ఒకాయ ఈవీ Ferrato Disrupter బుకింగ్‌లు ప్రారంభం.. ఆ 1000 మంది కస్టమర్లకు స్పెషల్‌ ఆఫర్‌

భారత్‌లో ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ ఒకాయ EV ఫెర్రాటో.. దాని రాబోయే ఈ-మోటార్‌సైకిల్ డిస్‌రప్టర్ బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. ఆసక్తి గల కస్టమర్‌లు ఫెర్రాటో అధికారిక వెబ్‌సైట్‌ని సందర్శించి కొత్త బైక్‌ను బుక్ చేసుకోవచ్చు. ఈ బైక్‌ ధర, ఫీచర్లు, బుకింగ్ వివరాలు పూర్తి సమాచారం ఈ కథనంలో..

ఒకాయ ఈవీ ఫెర్రాటో డిస్‌రప్టర్‌ కొత్త ఇ బైక్‌ను కొనుగోలు చేయాలనుకునే మొదటి 1,000 మంది కస్టమర్‌లు ప్రత్యేక ఆఫర్‌లో భాగంగా రూ. 500 ముందస్తు చెల్లింపుతో బుక్ చేసుకోవచ్చు. ఆ తర్వాత కస్టమర్లు బుకింగ్ ఫీజు రూ. 2,500 చెల్లించాల్సి ఉంటుంది. ఇక సంస్థ ఈ ఎలక్ట్రిక్ బైక్‌ను చాలా అధునాతనంగా రూపొందించింది.

Okaya-EV-Ferrato-EV-Disrupter-Bookings-Open

కొత్త ఒకాయ ఫెర్రాటో డిస్‌రప్టర్‌ ఇ బైక్‌లో స్ప్లిట్-సీట్ సెటప్ మరియు LED లైట్లు ఉన్నాయి. బ్యాటరీ పరంగా ఇందులో 3.97 kWh బ్యాటరీ ప్యాక్ ఉపయోగించారు. ఇందులో ఉపయోగించిన PMSM ఎలక్ట్రిక్ మోటార్ గరిష్ఠంగా 6.37 KW శక్తిని మరియు 228 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇ బైక్‌ ఫుల్ ఛార్జింగ్‌పై 129 కి.మీల రేంజ్ ఇస్తుందని కంపెనీ వెల్లడించింది.

కొత్త ఫెర్రాటో డిస్‌రప్టర్‌ ఇ బైక్‌ గరిష్ఠంగా గంటకు 95 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది. ఇక ఈ బైక్‌ ముందు భాగంలో ఫ్రంట్‌ టెలిస్కోపిక్ ఫోర్క్‌లను కలిగి ఉంటుంది. వెనుక రియర్‌ మోనో-షాక్ సస్పెన్షన్ సెటప్‌తో వస్తుంది. ఇంక భద్రత కోసం డిస్క్ బ్రేక్ ఆప్షన్‌ను కలిగి ఉంటుంది.

కాగా కొత్త ఫెర్రాటో డిస్‌రప్టర్ ఎలక్ట్రిక్ బైక్ ధరను మే 2న సంస్థ ప్రకటించనుంది. మోటార్‌సైకిల్ చాలా పోటీ ధరలో అందుబాటులోకి రావచ్చని ఆటో నిపుణులు భావిస్తున్నారు. మంచి పర్ఫామెన్స్‌, అదిరిపోయే లుక్‌ను కలిగి ఉండే ఎలక్ట్రిక్ బైక్ కోసం వెతుకుతున్న యువకులకు డిస్‌రప్టర్‌ మంచి ఆప్షన్‌గా ఉంటుందని సంస్థ చెబుతోంది. త్వరలో దీనిపై పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.

ఇక ప్రస్తుతం, ఒకాయ EV దేశీయ మార్కెట్లో అనేక ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను విక్రయిస్తోంది. సంస్థకు చెందిన ఒకాయ ఫ్రీడమ్ చాలా తక్కువ ధరలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. దీని ధర రూ. 69,950 (ఎక్స్-షోరూమ్). ఇది 1.44 KWh కెపాసిటీ గల బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. పూర్తి ఛార్జింగ్‌పై 70 నుంచి 75 కి.మీ రేంజ్‌ను కలిగి ఉంటుంది.

ఒకాయ Faast ఎలక్ట్రిక్ స్కూటర్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 1.10 నుండి రూ. 1.20 లక్షల మధ్య కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. ఇందులో 4.4 KWh బ్యాటరీ ప్యాక్‌ ఉపయోగించారు. ఫుల్ ఛార్జింగ్‌పై 140-160 కి.మీ రేంజ్‌ ఇస్తుంది. ఒకాయ ఫాస్ట్ F2B, ఒకాయ ఫాస్ట్ F2F, ఒకాయ మోటోఫాస్ట్, ఒకాయ ఫాస్ట్ F2T పేరిట స్కూటర్లను సంస్థ విక్రయిస్తోంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Monday, April 29, 2024, 10:02 [IST]
English summary
Okaya ev ferrato disrupter electric bike bookings open special offer for first 1000 customers
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+