టాప్ కంపెనీ నుంచి మంచి స్కూటర్‌ వచ్చేస్తుంది.. ఇక మార్కెట్‌లో దబిడి దిబిడే!

"భారత్ మొొబిలిటీ గ్లోబల్ ఎక్స్ పో 2025" (Auto Expo 2025) కోసం ఆటోమొబైల్ ప్రేమికులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. జనవరి 17, 18న జరిగే ఈ ఈవెంట్‌లో లాంచ్‌ అయ్యే కొత్త కార్లు, బైక్స్‌ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు.. వాహన తయారీ సంస్థలు కూడా తమ కొత్త వెహికల్స్‌తో అందరినీ ఆశ్చర్యపరిచేందుకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే అనేక సంస్థలు తమ వాహనాలకు సంబంధించిన గ్లింప్స్‌ని కూడా విడుదల చేశాయి. ఇదే కోవలో ప్రపంచ ప్రఖ్యాతి చెందిన టూ-వీలర్స్ బ్రాండ్ హీరో మోటోకార్ప్ కూడా కొత్త స్కూటర్‌నిని లాంచ్ చేసేందుకు రెడీ అవుతోంది. ఇందులో భాగంగా.. తమ బ్రాండ్ నుంచి పేరొందిన హీరో డెస్టినీ 125ని సరికొత్త అవతారంలో లాంచ్‌ చేయనుంది. ఆ విశేషాలు మీకోసం..

సరికొత్త డెస్టినీ 125 స్కూటర్‌ని త్వరలో తీసుకురానున్నట్లు ఇదివరకే హీరో సంస్థ ప్రకటించింది. అయితే దీని లాంచ్‌ తేదీ మాత్రం అధికారికంగా వెల్లడించలేదు. అయితే ఆటో ఎక్స్ పో 2025లోనే ఈ స్కూటర్‌ని లాంచ్‌ చేసే అవకాశం ఉంది. ఈ స్కూటర్‌ను హీరో సంస్థ తొలుత 2024 లోనే విడుదల చేయాలని భావించినప్పటికీ కొన్ని కారణాల రీత్యా దీని విడుదలను వాయిదా వేసింది. ఇప్పుడు ఆటో ఎక్స్‌లో ప్రవేశపెట్టనున్నారు.

2025 Hero Destini

ఈ స్కూటర్ ఫ్రంట్‌ మోడ్రన్‌ రెట్రో లుక్‌లో కనిపించనుంది. ఈ స్కూటర్‌లో కొత్త డిజైన్‌లో హెడ్‌లైట్స్, సైడ్ ప్యానల్స్ స్టైలిష్ లుక్‌ను అందించనున్నాయి. ఈ స్కూటర్‌లోని టాప్ వేరియంట్ పూర్తిగా బ్లాక్ షేడ్‌లో దర్శనమివ్వనుంది. ఈ స్కూటర్‌లో కొత్తగా ఆప్రాన్, మిర్రర్ర్స్, సైడ్ ప్యానెల్, టెయిల్‌ల్యాంప్స్‌ కాపర్ ఇన్‌సర్ట్‌ని కలిగి ఉంటుంది. అందువల్ల లుక్‌ డిఫరెంట్‌గా ఉండనుంది.

అంతేగాకుండా డార్క్ బ్రౌన్ కలర్‌లో ఉండే ఫ్లోర్ బోర్డ్ కలదు. వెడల్పుగా, పొడవుగా ఉండే సౌకర్యవంతమైన రైడింగ్ సౌకర్యంతో వస్తుంది. దీంతో పాటు సీటు వెనకాల ఉండే గ్రాబ్- రెయిల్ నడుముకు ఆనుకునేలా ఉండి, ప్రయాణికులకు కంఫర్ట్ సీటింగ్ అనుభూతిని ఇస్తుంది. ఈ స్కూటర్ ఇంకా మరెన్నో అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లను కలిగి ఉంది.

2025 Hero Destini

డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, బ్లూటూత్ కనెక్టివిటీ, నేవిగేషన్ సదుపాయాలు డెస్టినీ 125 స్కూటర్‌లో ఉన్నాయి. ఇక దీని పవర్‌ట్రైన్ విషయానికి వస్తే.. ఇది 125 సీసీ ఇంజిన్‌తో వస్తుంది. ఇది 7,000 rpm వద్ద 9 bhp పవర్‌ అలాగే 5,500 rpm వద్ద 10.4 Nm టార్క్‌ని విడుదల చేస్తుంది. ఈ స్కూటర్ అలాయ్ వీల్స్ కలిగి ఉంటుంది.

కోపిక్ ఫోర్క్ మోనోోషాక్‌తో ఈ స్కూటర్ ఫ్రేమ్ డిజైన్ చేశారు. దీని బ్రేకింగ్ డ్యూటీస్‌ను పరిశీలిస్తే.. ముందు భాగంలో డిస్క్ బ్రేక్ ఉండగా.. వెనుక వైపు డ్రమ్ బ్రేక్స్‌తో ఉంది. అయితే ఎంట్రీ లెవెల్ వేరియంట్‌లో మాత్రం డ్రమ్ బ్రేక్‌ ఉండనుంది. ఇది హోండా యాక్టివా 125, సుజుకీ 125, టీవీఎస్ జూపిటర్ 125 వంటి ఇతర స్కూటర్‌లకు గట్టి పోటీ ఇవ్వనుంది.

2025 Hero Destini Launch

ఇక దీని ధర రూ.80,000 నుంచి రూ.85,000 మధ్య ఉండనుందని అంచనా. అంతేకాకుండా దీని మైలేజ్ కూడా మెరుగ్గానే ఉండనున్నట్లు తెలుస్తోంది. దీని స్టైలిష్ లుక్ సహా లో-మెయింటినెన్స్ కారణంగా ఇది కస్టమర్లను విపరీతంగా ఆకట్టుకుంటుందంని హీరో సంస్థ భావిస్తోంది.

భారత్ ‌మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో జనవరి 17, 18 వ తేదీల్లో న్యూదిల్లీలోని భారత్ మండపం వేదికగా జరగనుంది. ఈ ఈవెంట్లో 50 కి పైగా దేశాల నుంచి దాదాపు 35కు పైగా వాహన తయారీ సంస్థలు పాల్గొననున్నాయి. ఆటోమొబైల్స్ ఆటో కాంపోనెంట్స్, టైర్లు, ఈ మొబిలిటీ, సాఫ్ట్‌వేర్, స్టీల్ బ్యాటరీస్ సంబంధిత విషయాలను కంపెనీలు పరిచయం చేయనున్నాయి.

More from DriveSpark

Article Published On: Tuesday, December 31, 2024, 15:49 [IST]
English summary
New hero 125 destini scooter is going to be launch in auto expo 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+