ఓలా ఎలక్ట్రిక్ బైక్ విడుదల ఎప్పుడో తెలిసిపోయింది.. ఇక పూనకాలకు సిద్ధంగా ఉండండి!!
ఎలక్ట్రిక్ టూ-వీలర్ విభాగంలో ఓలా కింగ్ మేకర్‌గా ఉంది. అనతి కాలంలోనే ఈ కంపెనీ మంచి సేల్స్‌తో టూ-వీలర్ విభాగంలో దూసుకెళ్తుంది. ప్రస్తుతం దేశంలో లభిస్తున్న టూ-వీలర్స్‌లో ఈ కంపెనీ స్కూటర్లు టాప్‌లో కొనసాగుతున్నాయి. దీంతో ఈ స్కూటర్లు డిమాండ్ రోజు రోజుకు పెరుగుతుంది. అయితే ఓలా ఎలక్ట్రిక్ తయారు చేస్తున్న ఎలక్ట్రిక్ బైక్‌పై ఎప్పటి నుంచో ఊహాగానాలు వస్తున్నాయి. తాజాగా ఈ కంపెనీ నుంచి ఎలక్ట్రిక్ బైక్ ఎప్పుడు వస్తుందనే అంశంపై ఓ క్లారిటీ వచ్చింది. ఇది ఓలా ఎలక్ట్రిక్ నుంచి రాబోతున్న తొలి ఎలక్ట్రిక్ బైక్ ఇదే కావడం గమనార్హం. ఓలా ఎలక్ట్రిక్ ఒక ఎలక్ట్రిక్ బైక్‌కి బదులుగా వరుసగా నాలుగు ఎలక్ట్రిక్ బైక్స్‌ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. వాటి వివరాలు ఈ కథనంలో..
మొదటి ఓలా ఎలక్ట్రిక్ బైక్లు ఎప్పుడు లాంచ్ చేయబడతాయనే దాని గురించి తాజా లీక్‌ల ఆధారంగా ఓ క్లారిటీ వచ్చింది. బెంగళూరు ప్రధాన కార్యాలయం కలిగిన ఈ కంపెనీ భారతదేశంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన మార్కెట్లో 30% వాటాను కలిగి ఉంది. అంటే భారతదేశంలో విక్రయించే మొత్తం ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలలో 30% ఓలా ఎలక్ట్రిక్‌కి చెందినవి అన్నమాట.

మరే ఇతర ఈవీ స్టార్టప్ కూడా ఇంత తక్కువ కాలంలో అభివృద్ధి సాధించలేదు. ఓలా ఎలక్ట్రిక్ నుంచి కేవల S1 ఎలక్ట్రిక్ స్కూటర్లు మాత్రమే ప్రస్తుతం అమ్మకానికి ఉన్నాయి. కాకపోతే ఎలక్ట్రిక్ బైకులు ఏవీ అమ్మకానికి లేవు. ఓలా ఎలక్ట్రిక్ తన మొదటి ఎలక్ట్రిక్ బైక్‌ని 2026 సంవత్సరంలోని మొదటి ఆరు నెలల్లో విడుదల చేయనుంది. ఈ బైక్ విడుదలతో ఎలక్ట్రిక్ బైక్‌ల మార్కెట్‌ని సైతం శాసించాలని చూస్తుంది.
2023 డిసెంబర్లో ఓలా ఎస్1 X+ ఎలక్ట్రిక్ స్కూటర్ల డెలివరీని ప్రారంభించింది. 2025 ప్రథమార్థంలో ఈ సిరీస్‌లోని ఓలా ఎస్1X (2 కిలోవాట్), ఓలా ఎస్1X (3 కిలోవాట్) ఎలక్ట్రిక్ స్కూటర్లను కూడా విడుదల చేయనుంది. ఆ తర్వాత 2026 ప్రథమార్థం నుంచి డైమండ్‌హెడ్, అడ్వెంచర్, రోడ్‌స్టర్, క్రూయిజర్ వంటి కొత్త మోటార్ సైకిళ్లను ప్రారంభించనుంది.

2026 మొదటి ఆరు నెలల నాటికి వినియోగదారులకు ఓలా ఎలక్ట్రిక్ బైక్లను డెలివరీ చేయడం ప్రారంభిస్తామని ఓలా ఎలక్ట్రిక్ తెలిపింది. దానికి ముందే ఓలా ఎలక్ట్రిక్ నుంచి రాబోయేఈ ఎలక్ట్రిక్ బైక్స్‌ని కూడా లాంచ్ చేయనుంది. ఇక త్వరలో విడుదల కాబోయే ఓలా ఎలక్ట్రిక్ బైక్ బుకింగ్స్ త్వరలోనే ప్రారంభం కానున్నాయి. త్వరలోనే స్పష్టమైన తేదీలను ఓలా వెల్లడించనుంది. ఇందుకోసం ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్ల ఔత్సాహికులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
వాస్తవానికి ఓలా ఎలక్ట్రిక్ ఇప్పటికే ఓలా రోడ్‌స్టర్ ఎలక్ట్రిక్ బైక్ డిజైన్ పేటెంట్ కోసం దరఖాస్తు చేసుకుంది. ఓలా ఎలక్ట్రిక్ ఈ నాలుగు కొత్త ఎలక్ట్రిక్ బైక్స్‌ని ఒకే ప్లాట్‌ఫామ్‌పై నిర్మించాలని యోచిస్తోంది. అందువలన, ఈ నాలుగింటికీ ఒకే బ్యాటరీ మరియు ఎలక్ట్రిక్ మోటారును అమర్చవచ్చు. అయితే ఈ బైక్స్ ఫర్ఫామెన్స్‌లో మార్పులు ఉండే అవకాశం ఉంది. త్వరలో ఓలా నుంచి వచ్చే అప్‌డేట్ కోసం బైక్ ప్రియులు ఎదురుచూస్తున్నారు.

మొదటి ఎలక్ట్రిక్ బైక్ విడుదలకు ముందే, ఓలా ఎలక్ట్రిక్ భారతదేశంలో ప్రముఖ ద్విచక్ర వాహన బ్రాండ్లలో ఒకటిగా ఉంది. కాబట్టి ఒకసారి ఎలక్ట్రిక్ బైకులను ప్రవేశపెట్టిన తర్వాత వాటిని ప్రమోట్ చేయడం, విక్రయించడంలో కంపెనీకి పెద్దగా ఇబ్బంది ఉండదు. అందుకోసం త్వరలోనే స్పష్టమైన తేదీల విడుదల, ఇతర పూర్తి వివరాలను కంపెనీ తెలియజేనుంది. ఈ బైక్ డిజైన్ ప్రస్తుతం ఉన్న సాంప్రదాయ బైక్స్ కంటే భిన్నంగా ఉండనుంది.


Click it and Unblock the Notifications








