మరో గోల్డెన్ ఛాన్స్.. 190 కి.మీ రేంజ్ ఇచ్చే ఈవీ స్కూటర్‌పై భారీ డిస్కౌంట్.. లేట్ చేయకండి!
దేశంలో పండుగల సీజన్ ముగిసినప్పటికీ పలు కంపెనీలు ఇంకా తమ తగ్గింపు ఆఫర్లను కొనసాగిస్తూనే ఉన్నాయి. నవంబర్‌లో కూడా అమ్మకాలను పెంచుకోడానికి ఈ డిస్కౌంట్‌లు బాగా ఉపయోగపడనున్నాయి. ఇదిలా ఉంటే ఎలక్ట్రిక్ స్కూటర్ల విభాగంలో దేశంలోనే అగ్రస్థానంలో ఉన్న ఓలా ఎలక్ట్రిక్(Ola electric)పండుగల సమయంలో తీసుకొచ్చిన 'బాస్ ఆఫ్ ఆల్ సేవింగ్స్' సేల్‌ను మరికొద్ది రోజులు కొనసాగిస్తామని ప్రకటించింది. దీనిలో భాగంగా దాని ప్రధాన ఈవీ స్కూటర్ అయినటువంటి S1 మోడళ్లపై తగ్గింపులను అందిస్తుంది. ఈథర్, ఒకినావా, హీరో లాంటి కంపెనీల అమ్మకాలకు ధీటుగా ఈ ఆఫర్‌ను కొనసాగిస్తుంది. పండుగ సమయంలో తగ్గింపు ధరలు ఉన్నప్పుడు ఈవీ స్కూటర్లను కొనుగోలు చేయలేని వారికి ఇది చాలా మంచి అవకాశం.
ఓలా తన సరికొత్త S1 ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలుపై కస్టమర్లకు దాదాపు రూ.15,000 తగ్గింపును అందిస్తుంది. ఈ సిరీస్‌లో మొత్తం ఆరు స్కూటర్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా వివిధ బ్యాటరీ ఎంపికలను కలిగి ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో ఎస్1 ప్రో ధర రూ.1,34,999, 4 kWh బ్యాటరీ S1 X EV ధర రూ.1,01,999గా ఉంది. పెద్ద బ్యాటరీ మోడల్ దాదాపు 190 కిమీల రేంజ్ అందిస్తుంది.

అదే, ఎస్1 ఎయిర్ ధర రూ.1,07,499, S1 X 2 kWh మోడల్ ధర రూ. 74,999, S1 X 3 kWh మోడల్ ధర రూ. 87,999గా ఉంది. ఈ ఈవీ స్కూటర్లు పెట్రోల్ వాహనాలతో పోలిస్తే తక్కువ ఖర్చు నిర్వహణను అందిస్తాయి. రోజు 30 కి.మీ పెట్రోల్ వాహనాలపై వెళ్లేవారు ఓలా స్కూటర్లను రోజు వాడినట్లయితే ఏడాదికి దాదాపు రూ.30,000 లాభం ఆదా చేయవచ్చని కంపెనీ తెలిపింది.
ఓలా ప్రధానంగా భారత్‌లో ఈవీ విభాగంలో మెజార్టీ వాటా సంపాదించడానికి ఈ విధమైన ఆఫర్లను అందిస్తూ, తన సేల్స్‌ను పెంచుకుంటుంది. పెట్రోల్ స్కూటర్ల కంటే ఈవీల ధరలు కొంచెం ఎక్కువగా ఉన్నప్పటికీ ప్రస్తుతం ఇంధన ధరలు అధికంగా ఉండటంతో దేశవ్యాప్తంగా ఈవీ స్కూటర్లకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. పెరిగిన ఈ డిమాండ్‌ను సద్వినియోగం చేసుకోడానికి కంపెనీ పండుగ తర్వాత కూడా తగ్గింపును అందిస్తుంది.

ఇటీవల కాలంలో ఓలా స్కూటర్లు కాలిపోవడం, బ్యాటరీ సమస్యలు, సర్వీస్ సెంటర్లలో సమస్యలు వంటి కొన్ని అవాంతరాలు వచ్చినా కూడా ఇవేమి కంపెనీ అమ్మకాలపై ప్రభావం చూపలేకపోయాయి. అక్టోబర్ 2024 నాటికి, ఓలా 1.50 లక్ష్లల ఈవీలను మార్కెట్లో అందుబాటులో ఉంచింది. సెప్టెంబర్ కంపెనీ స్టాక్‌మార్కెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తరువాత రెండు నెలలో కాలంలో నెలవారీ అమ్మకాలు 23,965 గా ఉన్నాయి.
ఆ తరువాత అక్టోబర్‌లో పండుగ సీజన్ సమయంలో పలు ఆఫర్లను ప్రకటించడం వల్ల ఓలా ఎలక్ట్రిక్ అమ్మకాలు తిరిగి పుంజుకుని, 50,000 యూనిట్లకు చేరాయి. ముఖ్యంగా అమ్మకాలతో కంపెనీ ఏకంగా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల విభాగంలో 30 శాతం మార్కెట్ వాటాతో తన నంబర్ వన్ స్థానాన్ని నిలబెట్టుకుంది.

డేటా ప్రకారం, సెప్టెంబర్ 2024 నుంచి నెలవారీ అమ్మకాలు 100 శాతానికి పైగా పెరగడంతో అక్టోబర్‌లో రిజిస్ట్రేషన్లు సంవత్సరానికి 74 శాతం పెరిగాయి. ఇదే ఊపును కొనసాగిస్తూ కంపెనీ రానున్న రోజుల్లో మరిన్ని అమ్మకాలను నమోదు చేస్తుందని కంపెనీ భావిస్తోంది. ఇప్పుడు ఉన్న మోడళ్లకు మరింత అప్‌డేట్ వెర్షన్లను కంపెనీ త్వరలో తీసుకొస్తుంది.
తన స్కూటర్లలో వస్తున్న సమస్యలు, సర్వీస్ సెంటర్ల సమస్యలపై ఓలా ఎలక్ట్రిక్ ప్రధానంగా దృష్టి సారించింది. దీని కోసం ఇప్పటికే చర్యలు తీసుకోవడం ప్రారంభించింది. వీటన్నింటిని అతి త్వరలో అధిగమించి ఇండియాలో ఎలక్ట్రిక్ స్కూటర్లలో మెజారిటీ వాటాను సొంతం చేసుకుంటామని కంపెనీ అధికారులు తెలిపారు.


Click it and Unblock the Notifications








