175 కి.మీ రేంజ్‌తో కొత్త ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. 45 నిమిషాల్లో ఛార్జ్ చేయవచ్చు, ధర రూ. 89,999 మాత్రమే!
దేశంలో ఎలక్ట్రిక్ టూవీలర్స్ వినియోగం రోజు రోజుకి పెరుగుతోంది. టూవీలర్స్‌లో జనాలు ఎక్కువగా స్కూటర్లను కొనుగోలు చేస్తున్నారు. అయితే గత కొన్ని నెలలుగా ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్స్ వైపు షిఫ్ట్ అవుతున్నారు. మార్కెట్‌లో ఓబెన్ ఎలక్ట్రిక్, రివోల్ట్ మోటార్స్, ఫ్యూర్ ఈవీతో పాటు పలు స్టార్టప్ కంపెనీల నుంచి ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్స్ అందుబాటులో ఉన్నాయి. ఎలక్ట్రిక్ టూవీలర్స్ అమ్మకాల్లో టాప్‌లో కొనసాగుతున్న ఓలా ఎలక్ట్రిక్ కూడా రోడ్‌స్టర్ సిరీస్‌లో మోటార్‌సైకిల్స్‌ని విడుదల చేసింది. అయితే ఇవి ఇంకా మార్కెట్‌లో అందుబాటులోకి రాలేదు. తాజాగా రాయల్‌ఎన్‌ఫీల్డ్ సైతం మొట్టమొదటి ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ని ఆవిష్కరించింది.
బెంగళూరుకు చెందిన ఓబెన్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్స్‌ని కస్టమర్లు తెగ కొనేస్తున్నారు. తాజాగా ఈ కంపెనీ ఓబెన్ రోర్ EZ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్‌ని (Oben Rorr EZ) విడుదల చేసింది. ఇ-బైక్‌ని మొత్తం మూడు వేరియంట్లలో కంపెనీ లాంచ్ చేసింది. రూ .89,999 (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరకే కొనుగోలు చేయవచ్చు. ఆసక్తిగల కస్టమర్లు రూ.2,999 బుకింగ్ అమౌంట్ చెల్లించి ఆన్‌లైన్‌లో లేదా సమీప డీలర్‌షిప్ వద్ద బైక్‌ని బుక్ చేసుకోవచ్చు.

టెస్ట్ డ్రైవ్స్, డెలివరీలు వెంటనే ప్రారంభిస్తామని ఓబెన్ ఎలక్ట్రిక్ ఓ ప్రకటనలో తెలిపింది. ఇక ఈ బైక్‌ని ఎలక్ట్రో అంబర్, సర్జ్ సియాన్, లుమినా గ్రీన్, ఫోటాన్ వైట్ అనే నాలుగు కలర్ ఆప్షన్లలో కొనుగోలు చేయవచ్చు. ARX ఫ్రేమ్‌వర్క్‌పై నిర్మించిన ఈ బైక్ నియో క్లాసిక్ డిజైన్, రౌండ్ ఎల్ఈడీ హెడ్లైట్, ఫ్లోటింగ్ డిజిటల్ క్లస్టర్, బైక్ చుట్టూ వైబ్రెంట్ గ్రాఫిక్స్ వంటివి ఉన్నాయి.
దీంతో పాటు మల్టీ-స్పోక్ అల్లాయ్ వీల్స్, టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్, బ్యాక్‌సైడ్ మినీ షాక్ సెటప్, LED టెయిల్ లైట్స్, రెండు వైపులా డిస్క్ బ్రేక్స్ తదితర ఫీచర్లు ఉన్నాయి. ఇది రెగ్యూలర్ పెట్రోల్ వెహికిల్స్ వలె మంచి సస్పెన్షన్ సెటప్‌ని అందిస్తుంది. ఈ బైక్ రోజువారి అవసరాలకు సరిపోతుంది. కొత్తగా ఎలక్ట్రిక్ వెహికిల్స్‌లోకి మారాలనుకునే వారు దీనిని ఎంచుకోవచ్చు.

ఈ సరికొత్త ఈవీ 3 బ్యాటరీ ఆప్షన్స్‌తో వస్తుంది. 2.6 కిలోవాట్, 3.4 కిలోవాట్, 4.4 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్స్‌తో బైక్‌ని కొనుగోలు చేయవచ్చు. ఇది పేటెంట్ పొందిన టెక్నాలజీతో కూడిన LFP బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఇక ఫర్ఫామెన్స్ పరంగా ఈ మూడు వేరియంట్లు గరిష్టంగా గంటకు 95 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. అలాగే 0-40 కిలోమీటర్ల వేగాన్ని 3.3 సెకన్లలో అందుకుంటుంది.
ఇక ఈ బైక్‌కి జతచేయబడిన ఎలక్ట్రిక్ మోటార్ 52 NM టార్క్‌ని విడుదల చేస్తుంది. ఈ బ్యాటరీని ఒక్కసారి ఫుల్‌ఛార్జ్ చేస్తే 175 కిలోమీటర్ల రేంజ్‌ని అందిస్తుంది. ఈ ధరలో భారీ మొత్తంలో రేంజ్ అందిస్తుంది కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారు సైతం ఈ బైక్‌ని కొనుగోలు చేయవచ్చు.

ఇక ఇందులోని ఫీచర్ల విషయానికొస్తే LED ఇన్‌స్ట్రూమెంట్ క్లస్టర్, UBA, జియో ఫెన్సింగ్, థెఫ్ట్ ప్రొటెక్షన్, డీఏఎస్ (Drive Assistance System) ఉన్నాయి. ఇందులో ఎకో, సిటీ, ఎకో అనే మూడు రైడింగ్ మోడ్స్ ఉన్నాయి. ఈ బైక్‌ని కేవలం 45 నిమిషాల్లో బ్యాటరీని 80 శాతం ఛార్జ్ చేయవచ్చని ఓబెన్ పేర్కొంది. ఆసక్తిగల కస్టమర్లు 5 సంవత్సరాలు లేదా 75,000 కిలోమీటర్ల వరకు కాంప్రెహెన్సివ్ వారంటీని ఎంచుకోవచ్చు.
రోజువారీ ప్రయాణీకుల అవసరాలకు తగినట్లుగా ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లను తీసుకువస్తున్నట్లు ఒబెన్ ఎలక్ట్రిక్ ఫౌండర్, సీఈవో శ్రీమతి మధుమితా అగర్వాల్ తెలిపారు. పూర్తిగా మేడ్ ఇన్ ఇండియా ప్రొడక్ట్‌తో కస్టమర్లకు మరింత నమ్మకంగా మంచి సర్వీస్‌ని అందించేలా వీటిని తీసుకువచ్చినట్లు ఆమె వెల్లడించారు. ప్రస్తుతం కార్ల విషయంలో మాన్యువల్ నుంచి ఆటోమేటిక్ మారుతున్నందున్న తరుణంలో స్కూటర్ల నుంచి మోటార్ సైకిళ్లకు మారాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఆమే పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications








