నితిన్ గడ్కరీ ఆవిష్కరించిన కొత్త స్కూటర్ ఇదే!.. వివరాలు తెలుసుకోండి
గ్లోబల్ మార్కెట్లో టూ వీలర్స్ మరియు త్రీ వీలర్స్ తయారీలో అగ్రగామిగా ఉన్న బజాజ్ ఆటో లిమిటెడ్ ఎప్పటికప్పుడు ఆధునిక వాహనాలను లాంచ్ చేస్తూ.. వాహన ప్రేమికులను ఆకర్శించడంలో విజయం సాధిస్తోంది. ఇందులో భాగంగానే ఎలక్ట్రిక్ విభాగంలో కంపెనీ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేసి మంచి విక్రయాలను పొందుతోంది. కంపెనీ నాగ్‌పూర్‌లో ఏకంగా 19000 చేతక్ యూనిట్ల విక్రయాన్ని జరుపుకుంది. ఈ కార్యక్రమంలో కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పాల్గొన్నారు. ఆయన చేతుల మీదుగా కంపెనీ కొత్త చేతక్ 2901 మోడల్‌ను కూడా ఆవిష్కరించారు.
బజాజ్ చేతక్ దృఢమైన నిర్మాణం, ఆధునిక ఫీచర్స్ కలిగి అద్భుతమైన రైడింగ్ అనుభూతిని అందిస్తుంది. ఇది మాత్రమే కాకుండా ధర కూడా కొంత సంసారమైనదిగా ఉండటం వల్ల దేశీయ విఫణిలో సక్సెస్ సాధించింది. నాగ్‌పూర్‌లో గణనీయమైన విజయాన్ని సాధించింది. కొత్తగా ప్రవేశపెట్టిన చేతక్ 2901 ఈ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యంగా ప్రారంభించారు. ఇదొక స్పెషల్ మోడల్ అనో తెలుస్తోంది.

బజాజ్ చేతక్ 2901 అనేది చేతక్ లైనప్‌లో అత్యంత బడ్జెట్ ఫ్రెండ్లీ మోడల్. ఇది ఏకంగా 126 కిమీ రేంజ్ అందిస్తుంది. రేంజ్ అనేది వంద కంటే ఎక్కువ ఉండటం వల్ల కొంత దూర ప్రయాణాలకు అనుమతిస్తుంది. ఇది కలర్ డిజిటల్ కన్సోల్, అల్లాయ్ వీల్స్ మరియు బ్లూటూత్ కనెక్టివిటీ వంటి వాటిని పొందుతుంది. ఇవన్నీ రైడర్లకు ఉత్తమ రైడింగ్ అనుభూతిని అందిస్తాయి.
చేతక్ 2901 ఈవీ అనేది హిల్ హోల్డ్, రివర్స్, స్పోర్ట్ మరియు ఎకానమీ మోడ్‌లను పొందుతుంది. అంతే కాకుండా కాల్ మరియు మ్యూజిక్ కంట్రోల్, ఫాలో మి హోమ్ లైట్లు వంటి వాటికోసం బ్లూటూత్ యాప్ కనెక్టివిటీ అందుబాటులో ఉంది. ఇది మొత్తం ఐదు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. అవి రెడ్, వైట్, బ్లాక్, లెమెన్ ఎల్లో మరియు అజూర్ బ్లూ కలర్స్.

మల్టిపుల్ కలర్ ఎంపికలతో లభిస్తున్న ఈ స్కూటర్ తప్పకుండా వాహన వినియోగదారులను ఆకర్షిస్తుందని భావిస్తున్నాము. కంపెనీ క్రమంగా తన ఉనికిని విస్తరిస్తూ.. కస్టమర్లకు చేరువవుతోంది. చేతక్ 2901 స్కూటర్ అనేది అమ్మకాల్లో అరుదైన రికార్డుకు నిదర్శనం. కంపెనీ ఇప్పుడు భారతదేశంలో సుమారు 500 షోరూమ్‌లను ప్రారంభించింది. ఇవన్నీ కస్టమర్ల అవసరాలను తీరుస్తాయి. రాబోయే రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
బజాజ్ చేతక్ ప్రీమియం, చేతక్ అర్బేన్ మరియు చేతక్ 2901 మోడల్‌లు మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్ (MHI) నుంచి ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్ (EMPS) సబ్సిడీకి ఆమోదం పొందాయి. అంతే కాకుండా బజాజ్ ఆటో లిమిటెడ్ ఎలక్ట్రిక్ వాహనాల కోసం భారత ప్రభుత్వం యొక్క ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (PLI) పథకంలో కూడా పాల్గొంటుంది.

కంపెనీ చేస్తున్న ఈ విస్తరణ మరింత మంది వినియోగదారులను దేశవ్యాప్తంగా ఈ వినూత్న ఎలక్ట్రిక్ స్కూటర్‌లను యాక్సెస్ చేయగలరని నిర్ధారిస్తుంది. ప్రభుత్వ పథకాల మద్దతు వారి స్థోమత మరియు ఆకర్షణను మరింత పెంచుతుంది. ఎలక్ట్రిక్ మొబిలిటీ సొల్యూషన్‌లను అభివృద్ధి చేయడంలో బజాజ్ ఆటో లిమిటెడ్ యొక్క అంకితభావాన్ని హైలైట్ చేసింది. కంపెనీ తన ఎలక్ట్రిక్ స్కూటర్లను మరింతమందికి చేరువయ్యే దిశగా కావాల్సిన ప్రయత్నాలు చేస్తోంది.
ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications








