సెల్ఫీతో ఓలా కొత్త స్కూటర్ ఉచితంగా పొందే ఛాన్స్.. స్వచ్ఛమైన 24 క్యారెట్ల గోల్డ్ స్కూటర్ మీదే..!
దేశీయ ప్రముఖ ఎలక్ట్రిక్ టూవీలర్ తయారీ కంపెనీ ఓలా ఎలక్ట్రిక్ (Ola electric) మొదట రైడ్ షేరింగ్ వ్యాపారాన్ని మొదలు పెట్టి అంచెలంచెలుగా ఎదిగి ఈవీ టూవీలర్ విభాగంలోకి అడుగుపెట్టి దేశంలోనే టాప్ సంస్థగా అవతరించింది. చాలా ఎలక్ట్రిక్ స్కూటర్లను మార్కెట్లోకి విడుదల చేస్తూ భారత మార్కెట్లో భారీ డిమాండ్ ఉన్న కంపెనీగా నిలుస్తుంది. అయితే ఓలా కంపెనీల వాహనాల బ్యాటరీలు పేలిపోవడం, ఆకస్మాత్తుగా మధ్యలో ఆగిపోవడం వంటి వంటి పలు సమస్యల కారణంగా వినియోగదారుల నుంచి ఫిర్యాదులు కూడా వస్తున్న తరుణంలో వీటిని అధిగమించడానికి ఓలా తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. ఈ నేపథ్యంలో దేశీయ ప్రజల్లో బెస్ట్ కంపెనీగా నమ్మకాన్ని నిలబెట్టుకోడానికి మరికొద్ది రోజుల్లో కొత్త మోడల్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఓలా తీసుకొస్తున్న కొత్త ఈవీ స్కూటర్ పేరు 'ఎస్ 1 ప్రో సోనా స్పెషల్ ఎడిషన్ (s1 pro sona special edition)'.
రాబోయే స్పెషల్ ఎడిషన్ స్కూటర్ టీజర్‌కు సంబంధించిన వీడియోను ఓలా ఎలక్ట్రిక్ సీఈవో భవిష్ అగర్వాల్ సోషల్ మీడియా ఎక్స్‌లో విడుదల చేశారు. ఈ మోడల్‌లో కొన్ని పార్టులకు 24 క్యారెట్ల బంగారు పూతపూశారు. ఇది చూడటానికి చాలా అందంగా ఉంది. బంగారు పూత కలిగిన సోనా స్పెషల్ స్కూటర్‌ను ప్రత్యేక రోజు అయిన డిసెంబర్ 25న విడుదల చేస్తుంది. ఆ తర్వాత నుంచి కస్టమర్లకు కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది.

ఈ స్పెషల్ ఎడిషన్‌ను క్రిస్మస్ రోజున దేశంలో ఘనంగా లాంచ్ చేస్తుంది. ఇదే సమయంలో ఈ రోజు నాటికి ఓలా ఎలక్ట్రిక్ తన సేవల నెట్‌వర్క్‌ను దేశవ్యాప్తంగా 4000 ఔట్‌లెట్స్‌కి విస్తరించనున్నట్టు తెలిపింది. ఇక ఓలా ఎస్ 1 ప్రో సోనా స్పెషల్ ఎడిషన్ విషయానికి వస్తే, ఇది డ్యూయెల్ టోన్ డిజైన్ థీమ్‌తో పర్ల్ వైట్, బంగారు కలర్లలో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది.
ఈ ఈవీ స్కూటర్ సీటు కూడా చాలా అందంగా ముదురు లేత గోధుమ కరల్ గోల్డ్ థ్రెడ్‌తో కుట్టడంతో ప్రీమియం సీటు లుక్‌ను కలిగిస్తుంది. ఇది MoveOS సాఫ్ట్‌వేర్ ద్వారా రైడింగ్ చేస్తున్న వారికి సరికొత్త అనుభూతిని అందిస్తుంది. ప్రత్యేకమైన ఫీచర్లు చాలా వరకు ఈ స్కూటర్‌లో ఉన్నాయి. కొత్త ఏడాదికి ముందు కస్టమర్లను ఆకట్టుకోడానికి ఓలా ఎలక్ట్రిక్ స్పెషల్ ఎడిషన్‌తో 2024 ఏడాదికి ఘనంగా ముగింపు పలకడానికి సిద్ధమైంది.

మరో కీలక విషయం ఏమిటంటే ఎస్ 1 ప్రో సోనా స్పెషల్ ఎడిషన్ సేల్స్ పెంచుకోడానికి కంపెనీ సరికొత్త వినూత్నమైన ఆఫర్‌ను తెచ్చింది. పండుగ ఆఫర్‌తో పాటు లాంచ్ ప్రక్రియలో భాగంగా ఈ ప్రత్యేక స్కూటర్‌ను కస్టమర్లు ఉచితంగా సొంతం చేసుకునే అవకాశాన్ని అందిస్తుంది. ఓలా సోనా కాంటెస్ట్ పేరుతో ఒక ఆఫర్‌ను తెచ్చింది. దీనిలో గెలిచిన అదృష్టవంతులు డబ్బులు చెల్లించకుండా ఫ్రీగానే సోనా స్పెషల్ ఎడిషన్‌ను పొందవచ్చు.
ఓలా సోనా కాంటెస్ట్ ప్రకారం, ఓలా ఎస్1తో రీల్‌ను తీసి పోస్ట్ చేయాలి లేదంటే ఓలా ఎలక్ట్రిక్ స్టోర్ బయట ఒక ఫోటో/సెల్ఫీని తీసుకుని #OlaSonaContest అనే హ్యాష్‌ట్యాగ్‌తో @OlaElectricని ట్యాగ్ చేయాలి. ఇలా చేసిన వారందరు కూడా కాంటెస్ట్‌లో పాల్గోన్నట్లు. డిసెంబర్ 25 క్రిస్మస్ రోజున కంపెనీ తన ఓలా స్టోర్లలో పోటీలో పాల్గొన్న వారి నుంచి విజేతను ప్రకటించి ఉచితంగా సోనా స్పెషల్ ఎడిషన్‌ను అందిస్తుంది.

ఈ కాంటెస్ట్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను తెలుసుకోడానికి కస్టమర్లు దగ్గరలోని ఓలా ఎలక్ట్రిక్ షోరూమ్‌లలో సంప్రదించవచ్చు. లక్షలు పోషించి కొత్త ఈవీ స్కూటర్ కొనుగోలు చేయడం కంటే అదిరిపోయే కాంటెస్ట్‌లో పాల్గోని విజేతగా నిలిచి ఈవీ టూవీలర్‌ను తమ సొంతం చేసుకోవచ్చు.


Click it and Unblock the Notifications








