ఓలా స్కూటర్ల ధర, బరువు తగ్గనున్నాయి.. లిథియం-అయాన్‌ బ్యాటరీలకు రాంరాం!! కొత్త టెక్నాలజీ వచ్చేస్తుంది

దేశంలో ఎలక్ట్రిక్‌ వెహికిల్స్‌ వినియోగం పెరుగుతుంది. ముఖ్యంగా టూ-వీలర్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్లను ఎక్కువగా కొంటున్నారు. ఈ అమ్మకాల్లో ఓలా ఎలక్ట్రిక్, ఏథర్ ఎనర్జీ, టీవీఎస్‌ ఇతర పేరొందిన స్టార్ట్అప్‌ కంపెనీలు ఉన్నాయి. అయితే ఇతర కంపెనీలకు ఓలా స్కూటర్సు గట్టి పోటీని ఇస్తున్నాయి. గత కొన్ని నెలలుగా ఈ సంస్థకు చెందిన స్కూటర్లలు టాప్‌లో కొనసాగుతున్నాయి. తాజాగా తన ఎలక్ట్రిక్ స్కూటర్లలో కొత్త టెక్నాలజీని ఆ కంపెనీ ప్రవేశపెట్టబోతోంది. తమ కస్టమర్లకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు తమ కంపెనీ నుంచి రాబోయే వాహనాలకు ప్రపంచ ప్రఖ్యాత సాలిడ్ స్టేట్ బ్యాటరీ టెక్నాలజీని తీసుకురాబోతోంది. ఈ సాలిడ్-స్టేట్ బ్యాటరీలు ఏమిటి? ఎలక్ట్రిక్ వాహనాల్లో వీటి వల్ల కలిగే ప్రయోజనాలు మీ కోసం..

భారతదేశంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల విభాగంలో ఓలా అతిపెద్ద మార్కెట్ వాటాను కలిగి ఉంది. కస్టమర్లను ఆకట్టుకునేందుకు స్వయంగా ఆ సంస్థ సహ వ్యవస్థాపకుడు సీఈఓ భవీష్ అగర్వాల్ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు అప్‌డేట్స్‌తో పాటు కస్టమర్లకు ఆఫర్లను ప్రకటిస్తాడు. ఆ సంస్థ నుంచి తీసుకుబోయే కీలక విషయాలను సైతం ప్రపంచానికి తెలియజేస్తాడు. తాజాగా సాలిడ్ స్టేట్ బ్యాటరీ టెక్నాలజీ కోసం ఓలా పనిచేస్తోందని భవీష్ అగర్వాల్ తెలిపారు.

Ola-Electric-Working-On-Solid-State-Battery-Technology

ఈ మేరకు రీసెర్చ్ ఇన్‌స్టిట్యూషన్‌ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం చాలా ఎలక్ట్రిక్ వాహనాలు ఎలక్ట్రోలైట్ ఆధారంగా లిథియం-అయాన్ బ్యాటరీలను ఉపయోగిస్తున్నాయి. ఇందులో చాలా లోపాలు ఉన్నాయని.. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఈ బ్యాటరీని ఎలక్ట్రిక్ వాహనాల్లో ఉపయోగించడం మంచిదని ఆయన సూచించారు. రాబోయే ఎలక్ట్రిక్ వాహనాలకు అనుగుణంగా సాలిడ్ స్టేట్ బ్యాటరీలను మార్చడం వల్ల మెరుగైన ఫలితాలు వస్తాయని ఆయన తెలిపారు.

