వావ్ సూపర్ ఆఫర్.. ఆ ఎలక్ట్రిక్ బైక్‌పై 25,000 డిస్కౌంట్.. ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే!
ఆగస్టు 15న 77వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఆటోమొబైల్ సంస్థలు ప్రత్యేక ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. అందులో భాగంగా ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఒబెన్ ఎలక్ట్రిక్ తన పాపులర్ ఎలక్ట్రిక్ బైక్ మోడల్ ఒబెన్ రోర్ (Oben Rorr)పై ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. ఇప్పుడు ఈ బైక్‌ని (ఫ్రీడమ్ ఆఫర్) కింద రూ. 25,000 తక్కువ ధరతో కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం ఈ ఎలక్ట్రిక్ బైక్ రూ.1,49,999గా ఉంది. అయితే ప్రస్తుత ఫ్రీడమ్ డిస్కౌంట్ కింద ఇప్పుడు ఈ బైక్‌ని కేవలం రూ. 1,24,999లకే కొనుగోలు చేయవచ్చు.
ఈ ఆఫర్ కేవలం ఆగస్టు 15 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. రోర్ ఎలక్ట్రిక్ బైక్‌ని షోరూమ్‌ల్లో కొనుగోలు చేసిన వారికి ఈ తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది. గత కొన్నేళ్లుగా భారతదేశంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. అందులో భాగంగా ఓబెన్ రోర్ ఎలక్ట్రిక్ బైక్‌ని మార్కెట్‌లోకి ప్రవేశపెట్టింది. ఈ బైక్‌ని 2022 మార్చిలో విడుదల చేసింది.

ఓబెన్ రోర్ ఎలక్ట్రిక్ బైక్‌లో అనేక ఫీచర్లు ఉన్నాయి. ఈ ఓబెన్ రోర్ గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. ఇందుకోసం రోర్ బైక్‌లో 8 కిలోవాట్ల IBMSM మోటార్‌ని ఉపయోగించారు. ఈ బైక్ 0 నుంచి 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకోవడానికి కేవలం 3 సెకన్లు పడుతుంది. అంతే కాదు, ఈ బైక్ ఫుల్ ఛార్జ్ చేస్తే 187 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు.
ఈ రోర్ ఇ-బైక్ ఈ 4.4 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్‌ని అందించారు. బ్యాటరీ ప్యాక్ పూర్తిగా ఛార్జ్ కావడానికి కేవలం 2 గంటలు పడుతుంది. అదేవిధంగా, రోర్ ఎలక్ట్రిక్ బైక్ కూడా టెక్నాలజీ పరంగా ఉత్తమ బైక్‌గా తీర్చిదిద్దింది. ఇది పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రూమెంట్ క్లస్టర్ మరియు ఇతర ఆధునిక ఫీచర్లను కలిగి ఉంది.
ఈ బైక్ ఇతర సరికొత్త డిజైన్‌ని కలిగి ఉంది. ఇందులో సర్క్యూలర్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్స్, ఎల్ఈడీ టర్న్ ఇండికేటర్లు, ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్ ఉన్నాయి. భారతదేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్లు ఆధిపత్యం చెలాయిస్తున్న సమయంలో ఈ రోర్ బైక్‌తో ఒబెన్ ఎలక్ట్రిక్ గట్టి పోటీని ఇస్తుంది. ఒబెన్ ఎలక్ట్రిక్ అందిస్తున్న ఈ ప్రత్యేక ఆఫర్‌తో సేల్స్ పెరుగుతాయని ఓబెన్ భావిస్తుంది.
ప్రస్తుతం ఒబెన్ ఎలక్ట్రిక్ బెంగళూరు, ఢిల్లీ, కొచ్చి మరియు త్రివేండ్రం ప్రాంతాలతో సహా భారతదేశం అంతటా ఎనిమిది షోరూమ్స్‌ని కలిగి ఉంది. ఈ ఏడాది చివరి నాటికి దేశవ్యాప్తంగా 50 కొత్త షోరూమ్‌లను ప్రారంభించాలని యోచిస్తున్న సంస్థ భావిస్తోంది. దీని ద్వారా మార్కెట్‌ని మరింత పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఇండిపెండెన్స్ ఆఫర్స్‌తో పాటు రానున్న పండుగ సీజన్ కోసం ఆటోమోబైల్ కంపెనీలు భారీ డిస్కౌంట్‌ని ప్రకటించే అవకాశం ఉంది. ప్రస్తుతం చాలా కంపెనీలు ఒక్కొక్కటిగా ఇప్పటికే ఆఫర్‌లను ప్రకటిస్తున్నాయి. డిమాండ్‌ని బట్టి కంపెనీలు ధరల పెంపు, డిస్కౌంట్‌లను అందిస్తాయి. కొన్నిసార్లు సేల్స్ తగ్గిన సమయంలో ధరలు తగ్గించే అవకాశం ఉంటుంది.
డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








