ఆ కంపెనీ ఎలక్ట్రిక్‌ స్కూటర్లపై 8 ఏళ్లు లేదా 80,000 కి.మీ వారంటీ.. అందుకే కింగ్‌ మేకర్‌గా ఎదిగింది

భారతదేశంలో అత్యధిక ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించిన సంస్థగా ఓలా ఎలక్ట్రిక్ నిలిచింది. కంపెనీ ప్రారంభమైనప్పటి నుండి, ప్రజలలో మంచి ఆదరణ కారణంగా చాలా మంది ఓలా వాహనాలను కొనుగోలు చేస్తున్నారు. టూవీలర్‌ విభాగంలో కొన్ని కంపెనీ అమ్మకాలు ప్రతి నెలా పెరుగుతున్నాయి. కొన్ని కంపెనీల సేల్స్‌ మోస్తారుగా ఉన్నాయి. గత నెలలో ఓలా ఎలక్ట్రిక్‌ ఎన్ని వాహనాలను విక్రయించింది అనే వివరాలు మాకు లభించాయి. దాని ప్రకారం ఒక్క ఏడాదిలోనే ఓలా 107 శాతం పెరిగింది. గత నెలలో ఈ కంపెనీ ఎన్ని వాహనాలను విక్రయించింది? దీని సేల్స్‌ గ్రాఫ్‌ ఎలా పెరిగిందో వివరాలు తెలుసుకుందాం.

జూన్‌లో ఓలా మొత్తం 36,716 ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించింది. ఈ సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వ వాహన్ సైట్ విడుదల చేసింది. గత నెలలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల అమ్మకాలలో కంపెనీకి 46 శాతం వాటా ఉంది. గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే జూన్‌లో అమ్మకాలు 107 శాతం పెరిగాయి. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి మూడు నెలల అమ్మకాల గణాంకాలను కూడా ఓలా విడుదల చేసింది.

Ola-Electric-June-Sales-Report

ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో కంపెనీ 1.08 లక్షల ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించింది. ఇది ఆల్‌టైమ్‌ రికార్డుగా సంస్థ తెలిపింది. గత ఆర్థిక సంవత్సరం మొదటి మూడు నెలలతో పోలిస్తే ఇది 57 శాతం అధికం కావడం గమనార్హం. ఇక ఓలా ఎలక్ట్రిక్ 2024 మొదటి ఆరు నెలల అమ్మకాల గణాంకాలను కూడా విడుదల చేసింది.

ఆ సంవత్సరంలోని మొదటి ఆరు నెలల్లో కంపెనీ 2 లక్షలకు పైగా ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించింది. తక్కువ సమయంలోనే అధిక సంఖ్యలో వాహనాలను విక్రయించిన ఏకైక కంపెనీగా రికార్డు నెలకొల్పింది. 2024లో కంపెనీ మొత్తం 2.28 లక్షల ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించింది. ఓలా ప్రస్తుతం ఎస్ 1 బ్రాండ్ కింద మొత్తం ఆరు స్కూటర్లను విక్రయిస్తోంది.

ola Electric-Scooters-Sales

కంపెనీ ఎస్ 1X ఎలక్ట్రిక్ స్కూటర్‌ తక్కువ ధర వద్ద కొనుగోలుకి అందుబాటులో ఉంది. ఈ స్కూటర్ మూడు బ్యాటరీ ఆప్షన్లలో లభిస్తుంది. బ్యాటరీ 2 కిలోవాట్, 3 కిలోవాట్, 4 కిలోవాట్ బ్యాటరీ ఆప్షన్స్‌తో లభిస్తుంది. 2 కిలోవాట్ బ్యాటరీ ఆప్షన్ ధర రూ.74,999గా, 3 కిలోవాట్ బ్యాటరీ ఆప్షన్ ధర రూ.84,999, 4 కిలోవాట్ బ్యాటరీ ఆప్షన్ ధర రూ.99,999గా ఉంది.

ఓలా స్కూటర్ ప్రియుల కోసం ఎస్ 1 ప్రో, ఎస్ 1 ఎయిర్ మరియు ఎస్ 1 ఎక్స్ ప్లస్‌ స్కూటర్లకు కూడా విక్రయిస్తోంది. ఓలా ఎలక్ట్రిక్ తన ఉత్పత్తుల బ్యాటరీపై 8 సంవత్సరాలు లేదా 80,000 కిలోమీటర్ల వారంటీని అందిస్తోంది. ఈ వాహనాలను కొనుగోలు చేసే కస్టమర్లు ఎలాంటి ఇబ్బంది లేకుండా కొనుగోలు చేస్తున్నారు. అంతే కాకుండా ఓలా తన కస్టమర్లకు పొడిగించిన వారంటీ కవరేజీని కూడా అందిస్తోంది.

యాడ్-ఆన్ ప్లాన్ ద్వారా కస్టమర్లు యాడ్‌ ఆన్‌ వారంటీని పెంచుకోవచ్చు. కిలోమీటర్ల ప్రకారం పొడిగించిన వారంటీని ఇస్తుంది. మొత్తానికి ఆకర్షణీయమైన ఫీచర్లు, రేంజ్‌తో ప్రస్తుతం ఓలా ఎలక్ట్రిక్‌ విభాగంలో టాప్‌లో కొనసాగుతుంది. తమ కస్టమర్లకు మరింత చేరువ అయ్యేందుకు దేశవ్యాప్తంగా ఓలా ఫెసిలిటీ సెంటర్లను విరివిగా ప్రారంభించింది. దీంతో కస్టమర్లు డైరెక్ట్‌ కనెక్ట్‌ అవుతున్నారు. ఇది ఓలా సేల్స్‌ పెరగడానికి ప్రధాన కారణమని విశ్లేషకులు చెబుతున్నారు.

డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Tuesday, July 2, 2024, 12:39 [IST]
English summary
Ola electric sales registerd 107 percent hike in june 2023 to june 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+