ఇక సాలిడ్ స్టేట్ బ్యాటరీల విషయానికి వస్తే ఈ బ్యాటరీ టెక్నాలజీలలో ఇది అత్యంత సృజనాత్మకమైనది మరియు శక్తివంతమైనదిగా పరిగణించబడుతుంది. ఒక వాహనాన్ని పూర్తి ఛార్జ్ చేసిన తర్వాత అది నడిచే దూరాన్ని రేంజ్‌ (మైలేజీ)గా పిలుస్తాము. ఈ బ్యాటరీ టెక్నాలజీ వినియోగంతో ఎలక్ట్రిక్ వాహనాల పరిధి పెరుగనుంది. ఇటువంటి బ్యాటరీలు సురక్షితమైనవి. అంతేకాక ఈ సాలిడ్-స్టేట్ బ్యాటరీలు తేలికైనవిగా ఉంటాయి.

Ola-Electric-Scooter-Solid-State-Battery

ఇది వాహనం మొత్తం బరువును తగ్గించడానికి మరియు తద్వారా వాహనం యొక్క రేంజ్‌ని పెంచడానికి సహాయపడుతుంది. సాలిడ్ స్టేట్ బ్యాటరీలలో అద్భుతమైన థర్మల్ మేనేజ్ మెంట్ సిస్టమ్ కూడా ఉంటుంది. ఇది రైడర్‌కి మంచి రైడింగ్ అనుభవాన్ని కూడా ఇస్తుంది. సాలిడ్-స్టేట్ బ్యాటరీలకు ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఇవి లిథియం-అయాన్ బ్యాటరీల కంటే వేగంగా ఛార్జ్ చేయగలవు.

అంతేకాకుండా ఈ బ్యాటరీలు మరింత ఎనర్జీ ఎఫిషియెన్సీగా పనిచేస్తాయని విశ్లేషకులు చెబుతున్నారు. సాలిడ్ స్టేట్ బ్యాటరీని అమర్చినట్లయితే బ్యాటరీలను త్వరగా మార్చాల్సిన అవసరం ఉండదు. ఓలా ఎలక్ట్రిక్ విషయానికి వస్తే, కంపెనీ ప్రస్తుతం బ్యాటరీని సొంతంగా తయారు చేయడం లేదు. ఓలా స్కూటర్లకు శక్తినిచ్చే లిథియం-అయాన్ బ్యాటరీలను దక్షిణ కొరియా, చైనాలో పనిచేస్తున్న రెండు కంపెనీలు తయారు చేసి సరఫరా చేస్తున్నాయి.

Ola-Electric-Working-On-Solid-State-Battery-Technology

ఈవీ రంగంలో భారీ ప్రణాళికలతో ముందుకొచ్చిన ఓలా సొంతంగా బ్యాటరీలను కూడా తయారు చేయాలని యోచిస్తోంది. సొంతంగా బ్యాటరీని తయారు చేయడం ప్రారంభిస్తే దీని ఉత్పత్తులు గణనీయంగా తగ్గడం వల్ల కస్టమర్లకు కలిసి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం బెంగళూరుకు చెందిన ఈ కంపెనీ లిథియం అయాన్ బ్యాటరీలను మాత్రమే అందిస్తుంది. అతి త్వరలో సాలిడ్-స్టేట్ బ్యాటరీలను అమర్చాలని చూస్తుంది.

సాలిడ్‌ స్టేట్‌ బ్యాటరీలు చేర్చిన తర్వాత ధరలను తగ్గిస్తుందా లేదా అనే అంశంపై ఉత్కంఠ కొనసాగుతుంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా మంచి సమీక్షలు పొందిన సాలిడ్ స్టేట్ బ్యాటరీలు అందుబాటులో ఉన్నాయి. ఇకపై భారత ఎలక్ట్రిక్ వాహన పరిశ్రమలో కూడా ఈ బ్యాటరీల రాకతో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తాయని ఆశిద్దాం. ముఖ్యంగా భారతదేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్లను జనాలకు మరింత చేరువ చేసేందుకు ఓలా చేస్తున్న ప్రయత్నాన్ని కచ్చితంగా మెచ్చుకోవాలి.

Article Published On: Monday, July 1, 2024, 12:17 [IST]
English summary
Ola electric started working on solid state battery technology also brings down weight
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+