బైక్ కొంటే ఐఫోన్ ఫ్రీ.. అంతే కాదు బైక్‌పై రూ. 30,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్, 5 ఏళ్ల వారంటీ!
ప్రస్తుతం దేశంలో పండుగ సీజన్ ఆరంభం అయ్యింది. దీంతో వాహన తయారీ సంస్థలు అదిరిపోయే ఆఫర్లతో కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఈ పండుగ సీజన్‌లో సేల్స్‌ని పెంచుకునేందుకు భారీ డిస్కౌంట్లను అందిస్తున్నాయి. దసరా పండుగను పురస్కరించుకుని ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఒబెన్ ఎలక్ట్రిక్ (Oben Electric) అదిరిపోయే ఆఫర్లను ప్రకటించింది. ఆ కంపెనీలోని టాప్ బైక్ కొనుగోలుపై దాదాపు రూ. 60,000 వరకు బెనిఫిట్స్‌ని అందిస్తోంది. ఈ ఆఫర్ సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 12, 2024 వరకు అందుబాటులో ఉంటుంది.
ఒబెన్ ఎలక్ట్రిక్ విడుదల చేసిన ఉత్పత్తులలో రోర్ ఎలక్ట్రిక్ బైక్ (Rorr) ఫేమస్ లైనప్‌గా ఉంది. ఇది మన దేశంలోనే తయారు చేయబడింది. ఈ బైక్‌ని గత నెలలో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కంపెనీ రూ.25,000 డిస్కౌంట్‌ని ప్రకటించింది. దసరా పండుగను పురస్కరించుకుని ఈవీని రూ.30,000 తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. అంటే చాలా తక్కువ ధరలో ఈ బైక్‌ని సొంతం చేసుకోవచ్చు.

ప్రస్తుతం ఈ బైక్ ధర రూ.1,49,999 (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఈ ఎలక్ట్రిక్ బైక్ ధరను ఇప్పుడు రూ.1,19,999లకే సొంతం చేసుకోవచ్చు. ఎలక్ట్రిక్ వాహనాలకు మారాలనుకునే వారికి ఈ ఒబెన్ బైక్ మంచి ఆప్షన్‌గా ఉంటుంది. ఈ బైక్ ధర తగ్గింపుతో పాటు, ఐదేళ్ల ఎక్స్‌టెండెడ్ వారంటీని కంపెనీ అందిస్తోంది. ఇది కంపెనీపై మరింత విశ్వాసాన్ని రెట్టింపు చేస్తుంది.
అంతే కాకుండా లక్కీ కస్టమర్లు ఆపిల్ ఐఫోన్ 15, ఐప్యాడ్ మినీ, సోనీ హెడ్‌ఫోన్స్ వంటి గాడ్జెట్లను పొందే అవకాశం ఉంటుంది. ఇటువంటి ఆఫర్లతో ఈ బైక్ సేల్స్‌ని పెంచుకోవడమే కాకుండా, వినియోగదారులకు మరింత సరసమైన ధరలో ఎలక్ట్రిక్ మొబిలిటీకి మారే అవకాశాన్ని కల్పిస్తుంది. దసరా పండుగను కేవలం ఎంపిక చేసిన నగరాల్లో మాత్రమే ఈ ఈ దసరా ధమాల్ దినోత్సవాన్ని (Dussehra Dhamaal Day) నిర్వహిస్తోంది.

మీరు బెంగళూరు, ఢిల్లీ, పుణెలోని డీలర్‌షిప్స్‌లలో ఈ ఆఫర్లను పొందవచ్చు. ఈ నగరాల్లో బైక్‌ని కొనుగోలు చేసేటప్పుడు రూ .60,000 వరకు ఆదా చేయవచ్చు. అంటే రూ.1.50 లక్షల వాస్తవ ధర కలిగిన బైక్‌ని కేవలం రూ.90 వేలకు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ఈ ఆఫర్‌ని కంపెనీ ప్రత్యేకంగా సేల్ చేసే ప్రాంతాల్లోనే పొందాలి.
సెప్టెంబర్ 29న బెంగళూరులోని HSR లేఅవుట్ షోరూం, అక్టోబర్ 2న ఢిల్లీలోని ద్వారకా షోరూమ్, అక్టోబర్ 6న పుణెలోని వాకడ్ షోరూంలో ఈ కార్యక్రమం జరగనుంది. కస్టమర్లకు పైన తెలిపిన అన్ని ఆఫర్లు వర్తిస్తాయి. రూ. 30,000 తక్షణ డిస్కౌంట్ ద్వారా చాలా తక్కువ ధరకే బైక్‌ని సొంతం చేసుకోవచ్చు. ఒక్క ఎలక్ట్రిక్ బైక్‌పై రూ.30000 తగ్గడం అనేది అసాధ్యం.

వినియోగదారులకు మరింత తక్కువ ధరలో బైక్స్‌ని అందించడానికి ప్రయత్నిస్తున్నట్లు ఒబెన్ ఎలక్ట్రిక్ ఫౌండర్, సీఈవో మధుమితా అగర్వాల్ తెలిపారు. ఈ పండుగ సీజన్ ద్వారా ఎలక్ట్రిక్ వెహికిల్స్‌లోకి మారాలి అనుకునే వారు మా ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌పై మంచి ఆప్షన్‌గా ఉంటుదని ఆయన చెప్పారు. ఒబెన్ ఎలక్ట్రిక్ విస్తరణ ప్రణాళికల్లో భాగంగా ఈ ఆఫర్‌ని ప్రకటించినట్లు ఆయన వెల్లడించారు.
కస్టమర్ బేస్‌ని చేజిక్కించుకునే లక్ష్యంతో కంపెనీ ఈ ఏడాది ప్రారంభంలో పుణె, ఢిల్లీలతో పాటు ఇతర ముఖ్య నగరాల్లో మార్కెట్‌ని మరింత విస్తరించింది. అందువల్ల తీవ్రమైన పోటీని తట్టుకునేందుకు ఈ ఫెస్టివల్ ఆఫర్లను ప్రవేశపెట్టాలని ఒబెన్ ఎలక్ట్రిక్ నిర్ణయం తీసుకుంది. రాబోయే నెలల్లో దేశంలోని ప్రధాన నగరాల్లో 60 కొత్త షోరూమ్‌లను ప్రారంభించాలని ఆ సంస్థ యోచిస్తోంది.


Click it and Unblock the Notifications








