వచ్చిందండి వయ్యారీ.. ముందు రెండు కళ్లు, దాచుకోవడానికి భారీ అండర్‌సీట్ స్టోరేజీ, 120 కి.మీ రేంజ్, ఇంకేం కావాలి
రివర్ ఎలక్ట్రిక్ సరికొత్త అప్‌డేటెడ్ ఇండీ స్కూటర్ (Updated River Indie)ను విడుదల చేసింది. బెంగళూరుకు చెందిన ఈ ఎలక్ట్రిక్ టూవీలర్ స్టార్టప్ కంపెనీ రివర్ ఇండీ 2023 విడుదల చేసింది. ఈ స్కూటర్‌ని రూ .1.25 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరతో విడుదల చేయగా.. ఈ సంవత్సరం ఆరంభంలో దీని ధరను రూ .1.38 లక్షలకు పెంచారు. తాజాగా విడుదల చేసిన అప్‌డేటెడ్ వెర్షన్‌ని రూ.1.43 లక్షల (ఎక్స్-షోరూమ్) ధర వద్ద లాంచ్ చేశారు. మార్కెట్‌లో ఇతర స్కూటర్లకు గట్టి పోటీని ఇచ్చేందుకు దీనిని అప్‌గ్రేడ్ చేసి తీసుకువచ్చారు. ఈ స్కూటర్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఈ కథనంలో..
ఈ అప్‌డేటెడ్ రివర్ ఇండీని చైన్ డ్రైవ్ సిస్టమ్‌తో కూడిన కొత్త సింగిల్ స్పీడ్ గేర్ బాక్స్‌తో తీసుకువచ్చారు. ఇది ఈ సెగ్మెంట్‌లోనే ఫస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ అని కంపెనీ పేర్కొంది. దీని వల్ల మెయింటైనెన్స్ తగ్గడంతో పాటు మంచి స్మూత్‌నెస్ పెంచడానికి కంపెనీ సహాయపడుతుంది. సింగిల్-స్పీడ్ గేర్ బాక్స్ చైన్ డ్రైవ్ స్కూటర్ అసెంబ్లింగ్ ప్రక్రియను, రిపేర్‌ని సులభతరం చేస్తుందని రివర్ తెలిపింది.

దీంతో పాటు రివర్ ఇండీని ఇప్పుడు రెండు కొత్త కలర్ ఆప్షన్స్‌లో కొనుగోలు చేయవచ్చు. ఇది ఇప్పుడు వింటర్ వైట్ మరియు స్టార్మ్ గ్రే కలర్స్‌తో అందుబాటులో ఉంటుంది. ఈ స్కూటర్ భారీ బాడీవర్క్, ట్విన్ బీమ్ LED హెడ్‌ల్యాంప్స్ డిజైన్ కొనసాగుతుంది. చంకీ సీటు, వెడల్పాటి ఫ్లోర్ బోర్డ్, క్రాష్ గార్డ్స్, అల్లాయ్ వీల్స్ వంటివి ఉన్నాయి.
ఈ స్కూటర్‌లో అత్యధిక స్టోరేజీ కెపాసిటీ ఉంటుంది. ఇందులో 55 లీటర్ల లాకబుల్ స్టోరేజ్, గ్లోవ్ బాక్స్‌లో 12 లీటర్లు, అండర్ సీట్ స్టోరేజ్‌లో 43 లీటర్లు భారీ స్పేస్ కలదు. ఫ్రంట్- 14 అంగుళాల వీల్ అన్ని రహదారులకు సరిపోయేలా ఉంటుంది. దీంతో రైడర్లకు మెరుగైన డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్, స్టంటింగ్‌కి అవకాశం కల్పిస్తుంది. దూరం నుంచి చూడటానికి ఇది భారీ డిజైన్‌ని కలిగి ఉంటుంది.

ఈ ఇండీ 6.7 కిలోవాట్ల (8.9 bhp) ఎలక్ట్రిక్ మోటార్‌తో వస్తుంది. ఇది 26 nm గరిష్ట టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ స్కూటర్ గంటకు 90 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఇందులో ఉండే 4 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ ఫుల్ ఛార్జ్‌పై 120 కిలోమీటర్ల రేంజ్‌ని అందిస్తుంది. ఈ స్కూటర్‌ని స్టాండర్డ్ ఛార్జర్ ద్వారా కేవలం ఐదు గంటల్లో 80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు.
ఇందులో ఎకో, రైడ్, రష్ అనే మూడు రైడ్ మోడ్స్ కలవు. ఇక ఈ స్కూటర్ల అమ్మకాలు క్రమంగా పెరుగుతున్నాయి. పెద్దగా మార్కెట్ లేకున్నా కానీ ఈ స్కూటర్‌ని అక్టోబర్ 2023 నుంచి ఇప్పటి వరకు దాదాపు 3,000 మంది కొనుగోలు చేసినట్లు రివర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, సహ వ్యవస్థాపకుడు అరవింద్ మణి పేర్కొన్నారు. రానున్న రోజుల్లో సేల్స్ క్రమంగా పెరుగుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

త్వరలోనే డీలర్‌షిప్స్‌ని పెంచనున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఇందులో భాగంగా కోయంబత్తూర్, వైజాగ్, హుబ్లీ, కొచ్చిన్, బెల్గాం, వెల్లూరు, మైసూర్, ఉప్పల్‌లలో కొత్త వాటిని తీసుకురానుంది. మార్చి 2025 నాటికి భారతదేశం అంతటా 25 రివర్ స్టోర్లను ఏర్పాటు చేయాలనే లక్ష్యంగా పెట్టుకుంది. సేల్స్ పెంచేందుకు డిమాండ్‌ని బట్టి డీలర్‌షిప్స్ ప్రత్యేక ఆఫర్లను సైతం అందించనున్నాయి.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








