిజైన్ పేటెంట్‌ను సంస్థ తిరిగి ప్రవేశపెట్టింది. ఇక ఇప్పుడు విడుదల చేసిన టీజర్‌ మూడో మోడల్‌కు సంబంధించి ఫస్ట్‌ లుక్‌గా తెలుస్తోంది.

కాగా ఈ కొత్త స్కూటర్‌లోని కొన్ని భాగాలు V1 మోడల్‌ల నుంచి తీసుకున్నట్లుగా అనిపిస్తుంది. Yulu, Luna వంటి ఫ్లోర్‌బోర్డ్‌ను కలిగి ఉండదని తెలుస్తోంది. ఫ్రంట్ వీల్, డిస్క్ బ్రేక్, చిన్న ఫ్లైస్క్రీన్ మరియు ఫోర్క్.. Vida V1 రేంజ్‌తో పోలి ఉండొచ్చు. మిగిలిన భాగాలు పూర్తిగా భిన్నంగా రాబోతున్నాయి. ప్రకాశవంతమైన నియాన్ పసుపు డబుల్ క్రెడిల్ ఫ్రేమ్ ఎలక్ట్రిక్ మోటారు, బ్యాటరీ ప్యాక్, ఇతర ఎలక్ట్రికల్‌ భాగాలతో రానుంది.

Hero-Vida-B2B-E-Scooter-First-Look

యులు ఉత్పత్తులు మరియు కైనెటిక్ ఇ లూనా మాదిరిగా కాకుండా.. విడా B2B మోడల్‌లో ఫ్లోర్‌బోర్డ్ ఉండదు. దానికి బదులుగా ముందు మరియు వెనుక రెండు లగేజ్ రాక్‌లు ఉంటాయని ఫస్ట్‌ లుక్‌ ద్వారా తెలుస్తోంది. ఈ రకమైన వాహనాలు ఒకేసారి 100 కిలోల కంటే ఎక్కువ లోడ్ తీసుకుంటాయని భావిస్తే.. Vida ఆఫర్ ట్రిపుల్ డిజిట్లలో పేలోడ్ సామర్థ్యాన్ని అందించవచ్చు.

అయితే ఈ కొత్త సరసమైన ధరలో రాబోతున్న Vida ఇ-స్కూటర్ మరియు ఈ లాస్ట్-మైల్ మొబిలిటీ ప్రొడక్ట్ రెండూ 2025 ఆర్థిక సంవత్సరంలో విడుదల కానున్నాయి. సరైన తేదీపై స్పష్టత లేదు. హీరో మోటోకార్ప్‌ నుంచి Vida V1 స్కూటర్లు మంచి ఆదరణ పొందుతున్నాయి. రాబోతున్న ఈ స్కూటర్‌ కూడా వ్యాపార అవసరాలకు ఉపయోగకరంగా ఉంటుందని సంస్థ భావిస్తోంది.

More from DriveSpark

Article Published On: Tuesday, March 26, 2024, 14:51 [IST]
English summary
New electric scooter in hero vida line up first look released rival for yulu and luna
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+