మరింత కొత్తగా వచ్చిన టీవీఎస్ జూపిటర్.. ఇందులోని ఫీచర్లు మరే స్కూటర్లలోనూ లేవు!
టీవీఎస్ మోటార్ కంపెనీ నిన్న ఆగస్టు 22న కంపెనీ లైనప్‌లోని జూపిటర్ 110 స్కూటర్‌ని అప్‌డేటెడ్ వెర్షన్‌లో విడుదల చేసింది. పూర్తి స్మార్ట్ అప్‌గ్రేడ్స్‌తో డిజైన్‌లోనూ పలు మార్పులు చేసింది. ప్రస్తుతం మార్కెట్‌లో అమ్మకానికి ఉన్న దానికంటే భిన్నంగా ఉంటుంది. అంతే కాదు టీవీఎస్ కూడా ఎన్నో ప్రత్యేకతలతో ఈ స్కూటర్‌ని తయారు చేసింది. గత కొన్ని సంవత్సరాలుగా టీవీఎస్ జూపిటర్ 110 భారత మార్కెట్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన స్కూటర్లలో ఒకటిగా ఉంది. హోండా యాక్టివాకు గట్టి పోటీని ఇచ్చేలా దీనిని కంపెనీ మార్కెట్‌లోకి ప్రవేశపెట్టింది. ఈ స్కూటర్‌ని కేవలం రూ.73,700 ప్రారంభ ధరతో తీసుకువచ్చింది. ఈ కథనంలో ఈ స్కూటర్ అందించిన కొత్త ఫీచర్లు, డిజైన్‌లో ఎలాంటి మార్పులు చేశారు? ఈ జూపిటర్ 110 స్కూటర్‌లో కొత్తగా ఏముది అనే విషయాలు ఈ కథనంలో చూడబోతున్నాం.
డిజైన్: ఈ కొత్త 2024 జూపిటర్ 110 ఆకర్షణీయంగా కనిపించేలా LED DRL లైట్‌ని అందించారు. టర్న్ ఇండికేటర్లు కూడా ఇందులో ఉన్నాయి. ఈ రెండూ కొత్త జూపిటర్ 110కు అడ్వాన్స్‌డ్ లుక్‌ని ఇస్తాయి. వీటితో పాటు బాడీ ప్యానెల్స్‌ని రీడిజైన్ చేసింది. ముఖ్యంగా ఫోన్ పెట్టుకునేందుకు జేబు లాంటి డిజైన్, మధ్యలో సరుకులు పెట్టుకునేందుకు హుక్‌ని అందించారు.

స్టోరేజీ: సీటు కింద స్టోరేజ్‌ని కూడా ఎక్కువగా ఇచ్చారు. కాబట్టి మీ జూపిటర్ 110లో ఇప్పుడు రెండు హాఫ్ ఫేస్ హెల్మెట్లను కూడా ఉంచడానికి స్థలం సరిపోతుంది. కానీ, ఫుల్ ఫేస్ హెల్మెట్స్ 2 ఇన్‌సర్ట్ చేయడం కొంచెం కష్టమేనని తెలుస్తోంది. దీని టోటల్ స్టోరేజీ కెపాసిటీ 33 లీటర్లుగా ఉంది. సరికొత్త డిజైన్‌లో దీనిని తీసుకురావడం వల్ల కొత్త కస్టమర్లకు చూడగానే నచ్చుతుంది.
న్యూ టెక్నాలజీ: ఈ స్కూటర్‌లో బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన డిజిటల్ స్క్రీన్ ఉంది. ఈ స్క్రీన్‌లో టర్న్ బై టర్న్ రూట్ సమాచారాన్ని అందిస్తుంది. దీంతోపాటు సెల్‌ఫోన్‌కి వచ్చే కాల్స్, నోటిఫికేషన్లను కూడా తెలుసుకోవచ్చు. దీనిలో వాయిస్ అసిస్ట్ కూడా అందించారు. ఈ ఫీచర్లన్నీ టీవీఎస్ స్మార్ట్-ఎక్సోనెక్ట్ యాప్ ద్వారా పొందవచ్చు. దీనిలో ఫైండ్ మీ, ఫాలో మీ హెడ్ ల్యాంప్ ఫీచర్లు కూడా కలిగి ఉంది.

సేఫ్టీ ఫీచర్: ఈ స్కూటర్‌లో ర్యాపిడ్ ఫ్లాషింగ్ ఇండికేటర్ కూడా ఉంది. ఇది అత్యవసర సమయంలో బ్లింక్ అవుతూ ఇతరులను అప్రమత్తం చేస్తుంది. ముఖ్యంగా హడావుడిగా బ్రేకులు వేసిన సందర్భంలో ఆటోమేటిక్‌గా ఆన్ అయి ఇతరులను అలర్ట్ చేస్తుంది. ఆటోమేటిక్‌గా ఇండికేటర్లను ఆఫ్ చేసే ఆప్షన్ కూడా ఈ స్కూటర్‌లో ఉంది. కానీ ఇది కొంచెం నెమ్మదిగా రెస్పాండ్ అవుతుంది.
ఇండికేటర్ ఒకసారి ఆన్ చేసిన తర్వాత 100 మీటర్లు లేదా 20 సెకన్ల తర్వాత ఆటోమేటిక్‌గా ఆఫ్ అవుతుంది. ఇందులో డిస్క్ బ్రేక్, డ్రమ్ బ్రేక్ ఆప్షన్ కూడా అందించారు. ఈ స్కూటర్ బాడీ ప్యానెల్ మెటల్‌తో తయారైందని టీవీఎస్ పేర్కొంది. అందువల్ల, ఇది దీర్ఘకాలికంగా ఉంటుంది. డ్రమ్, డ్రమ్ అల్లాయ్, స్మార్ట్ కనెక్ట్ డ్రమ్, డిస్క్ అనే 4 వేరియంట్లలో వస్తుంది. ఆరు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది.

ఇంజిన్ స్పెసిఫికేషన్స్: ఈ స్కూటర్ 113 సీసీ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది గరిష్టంగా 8bhp పవర్ 9.8nm టార్క్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇందులో iGO అసిస్ట్ ఫీచర్‌ని జోడించారు. ఇది మైక్రో హైబ్రిడ్ టెక్నాలజీ. 110 సీసీ సెగ్మెంట్లో ఈ ఫీచర్ పొందిన తొలి స్కూటర్ ఇదే కావడం విశేషం. ఇది అదనపు సామర్థ్యం కోసం ఇంటిగ్రేటెడ్ స్టార్టర్ జనరేటర్ మోటారును ఉపయోగిస్తుంది.


Click it and Unblock the Notifications








