రూ. 37,000 కే ఎలక్ట్రిక్ స్కూటర్.. నెక్స్‌జన్ ఎనర్జియా అదిరిపోయే న్యూస్.. వివరాలివే.!!
భారత మార్కెట్లో అత్యంత సరసమైన ధరలో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదలైంది. Nexgen Energia అనే సంస్థ రూ. 36,990 ధరతో కొత్త ఎలక్ట్రిక్ టూ వీలర్‌ను లాంచ్ చేసింది. బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి ఈ ఈవీని విడుదల చేశారు. పూర్తి సమాచారం ఈ కథనంలో.
నెక్స్‌జెన్ ఎనర్జియా ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ ప్రధాన కార్యాలయం నోయిడాలో ఉంది. కంపెనీ తన మొదటి ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాన్ని గురువారం(Affordable Electric Scooter) విజయవంతంగా విడుదల చేసింది. కేవలం రూ. 36,990 ధరలో విడుదల చేయడంతో మార్కెట్‌లో ఈ స్కూటర్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

అత్యంత సరసమైన ధరలో ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసిన Nexgen Energia వివరాలను వెల్లడించింది. మధ్యతరగతి ప్రజలు తక్కువ ధరకు ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసేలా ఉత్పత్తులను అభివృద్ధి చేయాలని నిర్ణయించినట్లు కంపెనీ వెల్లడించింది. ఆ ఆలోచనతోనే ఈ స్కూటర్‌ను విడుదల చేసినట్లు కంపెనీ ఛైర్మన్ పీయూష్ ద్వివేది అన్నారు.
పర్యావరణ హితంగా ప్రతి భారతీయ పౌరుడికి ఎలక్ట్రిక్ వాహనాలను అందుబాటులో ఉంచడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు పీయూష్ ద్వివేది తెలిపారు. అంతేకాకుండా ఈ కొత్త స్కూటర్ విడుదలతో ఈ ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ. 500 కోట్ల లావాదేవీలు జరపాలని కంపెనీ యోచిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందుకోసం దేశవ్యాప్తంగా 500 మంది డీలర్లు మరియు పంపిణీదారులను నియమించాలని భావిస్తున్నట్లు చెప్పారు.
తద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 50 వేల మందికి ఉపాధి కల్పించబోతున్నామని పీయూష్ ద్వివేది అన్నారు. ఎలక్ట్రిక్ వాహనాల రంగం భారతదేశ భవిష్యత్తుగా రూపుదిద్దుకుంటోందని వెల్లడించారు. ప్రస్తుతం ఎలక్ట్రిక్ టూ వీలర్ సెగ్మెంట్‌ను అభివృద్ధి చేస్తున్నామని.. త్వరలో ఎలక్ట్రిక్ కార్లను తయారు చేయడానికి ప్రణాళికలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
త్వరలో భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ కార్లను అందుబాటులోకి తీసుకురాబోతున్నామని.. ఎలక్ట్రిక్ కార్ల తయారీ విజయవంతమైనట్లయితే వాటిని రూ. 5 లక్షల కంటే తక్కువ ధరలో విక్రయిస్తామని పీయూష్ ద్వివేది వెల్లడించారు. దీని ద్వారా మధ్యతరగతి ప్రజలకు కూడా సులువుగా ఎలక్ట్రిక్ కార్లు అందుబాటులోకి వస్తాయని చెప్పారు.
నెక్స్‌జెన్ ఎనర్జియా ప్రకారం, రూ. 5 లక్షల కంటే తక్కువ ధరలో ఎలక్ట్రిక్ కార్లను విక్రయిస్తే ప్రపంచంలోనే అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ కారుగా ఇది అవతరించనుంది. కంపెనీ ఇప్పుడు తన ఉత్పత్తులను ప్రారంభించాలని యోచిస్తోంది. గత మార్చిలోనే కంపెనీకి రూ.1000 కోట్లు కేటాయించారు.
దాని ఆధారంగా జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో తమ ప్లాంట్(NexGen Energia Plant In Jammu& Kashmir)ను ఏర్పాటు చేయాలని కంపెనీ యోచిస్తోంది. ప్రస్తుతం, జమ్మూకశ్మీర్ ప్రభుత్వం గౌటా ఇండస్ట్రియల్ సెంటర్ లేదా కశ్మీర్ వ్యాలీ ప్రాంతంలో 100 ఎకరాల భూమిని కేటాయించడానికి రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతోంది.
త్వరలో ఈ ప్లాంట్ స్థాపనతో, కంపెనీ విడుదల చేసిన తక్కువ ధర ఎలక్ట్రిక్ స్కూటర్ మరియు ఎలక్ట్రిక్ కారుపై అన్ని ఉత్పత్తులు మరియు పరిశోధనలు ప్రారంభమవుతాయని సమాచారం. Nexgen Energia నుంచి త్వరలో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్, ఎలక్ట్రిక్ కారు అందుబాటులోకి వచ్చినట్లయితే మిగతా ఈవీ కంపెనీలకు గట్టి పోటీ అవుతుందనడంలో సందేహం లేదు.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








