కేవలం రూ. 49,999 లకే నంబర్-1 ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్.. స్టాక్ ఉన్నంత వరకే ఆఫర్.. సగం ధరకే తెచ్చుకోండి!
ఎలక్ట్రిక్ టూవీలర్ మార్కెట్‌లో ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric) తొలి స్థానంలో ఉంది. ఆ తర్వాత టీవీఎస్ ఎలక్ట్రిక్, బజాజ్ ఆటో, ఏథర్ ఎనర్జీకి చెందిన టూవీలర్స్ ఎక్కువగా అమ్ముడవుతున్నాయి. ఓలా ఎలక్ట్రిక్ మొత్తం మార్కెట్‌లో 30 శాతానికి పైగా వాటాను కలిగి ఉంది. ఈ సంస్థకు చెందిన స్కూటర్లు భారీ రేంజ్, స్మార్ట్ ఫీచర్లతో పాటు ఎక్స్‌పీరియన్స్ (సర్వీస్ సెంటర్లు) విరివిగా ఉండటంతో కస్టమర్లు ఈ కంపెనీ స్కూటర్లను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. తాజాగా ఆ కంపెనీకి చెందిన ఫేమస్ S1 లైనప్‌లోని స్కూటర్లపై భారీ డిస్కౌంట్‌ని ప్రకటించింది. ఆ వివరాలు ఈ కథనంలో..
రానున్న పండుగ సీజన్‌లో ఎక్కువ మంది కస్టమర్లను ఆకర్షించేందుకు ఓలా భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. ఈ విషయాన్ని ఆ సంస్థ సీఈవో భవిష్ అగర్వాల్ 'ఎక్స్'లో పోస్ట్ చేశారు. ఓలా ఎలక్ట్రిక్ ప్రారంభించిన 'బిగ్గెస్ట్ ఓలా సీజన్ సేల్-BOSS' ద్వారా అనేక ప్రయోజనాలను పొందవచ్చు. ఇందులో భాగంగా ఓలా ఎస్1X- 2 కిలోవాట్ (Ola S1X- 2kWh) ఎలక్ట్రిక్ స్కూటర్ కేవలం రూ.49,999కే లభిస్తుంది.

దీంతో పాటు అన్ని S1 సిరీస్ స్కూటర్లపై రూ .10,000 వరకు తగ్గింపు అందిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. వీటితో పాటు కొనుగోలుదారులకు రూ.21,000 వరకు వివిధ రకాల ఆర్థిక ప్రయోజనాలను పొందవచ్చు. వీటిలో రూ .5,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్, రూ .7,000 విలువైన 8 సంవత్సరాల వరకు బ్యాటరీ వారంటీలు వంటిని ఉన్నాయి. ఇంకా అదనపు బెనిఫిట్స్‌ని కూడా కస్టమర్లు పొందవచ్చు.
నేటి నుంచి అనగా (అక్టోబర్ 3) నుంచి కస్టమర్లు ఈ బెనిఫిట్స్‌ని పొందవచ్చు. అయితే ఓలా కమ్యూనిటీ మెంబర్స్ అంటే ప్రస్తుతం ఉన్న ఓలా ఇ-స్కూటర్ ఓనర్స్‌కి నిన్నటి నుంచే ఈ ఆఫర్ అందుబాటులో ఉంది. అయితే ఈ ఆఫర్ కేవలం స్టాక్ ముగిసే వరకు మాత్రమే ఉంటుంది. కస్టమర్లు ఆఫర్ ధరలో ఓలా S 1 Xని (2 కిలోవాట్) కొనుగోలు చేయాలనుకుంటే ఇప్పుడే బుక్ చేసుకోవచ్చు.
ఈ ఆఫర్ విషయంలో ఏదైనా గందరగోళం ఉంటే మీ సమీప షోరూంను సందర్శించి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకోవచ్చు. భారీ డిస్కౌంట్ బెనిఫిట్స్‌తో అందుబాటులో ఉన్న ఈ ఓలా S1 X (2 కిలోవాట్) ఎలక్ట్రిక్ స్కూటర్ ఫుల్ ఛార్జ్‌పై 95 కిలోమీటర్ల రేంజ్‌ని అందిస్తుంది. ఈ స్కూటర్ కేవలం 8.1 సెకన్లలో 0-60 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 85 కిలోమీటర్లుగా ఉంది.
ఓలా S1X ఎలక్ట్రిక్ స్కూటర్ 3 కిలోవాట్ 4 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్‌లో కూడా లభిస్తుంది. వీటి ధరలు రూ.87,999 నుంచి రూ.96,999 మధ్య ఉన్నాయి. ఈ రెండు బ్యాటరీ ప్యాక్స్ ఫుల్ ఛార్జ్‌పై 151 నుంచి 190 కిలోమీటర్లు ప్రయాణిస్తాయి. ఎక్కువ స్మార్ట్ ఫీచర్లు ఉండటం వల్ల కస్టమర్లు ఈ స్కూటర్లను ఎక్కువగా ఇష్టపడతారు.

అలాగే ఓలా నుంచి S1 ఎయిర్ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలుకు అందుబాటులో ఉంది. రూ .1.07 లక్షలు ఎక్స్-షోరూమ్ ధరతో ఇది కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉంది. ఇది ఫుల్ ఛార్జ్ చేస్తే 151 కిలోమీటర్ల ప్రయాణిస్తుంది. టాప్-ఎండ్ మోడల్, ఓలా ఎస్ 1 ప్రో ధర రూ .1.35 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఇది ఫుల్ ఛార్జ్ చేస్తే 195 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది.
డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








