మూడు చక్రాల ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల.. పడుకుని ప్రయాణం చేయవచ్చు.. ధర చాలా తక్కువ!
దేశంలో గత కొన్నేళ్లుగా ఎలక్ట్రిక్ స్కూటర్లు మంచి డిమాండ్‌ని కలిగి ఉన్నాయి. రోజు రోజుకు మార్కెట్‌లో వీటికి ప్రజాదరణ పొందుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. దీనికి ప్రధాన కారణం అవి చాలా తక్కువ ఖర్చుతో అద్భుతమైన ప్రయాణ సౌకర్యాన్ని అందించడమే అని చెప్పాలి. ఇప్పటికే ఎలక్ట్రిక్ టూవీలర్ మార్కెట్‌లో వివిధ కంపెనీలకు చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్లు అందుబాటులో ఉన్నాయి. అయితే ఇటీవల ఓ ఎలక్ట్రిక్ స్కూటర్‌ని ఓ సంస్థ సరికొత్త డిజైన్‌లో తయారు చేసింది. దీనిని తొలిసారి చూసిన జనాలు ఆశ్చర్యపోతున్నారు. ఇప్పటి వరకు కేవలం 3 వీల్స్‌తో మోఢిఫై చేసిన పెట్రోల్ స్కూటర్లను చూశాము. అయితే ఇక్కడ ఓ ఎలక్ట్రిక్ స్కూటర్ పూర్తిగా 3 వీల్స్‌తో తయారు చేసి ఆశ్చర్యపరిచారు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ కథనంలో..
కేలా సన్స్ పీఇవీ ఫాంటమ్ (Kela Sons PeV Phantom) ఎలక్ట్రిక్ సంస్థ ఈ 3-వీల్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ని ప్రవేశపెట్టింది.ఈ స్కూటర్ ముందు సీటు ఆకర్షణీయమైన డిజైన్‌లో ప్రత్యేకంగా రూపొందించారు. ఇక వెనక కారు సీటు లగ్జరీ కార్ల మాదిరిగా ఉండే సీట్‌ని అందించారు. ఈ స్కూటర్ ముందు సీటుని సర్దుబాటు చేస్తూ వెనక సీటుపై పూర్తిగా పడుకునే విధంగా తయారు చేయడం గమనార్హం.

డిజైన్ విషయానికి వస్తే, స్కూటర్ ముందు భాగంలో డ్యూయల్ LED ప్రొజెక్టర్ హెడ్‌లైట్ సెటప్‌ని గమనించవచ్చు. ఈ PeV ఫాంటమ్ వృత్తాకార హెడ్‌లైట్ హౌసింగ్‌లో రెండు ప్రొజెక్టర్ లైట్ పాడ్స్, డే టైమ్ రన్నింగ్ లైట్లను అందిచారు. ఫ్రంట్ కవర్‌లో టర్న్ ఇండికేటర్లు ఉన్నాయి. ఇవి హాలోజెన్ యూనిట్లతో పొందుపరిచారు.
ఈ స్కూటర్‌కి సంబంధించిన పూర్తి వివరాలను వీడియోలో ప్రజెంటర్ వెల్లడించాడు. స్కూటర్ అల్లాయ్ చక్రాలతో వస్తుంది. ముందు భాగంలో 10 అంగుళాల సిల్వర్ అల్లాయ్ వీల్, 190 MM డిస్క్ బ్రేక్ ఉన్నాయి. ఈ వీడియోలో వెనుక చక్రం గురించి ప్రస్తావించలేదు. స్కూటర్ హ్యాండిల్ బార్ చాలా పొడవుగా అందించారు. ఎడమ, కుడి వైపు మంచి ఆపరేట్ చేయగల అన్ని స్విఛ్‌లు ఉన్నాయని ప్రజెంటర్ స్పష్టం చేశారు.

ఇక ఈ స్కూటర్ ముందు భాగంలో టెలిస్కోపిక్ సస్పెన్షన్ సెటప్ మరియు వెనుక భాగంలో కాయిల్ స్ప్రింగ్స్‌ని పొందుతుంది. ఇది ఉత్తమమైన సస్పెన్షన్ సెటప్‌గా ఉంది. PeV ఫాంటమ్ పరిమాణంలో చాలా పెద్ద సీటును పొందుతుంది. అలాగే సర్దుబాటు చేయదగిన హ్యాండ్‌రెస్ట్‌లను కూడా అందించారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో రెండు స్టోరేజీలు ఉన్నాయి. ఈ వీడియో స్కూటర్ వెనక భాగంలో స్టోరేజ్ బాక్సులు ఉన్నాయి.
ఒకటి సీటు వెనుకే ఉండగా.. మరొకటి సీటు కింద ఉంది. ఈ స్కూటర్‌కి శక్తినిచ్చేందుకు60V 32Ah లెడ్-యాసిడ్ బ్యాటరీ ప్యాక్‌ని ఉపయోగించారు. ప్రీమియం/ అదనపు ఖర్చులతో లిథియం-అయాన్ బ్యాటరీకి అప్‌గ్రేడ్ చేసుకునే అవకాశాన్ని కూడా కల్పిస్తుంది. దీనికి అదనంగా డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఇది ఫుల్ ఛార్జ్ చేస్తే 50 నుంచి 60 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది.

1000 వాట్ల ఎలక్ట్రిక్ మోటారు దీని వెనక చక్రాలకు శక్తిని పంపుతుంది. అయితే ఇన్ని ఫీచర్లు ఉన్న ఈ స్కూటర్ ధర అధికంగా ఉండవచ్చని మీరు భావించవచ్చు. అలా అయితే మీరు పప్పులో కాలు వేసినట్లు ఎందుకంటే ఇది కేవలం రూ .88,000 ధరకు లభిస్తుంది. అంటే మార్కెట్‌లో ఉన్న ఇతర ఎలక్ట్రిక్ స్కూటర్లతో పోల్చితే చాలా తక్కువ.
డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








