సరికొత్త హీరో డెస్టినీ స్కూటర్‌ రాబోతుంది.. ప్రీమియం డిజైన్‌, పూర్తి అప్‌గ్రేడ్స్‌తో మార్కెట్‌లోకి!

హీరో మోటోకార్ప్ నుంచి అత్యధికంగా అమ్ముడవుతున్న స్కూటర్లలో హీరో డెస్టినీ నంబర్ 1 స్థానంలో ఉంది. ఇది హోండా యాక్టివాకు గట్టి పోటీని ఇస్తున్న కానీ దానిని బీట్‌ చేయలేక పోతుంది. అంతే కాకుండా గత కొన్ని రోజులుగా ఈ మోడల్‌కి ప్రజాదరణ తగ్గింది. ఇందుకు హీరో స్కూటర్లకు ప్రత్యేకమైన డిజైన్, స్టైలింగ్ లేకపోవడం ఒక కారణం కావచ్చు. కొత్త డెస్టినీ వంటి రాబోయే మోడళ్లతో వినియోగదారులను రాబట్టాలని చూస్తుంది. ప్రస్తుతం హీరో మోటోకార్ప్ నుంచి డెస్టిని 125 అత్యధికంగా అమ్ముడవుతుండటం విశేషం.

ఆ కంపెనీ నుంచి వస్తున్న లైనప్‌లో ప్రస్తుతం అత్యంత సరసమైన మోడల్‌గా డెస్టినీ స్కూటర్‌ ఉంది. హీరో ఇప్పుడు కొత్త డెస్టినీ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ని విడుదల చేయాలని భావిస్తోంది. కొత్త హీరో డెస్టినీ 125 డిజైన్‌, స్టైలింగ్‌లో భారీ మార్పులు ఉండే అవకాశం ఉంది. గత ఏడాది ఆగస్టులో డెస్టినీ ప్రైమ్ పేరుతో కొత్త వేరియంట్ లాంచ్ చేసింది. ఇది కూడా మార్కెట్‌లో అంతంత మాత్రంగానే రాణించింది.

New Hero Destini Teaser Released

ఇక త్వరలో రాబోయే కొత్త హీరో డెస్టినీ 125 స్కూటర్ తక్కువ బాడీ ప్యానలింగ్‌తో కొత్త వెస్పా, లాంబ్రెట్టా (Lambretta) బ్రాండ్ స్కూటర్లను పోలిన డిజైన్‌లో దీనిని తీసుకువచ్చే అవకాశం ఉంది. ఈ కొత్త స్కూటర్ ఫ్రంట్ అప్రాన్ కొత్త లైట్ సెటప్, పొడవైన టెయిల్‌లైట్స్‌ వంటివి ఇందులోని ప్రధాన డిజైన్ మార్పులు అని చెప్పవచ్చు. ఫ్రంట్ ఫెండర్, హెడ్‌లైట్, కౌల్, రియర్ వ్యూ మిర్రర్స్‌లో మార్పులు స్పష్టంగా కనిపించనున్నాయి.

కొత్త డెస్టినీలో కొత్త డ్యూయల్-టోన్ పెర్ల్ బ్లాక్ కలర్‌లో అందించే అవకాశం ఉంది. ఈ అప్డేటెడ్ స్కూటర్‌లో మరిన్ని అద్భుతమైన కలర్ ఆప్షన్లు ఉండవచ్చు. సైడ్‌ డిజైన్‌లో కొత్త డ్యూయల్-టోన్ స్టెప్డ్ సీటు కలదు. ఇది స్పోర్టీ లుక్‌తో పాటు దూర ప్రయాణాల్లో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా మీకు సహాయపడుతుంది. సైడ్ ప్యానెల్స్ సరైన ఎత్తులో వస్తాయి.

New Hero Destini Teaser Released

సైడ్ ప్యానెల్‌పై ఉన్న 3D 'డెస్టినీ' లోగో స్కూటర్ డైనమిక్ ప్రొఫైల్‌కి మరింత క్రేజీ లుక్‌ని అందిస్తుంది. స్కూటర్ ఎగ్జాస్ట్ పైప్ ప్రస్తుత మోడల్ మాదిరిగానే ఉంది. అయితే కొత్త డెస్టినీ కొత్త ఎగ్జాస్ట్ షీల్డ్‌ని పొందుతుంది. పిలియన్ రైడర్‌ కోసం బ్యాక్‌రెస్ట్‌ కొత్త డిజైన్‌ని కలిగి ఉంది. ఇందులో 10-అంగుళాల చక్రాలకు బదులుగా హీరో 12-అంగుళాల యూనిట్లను అందించే అవకాశం ఉంది. అలా చేస్తే ఇంకా మంచిది.

వెనుక భాగంలో ఇది రెట్రో టచ్‌ని పొందుతుంది. ప్రస్తుతం ఉన్న మోడల్‌లో కనిపించే భారీ టెయిల్ ల్యాంప్, ఇండికేటర్‌ని ఇప్పుడు మరింత స్లిమ్ యూనిట్లతో భర్తీ చేశారు. ఇక దీని ఇంజిన్‌లో ఎలాంటి మార్పులు జరిగే అవకాశం లేదు. కొత్త హీరో డెస్టిని 125 స్కూటర్ 124.6 సీసీ, ఎయిర్-కూల్డ్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది 9bhp పవర్, 10.4nm టార్క్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది.

అయితే బ్రేకింగ్ సెటప్‌లో భారీ మార్పు ఉండే అవకాశం ఉంటుంది. కొత్త డెస్టినీలోని కొన్ని వేరియంట్లలో ఫ్రంట్ డిస్క్ బ్రేక్‌ రానుంది. ప్రస్తుతానికి అన్ని మోడళ్లలో 130 ఎంఎం ఫ్రంట్, రియర్ డ్రమ్ బ్రేకులు ఉన్నాయి. సస్పెన్షన్ సెటప్ అలాగే ఉంది. ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్స్‌, వెనుక భాగంలో యూనిట్ స్వింగ్‌తో స్ప్రింగ్ లోడ్ హైడ్రాలిక్ డంపర్ ఉన్నాయి.

డిజైన్‌లో మార్పుల కారణంగా ఇందులోనూ కొత్త ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ని అందించే అవకాశం ఉందని తెలిసింది. ఇది ప్రస్తుతం ఉన్న డిజీ అనలాగ్ క్లస్టర్‌కి బదులుగా పూర్తి డిజిటల్ డిస్ ప్లేతో రానుంది. ప్రస్తుతం అంతంత మాత్రంగానే ఉన్న స్కూటర్‌ సేల్స్‌లో కొత్త హీరో డెస్టినీపై ఆ కంపెనీ భారీ ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. అందుకు తగినట్లుగానే గట్టి పోటీని ఇచ్చేలా తీసుకు రానున్నారు.

More from DriveSpark

Article Published On: Friday, August 30, 2024, 15:55 [IST]
English summary
New hero destini scooter teased check design and expected features here
Read more on: #hero motocorp #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+