రూ. 69,999 కే Odysse ఎలక్ట్రిక్‌ స్కూటర్లు లాంచ్‌.. 105 కి.మీ రేంజ్‌

భారత మార్కెట్లో మరో రెండు ఎలక్ట్రిక్‌ స్కూటర్లు విడుదలయ్యాయి. ప్రముఖ ఈవీ కంపెనీ ఒడిస్సే(Odysse).. స్నాప్‌ మరియు E2 అనే పేర్లతో రెండు ఇ స్కూటర్లను లాంచ్ చేసింది. ఒకటి హై స్పీడ్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ కాగా.. మరొకటి లో స్పీడ్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌. ధర, ఫీచర్లు పూర్తి వివరాలు ఈ కథనంలో..

దేశంలో ఎలక్ట్రిక్‌ టూ వీలర్లకు డిమాండ్‌ పెరిగిపోతుంది. ముఖ్యంగా ఇ స్కూటర్‌ విభాగంలో పోటీ వివరీతంగా ఉంది. స్టార్టప్‌లతో పాటు ప్రముఖ కంపెనీలు కూడా ఈ రంగంలో సత్తా చాటేందుకు కృషి చేస్తున్నాయి. తక్కువ ధరలో, అధునాతన ఫీచర్లతో కస్టమర్లను ఆకట్టుకునేలా స్కూటర్లను డిజైన్ చేస్తున్నాయి.

Odyssey-SNAP-E2-Electric-Scooters-Launch

ఈవీ విభాగంలో ఓలా, ఏథర్‌ ఎనర్జీ, టీవీఎస్‌ లాంటి ప్రముఖ సంస్థలు గణనీయమైన సేల్స్‌తో దూసుకుపోతున్నాయి. ఈ క్రమంలో మహారాష్ట్రకు చెందిన ప్రముఖ ఈవీ కంపెనీ Odysse నుంచి ఇప్పటికే పలు స్కూటర్లు మార్కెట్లో అందుబాటులో ఉండగా.. తాజాగా మరో రెండు ఇ స్కూటర్లను లాంచ్ చేసింది.

Odysse నుంచి Snap అనే హై- స్పీడ్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ను సంస్థ రూ. 79,999 కే విడుదలైంది. కాగా మరో స్కూటర్‌ లో- స్పీడ్‌ వేరియంట్‌లో E2 ను రూ. 69,999 ధరతో లాంచ్‌ అయింది. ఇవన్నీ ఎక్స్‌-షోరూమ్‌ ధరలు. లోనావాలాలో జరిగిన వార్షిక డీలర్ల సమావేశంలో రెండు బ్యాటరీ ఆప్షన్లతో ఈ స్కూటర్లను లాంచ్ చేశారు.

Odyssey-SNAP-E2-Electric-Scooters-Launch

కొత్త ఎలక్ట్రిక్‌ స్కూటర్ల లాంచ్‌పై.. ఒడిస్సే ఎలక్ట్రిక్ CEO నెమిన్ వోరా మాట్లాడారు. SNAP హై-స్పీడ్ స్కూటర్ మరియు E2 లో-స్పీడ్ స్కూటర్ పరిచయంతో.. స్టెబిలిటీ, పర్ఫామెన్స్‌ ఇంకా కస్టమర్‌ సాటిశ్‌ఫాక్షన్‌ పరంగా వీటిని అభివృద్ధి చేసినట్లు పేర్కొన్నారు. తక్కువ ధరలో ఈ అధునాతన స్కూటర్లను ప్రవేశపెట్టడం ద్వారా.. భారత మార్కెట్‌తో పాటు ఇతర మార్కెట్లలో కూడా కొత్త ప్రమాణాలను సెట్‌ చేస్తుందని చెప్పారు.

కాగా Odysse స్నాప్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ను శక్తివంతం చేయడం కోసం 2kW ఎలక్ట్రిక్ మోటారును ఉపయోగించారు. ఈ మోటార్‌ ద్వారా రైడర్‌ గరిష్ఠంగా గంటకు 60 కి.మీ వేగంతో ప్రయాణించవచ్చు. ఇందులో AIS156 సర్టిఫైడ్ స్మార్ట్ బ్యాటరీ (LFP) ప్యాక్‌ను ఉపయోగించారు. ఈ బ్యాటరీని ఛార్జ్‌ చేసేందుకు 4 గంటల కంటే తక్కవ సమయం పడుతుందని కంపెనీ వెల్లడించింది.

Odysse Snap ఇ స్కూటర్‌ పూర్తి ఛార్జ్‌పై 105 కి.మీ రేంజ్‌ను అందిస్తుంది. ఫీచర్ల పరంగా, SNAP ఖచ్చితమైన బ్యాటరీ లెవెల్స్‌, రేంజ్‌, ఇంకా రైడర్‌కు అవసరమైన సమాచారాన్ని పొందుపరిచేందుకు CAN- ఎనేబుల్‌డ్‌ డిస్‌ప్లేను తీసుకువచ్చింది. అంతేకాకుండా ఈ స్కూటర్‌లో క్రూయిజ్‌ కంట్రోల్‌ ఆప్షన్‌ కూడా ఉంది.

ఇక E2 ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ విషయానికొస్తే ఇందులో చాలా సింపుల్‌ స్పెసిఫికేషన్లను చూడవచ్చు. ఇది 250W ఎలక్ట్రిక్ మోటారు ద్వారా శక్తిని పొందుతుంది. ఇందులో బ్యాటరీ సమాచారాన్ని సంస్థ వెల్లడించలేదు కానీ.. ఈ స్కూటర్‌ గరిష్ఠంగా గంటకు 25 కి.మీ వేగంతో ప్రయాణిస్తుందని సంస్థ వెల్లడించింది.

పూర్తి ఛార్జ్‌పై Odysse E2 ఇ స్కూటర్‌ బ్యాటరీ ప్యాక్‌ 70 కి.మీ గరిష్ట రేంజ్‌ను అందించడంతో పాటు కేవలం 4 గంటల్లో బ్యాటరీని పూర్తి ఛార్జ్‌ చేయవచ్చు. ఇక ఇప్పటికే ఒడిస్సే భారత మార్కెట్లో.. హాక్ లైట్, E2GO, రేసర్ లైట్, వాడర్ మరియు ఎవోకిస్ వంటి అనేక రకాల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను విక్రయిస్తోంది.

Article Published On: Friday, May 3, 2024, 12:29 [IST]
English summary
Odysse launches snap and e2 electric scooters price specs battery range details here
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+