Honda Stylo 160 హోండా నుంచి స్టైలో 160 స్కూటర్ ఆవిష్కరణ.. యువ రైడర్లను ఆకట్టుకునేలా అదరిపోయే డిజైన్, ఫీచర్లు
భారత మార్కెట్లో ప్రముఖ టూ వీలర్ తయారీదారు హోండా మోటార్‌సైకిల్స్ అండ్ స్కూటర్ ఇండియా మరో సరికొత్త స్కూటర్‌ను పరిచయం చేసింది. హోండా స్టైలో 160(Honda Stylo 160) పేరుతో స్కూటర్‌ను హోండా ఆవిష్కరించింది. ఫీచర్లు, డిజైన్, పూర్తి సమాచారం ఈ కథనంలో..
హోండా అనగానే మొదటగా ఎవరికైనా గుర్తొచ్చేది హోండా యాక్టివా 125(Honda Activa 125). 125cc సెగ్మెంట్‌లో హోండా యాక్టివా తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. ఈ స్కూటర్ ఆకట్టుకునే డిజైన్, ఫీచర్లు, ఇంజిన్ పనితీరు కస్టమర్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది. యువతులు, మహిళలు, 50 ఏళ్లు పైబడిన వారు ఎక్కువగా యాక్టివాకే ప్రాధాన్యత ఇస్తారు. స్టైల్ అండ్ లుక్స్ పరంగా యాక్టివా మార్కెట్లో హవా సృష్టిస్తోంది.

ఈ క్రమంలో హోండా(Honda) 160cc సెగ్మెంట్‌లో మరో కొత్త స్కూటర్‌ను పరిచయం చేసింది. ఆధునిక యువ రైడర్ల కోసం దీనిని ప్రత్యేకంగా రూపొందించి అభివృద్ధి చేసినట్లు హోండా వెల్లడించింది. యువ కస్టమర్లను ఆకట్టుకునే విధంగా హోండా స్టైలో 160cc ని తీసుకువస్తున్నట్లు స్పష్టం చేసింది. ఫీచర్ల పరంగా ఈ స్కూటర్‌ను ది బెస్ట్‌గా సంస్థ పేర్కొంది.
ఈ జపనీస్ బ్రాండ్ హోండా ఆవిష్కరించిన స్టైలో 160 స్కూటర్ ఫొటోలను పరిశీలిస్తే.. స్టైలింగ్ మరియు ఫీచర్లపై ఎక్కువ దృష్టి సారించినట్లుగా స్పష్టమవుతోంది. మొత్తం సిల్హౌట్ క్లీన్ లైన్‌లతో పాటు కోణీయ ఫాసియాను ఈ స్కూటర్ ప్రదర్శిస్తుంది. అంతేకాకుండా ఈ స్కూటర్‌ను ఆకర్షణీయమైన కలర్స్‌లో కూడా అందించనుంది. ఇక ఫ్లోర్‌బోర్డ్, సీట్లు నలుపు మరియు గోధుమ రంగుల్లో మరింత ఆకట్టుకునేలా అందిస్తోంది.

ఫీచర్ల విషయానికొస్తే స్టైలో 160లో యువ రైడర్లకు నచ్చే విధంగా ఆకట్టుకునే ఫీచర్లు ఉన్నాయి. LED లైట్లు, డిజిటల్ డిస్‌ప్లే, USB ఛార్జింగ్, కీలెస్ స్టార్ట్(ఇగ్నిషన్) మరియు ABS/CBS ఆప్షన్లతో వస్తుంది. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా యువ రైడర్లు సైతం స్మార్ట్ ఫీచర్లు ఉన్న వాహనాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. హోండా కూడా అందుకు అనుగుణంగా అప్‌డేట్ అవుతూ వస్తోంది.
ఇక హోండా స్టైలో 160 స్కూటర్ 160cc సింగిల్-సిలిండర్ లిక్విడ్-కూల్డ్ ఇంజిన్ నుండి శక్తిని పొందుతుంది. ఈ స్కూటర్ 16bhp గరిష్ట శక్తిని మరియు 15Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుందని సంస్థ తెలిపింది. పనితీరు పరంగా ఈ మోటార్ శక్తివంతమైనదిగా పరిగణించబడుతుంది.

హోండా స్టైలో 160 దాని అసాధారణమైన యుటిలిటీ, డిజైన్, సమ్మేళనంతో అధిక డిస్‌ప్లేస్‌మెంట్ స్కూటర్ల లైనప్‌ను విస్తరించే అవకాశం ఉంది. ఈ స్కూటర్‌లో ప్రవేశపెట్టిన ఆధునిక ఫీచర్లు ఖచ్చితంగా అర్బన్ మొబిలిటీ మార్కెట్‌పై గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయని ఆటో నిపుణులు భావిస్తున్నారు. ఎందుకంటే అర్బన్ ప్రయాణికులకు ఈ స్కూటర్ ఇంజిన్ మృదువైన, ఆహ్లాదకరమైన ప్రయాణాన్ని అందిస్తుంది. ఎక్కువ దూరం ప్రయాణించినా దాని సామర్థ్యం కారణంగా అలసిపోనివ్వదు.
కాగా ప్రస్తుతానికి, హోండా స్టైలో 160ని ఇండోనేషియాలో సంస్థ లాంచ్ చేసింది. తర్వాత ఇతర దేశాలకు హోండా ఈ స్టైలిష్ స్కూటర్‌ను విస్తరించే యోచనలో ఉంది. అయితే భారత మార్కెట్లోకి ఎప్పుడు లాంచ్ అవుతుందనే దానిపై స్పష్టత లేదు. భారత్ లాంటి దేశంలో హోండా స్టైలో 160 లాంటి స్కూటర్లకు రైడర్లకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తారు. అయితే ఈ స్కూటర్‌ను భారత్‌లో ఎప్పుడు విడుదల చేస్తారనే దానిపై సంస్థ వెల్లడించలేదు.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








