మార్కెట్‌లోకి కొత్త అడ్వెంచర్‌ బైక్‌.. దీనిపై ప్రపంచాన్ని మొత్తం చుట్టి రావచ్చు.. ధర రూ. 2.10 లక్షలు!

జావా యెజ్డీ తన అడ్వెంచర్ బైక్‌ని అప్‌డేట్ చేసి మార్కెట్‌లోకి విడుదల చేసింది. కొత్తగా అప్డేట్ చేసిన ఈ బైక్ ధర రూ.2.10 లక్షల నుంచి రూ.2.20 లక్షల మధ్యలో ఉంది. ఈ బైక్‌ అప్‌డేట్‌లో భారీ మార్పులు లేనప్పటికీ, బయటి డిజైన్‌లో మార్పులు ఎక్కువగా జరిగాయి. దీనిని పూర్తి స్థాయిలో అడ్వెంచర్‌ బైక్‌గా మార్పులు చేసింది. ఈ బైక్‌లో కొత్తగా ఏముంది? ఇది అడ్వెంచర్‌కి సరైనదా కాదా అనే విషయం ఈ కథనంలో తెలుసుకుందాం..

మైసూరుకు చెందిన జావా యజ్డీ మోటార్ సైకిల్స్ భారతదేశంలో రైడింగ్‌ ఔత్సాహికుల కోసం బైక్‌లను అందిస్తుంది. రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ ఇతర బైక్‌ కంపెనీలతో పోల్చితే తక్కువ ధరలో మోటార్‌సైకిళ్లను మార్కెట్‌లో విడుదల చేస్తుంది. తాజాగా పూర్తి స్థాయిలో టూరిస్ట్‌ల కోసం యెజ్డీ అడ్వెంచర్‌ని అప్‌డేట్ చేసింది. ఈ బైక్ ప్రారంభ ధర రూ.2.09 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌)గా ఉంది. ఇప్పటికే ఈ బైక్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి.

New-Jawa-Yezdi-Adventure-Bike-Launched

మీరు ఈ బైక్‌ని బుక్ చేయాలనుకుంటే సమీపంలోని జావా యజ్డీ షోరూమ్‌ని సందర్శించడం ద్వారా రిజర్వ్‌ చేసుకోవచ్చు. కొత్తగా అప్‌డేట్‌ చేసిన బైక్‌లో పలు మార్పులు తీసుకొచ్చారు. ముఖ్యంగా కొత్త కలర్ స్కీమ్స్‌ని ప్రవేశపెట్టింది. ఎక్కువ మంది కస్టమర్లను ఆకర్షించేలా దీన్ని రూపొందించారు. కస్టమర్లు తమకు నచ్చిన కలర్ ఆప్షన్లను ఎంచుకుని తమ వాహనాలను కొనుగోలు చేయవచ్చు.

ఈ అప్‌డేటెడ్‌ యెజ్డీ అడ్వెంచర్ బైక్ వివిధ రకాల కాస్మోటిక్ (బయట అదనపు జోడింపులు) అప్‌డేట్‌లను తీసుకువచ్చింది. దీంతో ఈ బైక్ రూపురేఖలు మారిపోయాయి. ట్యాంక్‌ కొంచెం కింద భాగంలో కొత్తగా అమర్చిన ప్లాస్టిక్ ఇన్‌స్టర్లపై est.69 అని రాసి ఉన్న స్టిక్కర్ కూడా ఉంది. బైక్ ముందు భాగంలో సర్క్యులర్ హెడ్ లైట్ సెటప్ ఉంది. ఇది చూపరులకు కనువిందు చేస్తుంది.

New-Jawa-Yezdi-Adventure-Bike-Price

బైక్ ముందు భాగంలో పియానో బ్లాక్ గ్రిల్ ఫినిష్ లభిస్తుంది. సేఫ్టీని పెంచడానికి బైక్ ముందు వైజర్లను (హెడ్‌లైట్‌, ఇన్‌స్ట్రూమెంట్‌ క్లస్టర్‌ చుట్టూ గ్లాస్‌)ని కూడా కలిగి ఉంది. ఇది క్లస్టర్ ప్రాంతానికి అదనపు రక్షణ కల్పిస్తుంది. ఈ బైక్ మెరుగైన ఆఫ్-రోడ్ సామర్థ్యం మరియు టూరింగ్ సౌలభ్యం కోసం క్లాస్-లీడింగ్ 220 ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్ మరియు లాంగ్-ట్రావెల్ సస్పెన్షన్ కలిగి ఉంది.

కఠినమైన భూభాగాలను మరియు అడ్డంకులను సులభంగా ఛేదించగలదు. కూలెంట్ రివైజర్ పోర్షన్‌ని వెనుక వైపుకు మార్చారు. దీంతో బైక్ బరువు 5 కిలోలు తగ్గింది. యెజ్డీ అడ్వెంచర్ బైకులో 334సీసీ సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ కలదు. ఇది 30బిహెచ్ పి పవర్ మరియు 30ఎన్ఎమ్ టార్క్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది.

New-Jawa-Yezdi-Adventure-Bike-Features

ఈ ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. రాయల్ ఎన్‌ఫీల్డ్‌కి పోటీగా జావా ఈ బైక్స్‌ని లాంచ్ చేసింది. ఇది యువతలో బాగా ప్రాచుర్యం పొందింది. ఈ బైక్ పై అమ్మకాల్లో సత్తాచాటే అవకాశం ఉంది. యెజ్డీ బైక్ అమ్మకాలు ప్రత్యర్థి బైక్ అమ్మకాలను పెద్దగా ప్రభావితం చేయకపోవడానికి ప్రధాన కారణం తగినన్ని షోరూమ్స్‌ అందుబాటులో లేకపోవడం భవిష్యత్తులో ఈ సమస్యను అధిగమిస్తే అమ్మకాలు పెరగనున్నాయి.

డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Thursday, August 1, 2024, 10:37 [IST]
English summary
New yezdi adventure launched in india at rs 2 10 lakhs equipped with more cosmetic updates
Read more on: #yezdi #new launches #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+