పండుగ సీజన్‌లో ఓలా ఔరా అనిపించే ఆఫర్.. కేవలం రూ.50వేలలోపే..

దేశంలో పండుగల సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని ఆటోమొబైల్ తయారీ కంపెనీలు పోటీ పడి మరీ తమ ఉత్పత్తులపై ప్రత్యేకంగా తగ్గింపు ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఈ జాబితాలో దేశీయ ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కంపెనీ ఓలా(OLA) సైతం తన సేల్స్‌ను పెంచుకోడానికి భారీ తగ్గింపును ప్రకటించింది. దీని కోసం కంపెనీ 'బాస్ 72-అవర్ రష్(BOSS 72-hour Rush)'అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కొత్త పథకం కింద ఓలా ఎలక్ట్రిక్ తన కప్టమర్లకు రూ. 30,000 విలువైన ప్రయోజనాలు అందిస్తుంది.

ఈ ఆఫర్ అక్టోబర్ 10 నుంచి 12 వరకు ఉంటుంది. 72 గంటల పాటు మాత్రమే అందుబాటులో ఉండే ఈ సూపర్ స్పెషల్ ఆఫర్‌.. కొత్త ఈవీ స్కూటర్లను కొనుగోలు చేయాలనుకునే వారికి చాలా మంచి అవకాశంగా నిలుస్తుంది. ఈ ఆఫర్‌లో కస్లమర్లు ఎస్‌1 ప్రో(S1 Pro) ఎలక్ట్రిక్ స్కూటర్‌ను రూ. 25 వేలు తగ్గింపు ధరకు కొనుగోలు చేయవచ్చు.

Ola Electric Boss 72-Hour Rush Offers

అలాగే ఓల్డ్ వెహికల్‌ను ఎక్స్ఛేంజ్ చేస్తే రూ. 5 వేల ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా పొందవచ్చు. ఇది కాకుండా బాస్ 72 అవర్ రష్ కింద రూ. 7,000 విలువ చేసే 80,000 కి.మీ లేదా 8 ఏళ్ల బ్యాటరీ వారంటీ ప్లాన్‌ను ఉచితంగా అందిస్తామని ఓలా ప్రకటించింది.

అంతేకాకుండా, కస్లమర్లకు ఫైనాన్సింగ్ ఆఫర్‌లో భాగంగా ఎంపిక చేసిన క్రెడిట్ కార్డ్ EMIలపై రూ.5,000 వరకు ప్రత్యేక తగ్గింపు ఆఫర్‌ను అందిస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. అదనంగా రూ. 6,000 విలువైన MoveOS+ సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడ్‌ను ఈ ఆఫర్‌లో ఉచితంగా పొందవచ్చు. ఇంకా, రూ. 7,000 వరకు ఉచిత రీఛార్జింగ్ క్రెడిట్లు కూడా లభిస్తాయి.

Ola Electric Boss 72-Hour Rush Discounts

ముఖ్యంగా 'బాస్ 72-అవర్ రష్'సేల్‌లో ఓలా S1 X 2kWh మోడల్‌ను కేవలం రూ.49,999కే కొనుగోలు చేయవచ్చు. ప్రతి రోజు లిమిటెడ్ స్కూటర్లు మాత్రమే ఈ ధరకు అందుబాటులో ఉంటాయని కంపెనీ ప్రత్యేకంగా పేర్కొంది. ఈ మోడల్‌ను కొనుగోలు చేయాలనుకునే వారు వెంటనే బుక్ చేసుకోవడం మంచింది. ఎందుకంటే భారీ తగ్గింపు ధరకు లభిస్తుండటంతో బుకింగ్స్‌ ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది.

ప్రస్తుతం ఓలా ఎలక్ట్రిక్(Ola Electric) S1 సిరీస్‌లో మొత్తం ఆరు మోడల్స్ ఉన్నాయి. ప్రీమియం S1 ప్రో ధర రూ.1,34,999. అదే S1 ఎయిర్‌ ధర రూ.1,07,499 వరకు ఉంది. S1 X 2 kWh ధర రూ.74,999. 3 kWh ధర రూ.87,999, 4 kWh రూ.1,01,999.

ఓలా ఎలక్ట్రిక్ ఇటీవల హైపర్ సర్వీస్(Hyper Service) ప్రచారాన్ని ప్రారంభించింది. దీని ద్వారా ఈ ఏడాది డిసెంబర్ నాటికి తన సర్వీస్ నెట్‌వర్క్‌ను 1,000 కేంద్రాలకు రెట్టింపు చేయాలని చూస్తోంది. అదనంగా, భారతదేశం అంతటా తన అమ్మకాలు, నెట్‌వర్క్‌ను విస్తరించేందుకు నెట్‌వర్క్ పార్టనర్ ప్రోగ్రామ్‌ను ప్రకటించింది. దీనిలో భాగంగా, Ola Electric 2025 చివరి నాటికి తన నెట్‌వర్క్‌ను 10,000కి పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది.

ఆగస్టు, 2024లో ఓలా రోడ్‌స్టర్ పేరుతో ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లను లాంచ్ చేసింది. వీటిలో రోడ్‌స్టర్ X(2.5 kWh, 3.5 kWh, 4.5 kWh), రోడ్‌స్టర్ (3.5 kWh, 4.5 kWh, 6 kWh), రోడ్‌స్టర్ ప్రో(8 kWh, 16 kWh) అనే మూడు వేరియంట్లు ఉన్నాయి.

రోడ్‌స్టర్ X ధర రూ.74,999 కాగా, రోడ్‌స్టర్ రూ.1,04,999, రోడ్‌స్టర్ ప్రో ధర రూ.1,99,999. ఇటీవల కాలంలో ఓలా ఈవీలపై ఫిర్యాదులు పెరిగిన నేపథ్యంలో వాటిని పరిష్కరించడానికి ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. దీంతో పాటు భారతదేశంలోని మెకానిక్‌లకు ఈవీ(EV)వాహనాల రిపేర్లపై అవగాహన ఇవ్వడానికి 1 లక్ష మంది థర్డ్-పార్టీ మెకానిక్‌లకు శిక్షణ ఇస్తుంది.

More from DriveSpark

Article Published On: Friday, October 11, 2024, 16:11 [IST]
English summary
Ola electric launched boss 72 hour rush in festival check all discounts and offers in telugu
Read more on: #ola electric #diwali #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+