ఒక్క రూపాయితో బుక్ చేసుకోండి.. రూ. 31,000 వరకు డిస్కౌంట్ పొందండి.. స్కూటర్లపై అస్సలు ఊహించని ఆఫర్లు!
పండుగ సీజన్‌లో మంచి మార్కెట్‌ని సాధించేందుకు ఆటోమొబైల్ కంపెనీలు భారీగా ఆఫర్లను ప్రకటిస్తాయి. ఆగస్టు నెల నుంచే ఈ పండుగ సీజన్ ఆరంభం అయ్యింది. ఇప్పటికే పలు కంపెనీలు ఇండిపెండెన్స్ డే, రక్షా బంధన్‌తో సహా నెల ఆరంభం నుంచే భారీ డిస్కౌంట్లు ఆఫర్లను ప్రకటించాయి. పండుగ సీజన్ సమీపిస్తుండటంతో పలు వాహన తయారీ సంస్థలు అందిస్తున్న ఈ ఆఫర్లు ఇలానే కొనసాగే అవకాశం ఉంది. తక్కువ ధరలో మీకు నచ్చిన వాహనాన్ని కొనుగోలు చేయడానికి ఇదే సరైన సమయం. ప్రస్తుతం సాంప్రదాయ వెహికిల్స్ కంటే ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థలు ఎక్కువగా ఆఫర్లను అందిస్తున్నాయి. దేశంలో ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ ఒకాయా ఈవీ (Okaya EV) తన ఎలక్ట్రిక్ స్కూటర్ల లైనప్స్‌పై ఆగస్టు నెలలో ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది.
తాజాగా ఎలక్ట్రిక్ స్కూటర్లకు మారాలనుకునే వారి కోసం పలు ఫైనాన్స్ స్కీమ్స్‌ని ప్రకటించింది. వీటితో సహా కొత్తగా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకునే కస్టమర్లు తమకు నచ్చిన మోడల్‌ని కేవలం రూ.1కే బుక్ చేసుకోవచ్చు. ఈ నెలలో ఓకియా ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేస్తే రూ.31,000 వరకు బెనిఫిట్స్ లభిస్తాయి. ప్రస్తుతం షోరూమ్‌ల్లో స్టాక్ అయిపోయే వరకు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది.

ఈ ఆఫర్ల ప్రకటనతో ఒకాయా ఎలక్ట్రిక్ స్కూటర్ల కొత్త ధరలు మునుపటి కంటే చాలా తగ్గాయి. ఒకాయా ఎలక్ట్రిక్ స్కూటర్ లైనప్‌లోని బేస్ వేరియంట్ స్కూటర్ ప్రారంభ ధరలు రూ. 78,557గా ఉండగా ఇప్పుడు రూ .74,899 నుంచి ప్రారంభం అవుతాయి. ఇక కంపెనీ ఫ్లాగ్‌షిప్ ఇ-స్కూటర్ మోటోఫాస్ట్ రూ.1.54 లక్షలకు కాకుండా రూ .1.29 లక్షలకే ఇంటికి తెచ్చుకోవచ్చు.
ఒకాయా ఫాస్ట్ ఎఫ్3 మునుపటి ధర రూ .1.34 లక్షలు కాకుండా రూ .1.09 లక్షలకే లభిస్తుంది. ఇవన్నీ ఎక్స్ షోరూమ్ ధరలు. వాహనాన్ని కస్టమర్లకు మరింత చేరువ చేయడానికి కంపెనీ ఆకర్షణీయమైన ఫైనాన్స్ స్కీమ్స్‌ని కూడా అందిస్తోంది. ఈ స్కూటర్ కొనుగోళ్లపై 100 శాతం వరకు లోన్స్ పొందవచ్చు. 6.99 శాతం నుంచి ప్రారంభమయ్యే వడ్డీ రేటుతో లోన్ ద్వారా స్కూటర్లను కొనుగోలు చేయవచ్చు.

