ఓలా ఎలక్రిక్‌ నుంచి మొట్టమొదటి బైక్ విడుదల.. ధర రూ. 74,999 మాత్రమే, స్కూటర్‌కి బదులు దీనిని ట్రై చేయండి!

ఓలా ఎలక్ట్రిక్ ఎట్టకేలకు భారతదేశంలో తొలి ఎలక్ట్రిక్ బైక్‌ని విడుదల చేసింది. సంకల్ప్‌ 2024 పేరుతో ఓలా నిర్వహించిన ఈ ఈవెంట్‌లో కేవలం ఒక ఓలా ఎలక్ట్రిక్ బైక్‌ని లాంచ్‌ చేయలేదు. రోడ్‌స్టర్‌ సిరీస్‌ పేరుతో తొలి 3 ఎలక్ట్రిక్‌ మోటార్‌సైకిళ్లను మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఓలా రోడ్‌స్టర్‌ సిరీస్‌లో మూడు వేరియంట్స్‌ ఉన్నాయి. అవి రోడ్‌స్టర్‌ ఎక్స్‌, రోడ్‌స్టర్‌ మరియు రోడ్‌స్టర్‌ ప్రోగా ఉన్నాయి. వీటికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ కథనంలో..

ఓలా తాజాగా విడుదల చేసిన ఈ కొత్త వేరియంట్‌లో ఓలా రోడ్‌స్టర్‌ ఎక్స్ బేస్‌ వేరియంట్‌ ధర కేవలం రూ .74,999 (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఈ ప్రైస్‌ వద్ద బైక్‌ని లాంచ్ చేయడం ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ వేరియంట్‌లో 2.5 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్‌ని మాత్రమే అందించారు. ఓలా స్కూటర్లతో సమానంగా బైక్‌ని విడుదల చేయడం కాస్త కొసమెరుపు అని చెప్పాలి.

Ola-Electric-Roadster-Series-Launched

ఈ వేరియంట్‌తో పాటు ఓలా రోడ్‌స్టర్‌ ఎక్స్‌ 3.5 కిలోవాట్ మరియు 4.5 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్స్‌తో కూడా లభిస్తుంది. మిడ్-స్పెక్ ఓలా రోడ్‌స్టర్‌ 3.5 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ ధర రూ .84,999 (ఎక్స్-షోరూమ్), 4.5 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్‌తో వచ్చే టాప్-స్పెక్ వేరియంట్‌ ధర రూ .99,999 (ఎక్స్-షోరూమ్)గా ఉంది.

మిడ్-వేరియంట్‌ రోడ్‌స్టర్ కూడా 3 విభిన్న బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్‌తో లభిస్తుంది. ఓలా రోడ్‌స్టర్ 3.5 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఈ మోడల్ ధర రూ .1.05 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించింది. ఇక 4.5 కిలోవాట్ల ఓలా రోడ్‌స్టర్ ధర రూ .1.20 లక్షలు (ఎక్స్-షోరూమ్), టాప్-స్పెక్ ధర రూ .1.40 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది.

Ola-Electric-Roadster-Series-Launched

ఇక చివరగా ఓలా రోడ్‌స్టర్‌ ప్రో వేరియంట్‌ ఈ సిరీస్‌లో టాప్ ఆఫర్‌గా ఉంది. ఈ ఓలా రోడ్‌స్టర్ ప్రో వేరియంట్స్‌ 8 కిలోవాట్, 16 కిలోవాట్ అనే రెండు బ్యాటరీ ప్యాక్స్‌తో వస్తుంది. దీనిలోని 8 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ బైక్‌ ధర రూ .2.00 లక్షలు (ఎక్స్-షోరూమ్), 16 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ ధర రూ .2.50 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది.

భవిష్యత్తులోనూ వీటికి కొనసాగింపుగా సోర్ట్‌స్టర్‌ (Sportster)ని లాంచ్ చేయాలని ఓలా ఎలక్ట్రిక్ యోచిస్తోంది. దీనిపై పూర్తి సమాచారం తెలియరాలేదు. ఇది ఓలా రోడ్‌స్టర్‌ ప్రో ఆధారంగా ఉంటుందని మేము ఆశిస్తున్నాము. ఇవే కాకుండా, ఓలా స్పోర్ట్స్ (యారోహెడ్ మరియు డైమండ్ హెడ్), అడ్వెంచర్ మరియు క్రూయిజర్ సిరీస్ ఎలక్ట్రిక్ మోటార్ సైకిళ్లను కూడా విడుదల చేయాలని యోచిస్తోంది.

Ola-Electric-Roadster-Series-Launched

భారతదేశం అంతటా సరసమైన, సమర్థవంతమైన మరియు అందుబాటు ధరల్లో ఎలక్ట్రిక్‌ రైడింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ఓలా ఎలక్ట్రిక్ ఎండీ, చైర్మన్ భవీష్ అగర్వాల్ తెలిపారు. మూడేళ్ల క్రితం ఊహించుకుంటే ఇదొక కలగానే ఉందని భవీష్‌ అగర్వాల్‌ తెలిపారు. ఈ రోజు మేము దేశంలో ప్రముఖ ఈవీగా అలాగే ప్రపంచంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహన ఈవి తయారీదారుగా అవతరించామని చెప్పారు.

వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా అన్ని ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీలలో, మార్కెట్ క్యాపిటలైజేషన్‌తో చూసుకుంటే ఇప్పుడు ఇప్పుడు ఐదవ స్థానంలో ఉన్నందుకు గర్వంగా ఉందన్నారు. భవిష్యత్తులోనూ మరిన్ని మంచి ఉత్పత్తలు అందిస్తామని ఆయన వెల్లడించారు. 2021 ఆరంభంలో ఇ-స్కూటర్‌ని డెలివరీ చేసిన ఓలా ఎలక్ట్రిక్.. ఈ విభాగంలోనే ఇప్పుడు తిరుగులేని శక్తిగా ఎదిగింది. ప్రస్తుతం ఓలా స్కూటర్లు దేశంలోనే ఎక్కువ సంఖ్యలో అమ్ముడువుతున్నాయి.

డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Thursday, August 15, 2024, 16:12 [IST]
English summary
Ola electric roadster series launched in india at rs 74999 check details telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+