129 కి.మీ రేంజ్‌తో ఒకాయ ఈవీ Ferrato Disrupter బైక్ లాంచ్.. ధర రూ. 1.59 లక్షలు మాత్రమే
న్యూఢిల్లీకి చెందిన ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ ఒకాయ(Okaya EV)) EVకి చెందిన బ్రాండ్.. ఫెర్రాటో గురువారం తన డిస్‌ప్టర్ ఎలక్ట్రిక్ బైక్‌ను లాంచ్ చేసింది. సరసమైన ధరలో విడుదలైన ఈ బైక్.. అధిక రేంజ్ మరియు ఆకర్షణీయమైన ఫీచర్లను కలిగి ఉంది. ధర, ఇతర వివరాలు ఈ కథనంలో..
దేశీయ మార్కెట్లో, కొత్త ఫెర్రాటో డిస్‌రప్టర్(Ferrato Disrupter E Bike) ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను సంస్థ రూ.1,59,999 ఎక్స్-షోరూమ్ ధరతో విడుదల చేసింది. ఇందులో ఇది 3.97 kWh కెపాసిటీ గల బ్యాటరీ ప్యాక్ ఆప్షన్‌ను ఉపయోగించారు. ఈ బైక్ పూర్తి ఛార్జ్‌పై 129 కిమీ రేంజ్‌ను అందిస్తుందని సంస్థ చెబుతోంది.

ఈ ఫెర్రాటో డిస్‌రప్టర్ ఇ-బైక్‌లో PMSM ఎలక్ట్రిక్ మోటార్‌ను ఉపయోగించారు. ఇది 6.37 KW గరిష్ట శక్తిని మరియు 228 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్ గరిష్టంగా గంటకు 95 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది. ఇందులో ఎకో, సిటీ & స్పోర్ట్స్ రైడింగ్ మోడ్‌లను కలిగి ఉంటుంది. హ్యాండిల్‌బార్‌పై స్విచ్ ద్వారా మోడ్‌లను యాక్సెస్ చేయవచ్చు.
కొత్త ఫెర్రాటో డిస్‌రప్టర్ ఎలక్ట్రిక్ బైక్‌లోని బ్యాటరీని కేవలం 5 గంటల్లో పూర్తిగా ఛార్జ్ చేయవచ్చని సంస్థ చెబుతోంది. ఇందులో మొబైల్, బ్లూటూత్, జీపీఎస్ కనెక్టివిటీ, జియో ఫెన్సింగ్, 17 అంగుళాల అల్లాయ్ వీల్స్ వంటి వివిధ రైడర్ ఫ్రెండ్లీ ఫీచర్లు ఉన్నాయి. ముందు భాగంలో ఫ్రంట్ టెలిస్కోపిక్, వెనుక భాగంలో మోనోషాక్ సస్పెన్షన్ సెటప్‌ను కలిగి ఉంటుంది.

Ferrato Disrupter E Bike లో రైడర్ భద్రత కోసం, డిస్క్ బ్రేక్ ఆప్షన్‌ను అందిస్తోంది. ఇంకా ఇది స్ప్లిట్-సీట్‌ను కూడా కలిగి ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ బైక్‌లో ఉపయోగించిన బ్యాటరీ ప్యాక్ IP-67 రేటింగ్‌ను కలిగి ఉండటంతో పాటు ఇది భారతీయ వాతావరణ పరిస్థితులకు మరింత అనుకూలంగా ఉంటుందని ఒకాయ ఈవీ వెల్లడించింది. అంతేకాకుండా కంపెనీ బ్యాటరీపై 3 సంవత్సరాల/30,000 కి.మీ వారంటీని అందిస్తోంది.
కొత్త ఫెర్రాటో డిస్‌రప్టర్ ఈ బైక్.. తక్కువ రన్నింగ్ ఖర్చుతో కూడుకున్నదని, అంటే ఒక కిలోమీటరు ప్రయాణానికి రైడర్‌కు కేవలం రూ.25 పైసలు మాత్రమే ఖర్చు అవుతుందని కంపెనీ వెల్లడించింది. ఈ బైక్ బుకింగ్‌లు గత గురువారం నుంచి ప్రారంభమయ్యాయి. ఆసక్తి గల కస్టమర్‌లు ఫెర్రాటో అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి కొత్త బైక్‌ను బుక్ చేసుకునే సదుపాయం ఉంది.

కాగా ప్రత్యేక ఆఫర్‌లో భాగంగా మొదటి 1,000 మంది కస్టమర్‌లు రూ. 500 ముందస్తు చెల్లింపుతో కొత్త ఫెర్రాటో డిస్‌రప్టర్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను బుకింగ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత బుకింగ్ ఫీజు రూ.2,500 చెల్లించాల్సి ఉంటుంది. కొత్త ఎలక్ట్రిక్ బైక్‌ల డెలివరీ వచ్చే 90 రోజుల్లో ప్రారంభం కానుంది. కాగా డిస్‌రప్టర్ బైక్‌తో పాటు, ఈ ఏడాది చివరి నాటికి మరో రెండు ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెట్టేందుకు కంపెనీ ప్రయత్నిస్తోంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