వీటి కోసం నెలవారీ వాయిదాలు (EMI) స్కీమ్స్ రూ.2,999 నుంచి ప్రారంభమవుతాయి. అంటే కేవలం మీరు ఒక్క రూపాయితో ఒకాయా స్కూటర్‌ని మీరు ఇంటికి తెచ్చుకోవచ్చు అన్నమాట. అయితే ఆ కంపెనీలోని ఏకైక బైక్ ఫెర్రాటో డిస్ట్రప్టర్ (Ferrato Disruptor) ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్‌పై ఎటువంటి ఆఫర్‌ని ప్రకటించలేదు. ఈ ఏడాది ప్రారంభంలో రూ.1.60 లక్షల ఎక్స్-షోరూమ్ ధరతో లాంచ్ అయింది.
ఫెర్రాటో డిస్ట్రప్టర్‌ని ఒక స్పోర్ట్స్ బైక్ లాగా డిజైన్ చేసింది. ముందు భాగంలో డ్యూయల్ LED హెడ్‌ల్యాంప్ సెటప్ ఉంది. ఇందులో స్ప్లిట్ సీట్లు, స్ప్లిట్ గ్రాబ్స్, ఫేరింగ్ సైడ్ స్కర్ట్స్ ఉన్నాయి. దీనిలో 17 అంగుళాల బ్లాక్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. ఇన్ఫెర్నో ఇన్‌ఫెర్నో రెడ్, థండర్ బ్లూ, స్టెల్త్ బ్లాక్ అనే మూడు కలర్ ఆప్షన్లలో ఈ బైక్ లభిస్తుంది.

పర్మనెంట్ మాగ్నెట్ 6.37 కిలోవాట్ల మోటారు 8.54bhp గరిష్ట శక్తిని విడుదల చేస్తుంది. చైన్ డ్రైవ్ సిస్టమ్ ద్వారా పవర్ వెనుక చక్రానికి శక్తిని అందిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ గరిష్ట వేగం గంటకు 95 కిలోమీటర్లుగా ఉంది. ఇది ఎకో, సిటీ, స్పోర్ట్స్ అనే మూడు రైడ్ మోడ్స్ ఉన్నాయి. దీంతోపాటు రివర్స్ అసిస్ట్ మోడ్ కూడా ఉంది.
మోటారు 4 కిలోవాట్ల LFP బ్యాటరీ నుంచి శక్తిని పొందుతుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 129 కిలోమీటర్ల పరిధిని అందిస్తుందని కంపెనీ పేర్కొంది. బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ కావడానికి ఐదు గంటల సమయం పడుతుంది. ఈ బ్యాటరీ 3 సంవత్సరాలు లేదా 30,000 కిలోమీటర్ల వారంటీని అందిస్తుంది.
| Okaya EV | New Prices | Old Prices |
| Motofaast | ₹1.29 Lakh | ₹1.54 Lakh |
| Faast F3 | ₹1.09 Lakh | ₹1.34 Lakh |
| Faast F4 | ₹1.19 Lakh | ₹1.50 Lakh |
| Faast F2B | ₹94,998 | ₹1.09 Lakh |
| Faast F2T | ₹94,998 | ₹1.05 Lakh |
| Faast F2F | ₹83,999 | ₹87,802 |
| Freedum | ₹74,899 | ₹78,557 |
ఇందులో జీపీఎస్ కనెక్టివిటీ, జియో ఫెన్సింగ్, ఫైండ్ మై వెహికల్ ఫంక్షనాలిటీతో కూడిన ఫుల్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అంతే కాకుండా ఒకాయా ఆప్షనల్ యాక్సెసరీగా సౌండ్ బాక్స్‌ని కూడా అందిస్తుంది. ఒకాయా ఇప్పటికే 600 ఈవీ ఛార్జర్లను అమర్చడానికి ప్రభుత్వ యాజమాన్యంలోని హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) తో ఒప్పందం కుదుర్చుకుంది. భారత ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లో తన స్థానాన్ని బలోపేతం చేసుకోనుంది.


Click it and Unblock the Notifications








