రేపే తొలి 'ఓలా ఎలక్ట్రిక్ బైక్' విడుదల.. స్కూటర్లతో మనసు దోచేసి.. ఇప్పుడు బైక్‌తో బంధించేందుకు సిద్ధం!
దేశంలో ఎలక్ట్రిక్ వెహికిల్స్‌కి కేరాఫ్ ఆడ్రస్‌గా బెంగళూరుకు చెందిన ఓలా ఎలక్ట్రిక్ ఉంది. ఈ కంపెనీ అతి తక్కువ సమయంలో దేశంలోనే నంబర్ వన్ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీదారుగా అవతరించింది. ప్రస్తుతం ఈ కంపెనీ కేవలం స్కూటర్లను మాత్రమే విక్రయిస్తుంది. ఈ కంపెనీ నుంచి వచ్చే స్కూటర్లు ఢిఫరెంట్ డిజైన్, ఆకర్షణీయమైన ఫీచర్లతో ఉంటాయి. అందువల్ల వీటికి డిమాండ్ ఎక్కువ. మార్కెట్‌లో 'S 1' సిరీస్ ఎలక్ట్రిక్ సరీస్ పేరుతో స్కూటర్లను దేశీయ మార్కెట్లో విక్రయిస్తోంది. ఇప్పుడు మోటార్ సైకిల్ సెగ్మెంట్ లోకి కూడా ప్రవేశించాలని యోచిస్తోంది. రేపు (ఆగస్టు 15) తమిళనాడులోని కృష్ణగిరిలోని తయారీ కేంద్రంలో సంకల్ప్-2024 (Sankalp-2024) ఈవెంట్‌ని ఓలా నిర్వహించనుంది. ఇక్కడే తొలి ఎలక్ట్రిక్ బైక్‌ని ఇక్కడే లాంచ్ చేయనున్నట్లు తెలుస్తుంది.
ఈ కంపెనీ సీఈఓ కస్టమర్లను తనదైన ట్వీట్స్‌తో ఆకట్టుకోవడంలో ముందుంటాడు. ఆయన సోషల్ మీడియా ప్రమోషన్ కంపెనీకి పెద్ద బూస్టింగ్ అని చెప్పవచ్చు. ఎందుకంటే భవిష్ అగర్వాల్ సోషల్ మీడియాలో ఎవరికీ అంతు చిక్కని విధంగా ప్రమోషన్స్ చేస్తూ ఉంటాడు. అందువల్ల అతని ట్వీట్స్ కోసం ఆటోమొబైల్ ఔత్సాహికులు ఆసక్తిగా ఎదురుచూస్తారు.

అయితే తాజాగా ఈ కంపెనీ కొత్త మోటార్ సైకిల్‌తో మార్కెట్‌ని శాసించాలని భావిస్తుంది. దీని గురించి ఎటువంటి అధికారిక వివరాలు వెల్లడించలేదు. అయితే ఓలా సోషల్ మీడియాలో పలు టీజర్లను విడుదల చేస్తూ కస్టమర్ల క్యూరియాసిటీని పెంచింది. యావత్ దేశం రేపు జరగబోయే ఈవెంట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుంది. బైక్ ధర, ఫీచర్లు, ఇతర అంశాలపై ఎలా ఉండే అవకాశం ఉందో ఈ కథనంలో వివరించబోతున్నాం.
ఇక కొత్త ఓలా ఎలక్ట్రిక్ బైక్లో డ్యూయల్-పాడ్ LED హెడ్ ల్యాంప్, కెటిఎమ్ మోటార్ సైకిల్ ఆధారిత టర్న్-ఇండికేటర్స్, టెలిస్కోపిక్ ఫోర్క్ సస్పెన్షన్ సెటప్ మరియు పెద్ద బ్యాటరీ ప్యాక్ ఉండవచ్చని ఈ టీజర్లు సూచిస్తున్నాయి. టార్క్ క్రాటోస్ ఆర్ (Tork Kartos R) మరియు అల్ట్రావయలెట్ ఎఫ్ 77 వంటి ఎలక్ట్రిక్ మోటార్ సైకిళ్లతో ఈ మోటార్ సైకిళ్లకు గట్టి పోటీ ఇవ్వనుంది.

ఈ ఎలక్ట్రిక్ బైక్ను ఓలా చాలా సరసమైన ధరలో లాంచ్ చేయనుంది. దీని ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ .1.5 లక్షలు ఉంటుందని భావిస్తున్నారు. కొత్త ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ ధర, డిజైన్ మరియు ఫీచర్లు రేపే అధికారికంగా వెల్లడించబడతాయి. తక్కువ ధరలో తీసుకువచ్చి మాస్ మార్కెట్‌ని శాసించే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.
ప్రస్తుతం ఓలా దేశీయంగా పలు ఎస్1 సిరీస్ ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయిస్తోంది. ఓలా S1X (Ola S1X) ఎంట్రీ లెవల్ వేరియంట్‌గా ఉంది. ఇది మల్టీ బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్‌తో లభిస్తుంది. ఇది ఫుల్ ఛార్జ్ చేస్తే లీటరుకు 91 నుంచి 151 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ.74,999 నుంచి రూ.99,999 వరకు ఉంది.

ఓలా S 1 ఎయిర్ (Ola S1 Air) ఎలక్ట్రిక్ స్కూటర్ మిడ్ రేంజ్ వేరియంట్‌గా ఉంది. దీని ధరను రూ.1,01,499 (ఎక్స్ షోరూమ్)గా నిర్ణయించారు. ఇది 3 కిలోవాట్ల బ్యాటరీని కలిగి ఉంది, ఇది పూర్తి ఛార్జ్ చేస్తే 151 కిలోమీటర్లు నడుస్తుంది. దీని గరిష్ట వేగం గంటకు 90 కిలోమీటర్లు.
ఓలా S1 Pro(Ola S1 Pro) ఇది ఓలా ఎలక్ట్రిక్ నుంచి అందుబాటులో ఉన్న టాప్-ఎండ్ వేరియంట్ స్కూటర్. దీని ఎక్స్ షోరూమ్ ధరను రూ.1,28,999గా నిర్ణయించారు. ఇది 4 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్‌తో పనిచేస్తుంది. ఇది ఫుల్ ఛార్జ్‌పై 195 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. దీని గరిష్ట వేగం గంటకు 120 కిలోమీటర్లుగా ఉంది.


Click it and Unblock the Notifications








