ఇది కదా డిస్కౌంట్ అంటే!.. ఓలా స్కూటర్‌పై భారీ తగ్గింపు

భారతీయ మార్కెట్లో అతి తక్కువ కాలంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric).. ప్రారంభం నుంచి ఉత్తమ అమ్మకాలను పొందుతూ.. ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇస్తోంది. దేశీయ విఫణిలో పలు మోడళ్లను లాంచ్ చేసి వాహన ప్రియులను ఆకర్శించడంలో విజయం పొందిన ఈ కంపెనీ నెలవారీ అమ్మకాల్లో కూడా కొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. ఓలా ఎలక్ట్రిక్ గత మే నెలలో 37191 ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించింది, ఇదే నెల గత ఏడాది కంపెనీ సేల్స్ 35000 యూనిట్లు. దీన్ని బట్టి చూస్తే కంపెనీ అమ్మకాలు వృద్ధి చెందినట్లు స్పష్టంగా అర్థమవుతోంది.

ఎలక్ట్రిక్ స్కూటర్ల అమ్మకాల్లో అగ్రగామిగా ఉన్న ఓలా ఎలక్ట్రిక్ ఇప్పుడు కస్టమర్ల కోసం అద్భుతమైన డిస్కౌంట్ అందిస్తోంది. 2024 జూన్ 20 నుంచి జూన్ 26 వరకు ఓలా ఎస్1 లైనప్‌లోని ఎలక్ట్రిక్ స్కూటర్లను కొనుగోలు చేసేవారు ఏకంగా రూ. 15000 వరకు ప్రయోజనాలను పొందవచ్చు. ఆఫర్‌లలో భాగంగా ఓలా ఎస్1 ఎక్స్+ కొనుగోలుపై రూ. 5000 ఫ్లాట్ డిస్కౌంట్ పొందవచ్చు. అంటే ఈ స్కూటర్ ధర ఇప్పుడు రూ.84999.

Ola Electric Announces Up To Rs 15000

కంపెనీ అందించే ఈ డిస్కౌంట్‌లో రూ.5000 ఫ్లాట్ డిస్కౌంట్ మాత్రమే కాకుండా.. రూ.5000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్, మరియు రూ.5000 వరకు క్యాష్‌బ్యాక్ కూడా అందుబాటులో ఉన్నాయి. కంపెనీ యొక్క ఎస్1 ఎయిర్ మరియు ఎస్1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ల కొనుగోలు మీద రూ.5000 అదనపు తగ్గింపు కూడా అందిస్తుంది. అంతే కాకుండా రూ.2999 విలువైన ఫ్రీ Ola Care+ సబ్‌స్క్రిప్షన్ ప్యాకేజీ ఇప్పుడు ఉచితంగా అందుబాటులో ఉంది.

ఓలా ఎలక్ట్రిక్ యొక్క లైనప్‌లో ఓలా ఎస్1 ఎక్స్ (2kWh / 3 kWh), ఓలా ఎస్1 ఎక్స్+, ఓలా ఎస్1 ఎక్స్ (4kWh), ఓలా ఎస్1 ఎయిర్ మరియు ఓలా ఎస్1 ప్రో వంటి వాటిని కలిగి ఉంది. ఇందులో ఓలా ఎస్1 ఎక్స్ 2 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కలిగిన స్కూటర్ ధర రూ. 74999.. కాగా ఎస్1 ప్రో ధర రూ.129999 (ధరలు ఎక్స్-షోరూమ్ బెంగళూరు).

Ola S1 X

ఓలా ఎలక్ట్రిక్ యొక్క అన్ని స్కూటర్లు చూడటానికి ఒకే విధంగా ఉన్నప్పటికీ.. వేరియంట్ను బట్టి ఫీచర్ మారుతూ ఉంటాయి. బేస్ వేరియంట్ కొన్ని స్టాండర్డ్ ఫీచర్స్ పొందుతుంది. టాప్ ఎండ్ మోడల్ ఎక్కువ ఫీచర్స్ లేదా అడ్వాన్స్డ్ ఫీచర్స్ పొందుతుంది. ఇవన్నీ వాహన వినియోగదారులకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఈ కారణంగానే ఎక్కువమంది వీటిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు.

ఓలా ఎలక్ట్రిక్ ఇప్పుడు డిస్కౌంట్ అందించడం మాత్రమే కాకుండా.. తన శ్రేణి మొత్తం ఎలక్ట్రిక్ స్కూటర్ల మీద అదనపు ఖర్చు లేకుండా.. 8 సంవత్సరాలు లేదా 80000 కిమీ వారంటీ అందిస్తుంది. కొంత తక్కువ ధర వద్ద ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకునే వారికి ఇది మంచి శుభవార్త అనే చెప్పాలి. ఈ ఆఫర్ ఈ నెల 26 తరువాత బహుశా అందుబాటులో ఉండకపోవచ్చు.

Ola S1 X Range

ఇదిలా ఉండగా కంపెనీ త్వరలో ఎలక్ట్రిక్ బైకును కూడా లాంచ్ చేయనున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే సంస్థ లాంచ్ చేయనున్న బైకుల గురించి కూడా కొన్ని వివరాలు వెల్లడయ్యాయి. మొత్తం నాలుగు బైకులను కంపెనీ లాంచ్ చేయనున్నట్లు సమాచారం. అంతే కాకుండా కంపెనీ మార్కెట్లో ఎలక్ట్రిక్ కారును కూడా లాంచ్ చేయనున్నట్లు గతంలో కొన్ని సందర్భాల్లో వెల్లడించింది. దీనికి సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.

More from DriveSpark

Article Published On: Saturday, June 22, 2024, 11:35 [IST]
English summary
Ola electric announces up to rs 15000 on s1 ev portfolio in 2024 july
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+