దీపావళికి అసలైన బంపర్ ఆఫర్ అంటే ఇదే.. కానీ రేపటి వరకే లాస్ట్ ఛాన్స్.. మిస్ చేసుకోకండి
దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల హావా కొనసాగుతుంది. దాదాపు పెద్ద నగరాల నుంచి మొదలుకుని గ్రామాల్లో ఈవీలు కనిపిస్తూనే ఉన్నాయి. పెట్రోల్, డీజిల్ రేట్లను భరించలేక చాలా మంది ఈవీ స్కూటర్లను కొనడానికి తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ విభాగంలో ఇప్పటికే టాప్ ప్లేస్‌లో ఉన్న ఓలా ఎలక్ట్రిక్(Ola Electric)దీపావళిని పురస్కరించుకుని ప్రత్యేక తగ్గింపు ఆఫర్లను ప్రకటించింది. '72 అవర్ రష్(72 hours Rush)' పేరుతో పండుగ సీజన్ కోసం తన వాహనాలపై అతిపెద్ద తగ్గింపులను అందిస్తుంది. ఈ ఆఫర్ మరికొద్ది గంటల్లో ముగిసిపోతుంది. కాబట్టి కొత్తగా ఈవీ స్కూటర్లను కొనుగోలు చేయాలనుకుంటున్న వారు ఈ బిగ్గెస్ట్ తగ్గింపు ఆఫర్‌ను ఉపయోగించుకుని ఊహించని తక్కువ ధరతో స్కూటర్‌ను తమ ఇంటికి తీసుకెళ్లవచ్చు.
Ola ఎలక్ట్రిక్ ప్రకటించిన ఆఫర్ల విషయానికి వస్తే, S1 మోడల్‌పై దాదాపు రూ.25,000 తగ్గింపులను అందిస్తుంది. దీంతో పాటు అదనంగా స్కూటర్‌పై రూ.30,000 వరకు విలువైన ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఓలా ప్రకటించిన ఆ తగ్గింపు ఆఫర్ అక్టోబర్ 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

కంపెనీ విడుదల చేసిన నోట్ ప్రకారం, Ola S1 ఎలక్ట్రిక్ స్కూటర్‌లలో ఏ వేరియంట్‌ను కొనుగోలు చేసిన కూడా కస్టమర్‌లు రూ.25,000 వరకు తగ్గింపు, రూ.30,000 విలువైన ఆఫర్లను పొందవచ్చు. ఓలా ఎలక్ట్రిక్ ప్రకటించిన ఆఫర్‌తో ఎస్1 ఎలక్ట్రిక్ స్కూటర్ల ధర రూ.74,999కి చేరుకుంది. ఇంత తక్కువ ధరకు టాప్ బ్రాండ్‌కు చెందిన ఈవీ స్కూటర్ రావడం అంటే ఆశ్చర్యమే అని చెప్పాలి.
అదనపు రూ.30,000 తగ్గింపులో 8-సంవత్సరాలు లేదా 80,000 కిమీ బ్యాటరీ వారంటీ ఉచితంగా లభిస్తుంది. దీని విలువ రూ. 7,000 వరకు ఉంటుంది. ఇంకా, ఫైనాన్స్ ఆఫర్‌లలో భాగంగా ఎంచుకున్న క్రెడిట్ కార్డ్ ఈఎంఐలపై రూ.5,000 వరకు ప్రత్యేక తగ్గింపు ఆఫర్‌ను అందిస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. రూ. 7,000 వరకు ఉచిత రీఛార్జింగ్ క్రెడిట్లు కూడా లభిస్తాయి. ఇంకా, 6,000 విలువైన MoveOS+ సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడ్‌ను ఆఫర్‌లో ఉచితంగా పొందవచ్చు.

ముఖ్యంగా పాత స్కూటర్‌ను ఇచ్చి ఈ కొత్త మోడల్‌ను కొనుగోలు చేయాలనుకునే వారికి కూడా కంపెనీ ప్రత్యేక తగ్గింపును ప్రకటించింది. రూ.5,000 విలువైన క్స్ఛేంజ్ బోనస్‌ను కూడా దీపావళి ఆఫర్‌లో పొందవచ్చు. ఇన్ని డిస్కౌంట్ ఆఫర్లతో లభిస్తున్న Ola S1 ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రస్తుతం 3 వేరియంట్లలో అందుబాటులో ఉంది.
అవి, ఓలా S1 ప్రో, S1 ఎయిర్, S1 X. S1X ఎలక్ట్రిక్ స్కూటర్ 2kWh, 3kWh, 4kWh బ్యాటరీ ప్యాక్‌లలో లభిస్తుంది. వీటి ఎక్స్-షోరూమ్ ధరలు రూ.74,999 నుండి రూ.1,14,999 వరకు ఉన్నాయి. ఓలా ఎలక్టిక్ ప్రకటించిన ఆఫర్ మరికొద్ది గంటల్లో ముగిస్తుంది.

కాబట్టి దీపావళి సమయాన కొత్త ఈవీ స్కూటర్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్న వారు వెంటనే బుక్ చేసుకోవడం మంచింది. ఎందుకంటే భారీ తగ్గింపు ఆఫర్ మళ్లీ ఎప్పుడు వస్తుందో తెలియదు. అందుకే వెంటనే త్వరపడి కొనుగోలు చేసి తక్కువ ధరలో ఈవీని ఇంటికి తీసుకెళ్లవచ్చు.
డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








