పెట్రోల్‌ బైక్స్‌ వద్దు బ్రో.. దీపావళి ఆఫర్‌లో వాటి కంటే తక్కువ ధరలో ఫేమస్‌ ఎలక్ట్రిక్‌ బైక్స్‌ వస్తున్నాయి!

ప్యూర్ ఈవీ (Pure EV) మార్కెట్‌లో మోటార్‌సైకిల్స్‌ని విక్రయిస్తోంది. ఈ కంపెనీ నుంచి అందుబాటులో ఉన్న బైక్స్‌కి మార్కెట్‌లో డిమాండ్‌ కాస్త ఎక్కువగానే ఉంది. ఈ కంపెనీకి ఒబెన్‌ రోర్‌, రివోల్ట్‌ ఇతర కంపెనీలు గట్టి పోటీని ఇస్తున్నాయి. కొద్ది నెలల క్రితమే ఓలా కొత్త ఎలక్ట్రిక్‌ మోటార్‌సైకిల్స్‌ని లాంచ్‌ చేసింది. భారతదేశంలో ఎలక్ట్రిక్ బైక్‌లను తయారు చేసే అతి కొన్ని కంపెనీలల్లో ప్యూర్ ఈవీ ఒకటిగా ఉంది. ఈ సంస్థకు చెందిన లైనప్స్‌ని జనాలు ఎక్కువగా కొంటున్నారు. తాజాగా పండుగ సీజన్‌లో సేల్స్ పెంచుకునేందుకు ఇతర ఆటోమొబైల్ కంపెనీల మాదిరిగానే ప్యూర్ ఈవీ కూడా దీపావళి ఆఫర్లను ప్రకటించింది.

ప్యూర్‌ ఈవీ నుంచి అందుబాటులో ఉన్న ఎలక్ట్రిక్ బైక్స్‌పై ఈ ఆఫర్లను వర్తించనున్నాయి. దీపావళి (Diwali 2024) సందర్భంగా ఎక్కువ మంది కస్టమర్లను ఆకర్షించడానికి ఈ ఆఫర్‌ని కంపెనీ ప్రకటించింది. దీపావళి వంటి పండుగల సమయంలో ఎక్కువ మంది కస్టమర్లకు చేరువ అవ్వచ్చొనే ఉద్దేశ్యంతో భారీ ఆఫర్‌ని ప్రకటించి ఆశ్చర్యానికి గురిచేసింది. కొత్తగా ఎలక్ట్రిక్ బైక్‌కి అప్‌గ్రేడ్‌ అవ్వాలని చూస్తున్న వారికి ఈ కంపెనీ బైక్స్‌ సరిపోతాయి.

Pure EV Diwali Discount on ecoDryft 350 and eTryst X motorcycles

ఇక ఆఫర్ల విషయానికి వస్తే ప్యూర్ ఈవీ ఎకో డ్రిఫ్ట్ 350 (ecoDryft 350), ఇట్రిస్ట్ ఎక్స్ (eTryst X) లపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. తదనుగుణంగా ఈ ఎలక్ట్రిక్ బైక్ల ధరలను రూ.20,000 వరకు తగ్గనున్నాయి. కంపెనీ ప్రకటించిన డిస్కౌంట్‌ ధరతో ప్యూర్ ఈవీ ఎలక్ట్రిక్ బైక్స్‌ ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధర రూ .99,999లకు తగ్గింది.

అంటే సాంప్రదాయ ఎలక్ట్రిక్‌ వెహికిల్స్‌ మాదిరిగానే ఈ బైక్స్‌ని కూడా తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. అయితే ఈ ఆఫర్ కేవలం లిమిటెడ్‌ అని కంపెనీ స్పష్టం చేసింది. నవంబర్ 10 వరకు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని కంపెనీ స్పష్టం చేసింది. ఈ ఎలక్ట్రిక్ బైక్స్‌ ప్యూర్ ఈవీ ప్రిడిక్టివ్-ఏఐ ఎక్స్‌ (Predictive-AI X-Platform)-ప్లాట్‌ఫామ్‌పై నిర్మించబడ్డాయి. దీని ద్వారా ఈ బైక్స్‌ మెరుగైన ఫర్పామెన్స్‌ని అందిస్తాయి.

ఇక ఇందులో క్లౌడ్ అలర్ట్స్, స్మార్ట్ బ్యాటరీ మేనేజ్‌మెంట్, కాస్టింగ్ రీజనరేషన్, హిల్ స్టార్ట్ అసిస్ట్, రివర్స్ మోడ్, పార్క్ అసిస్ట్ వంటి అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లు ఉన్నాయి. ప్యూర్ ఈవీ నుంచి వచ్చిన ఎకో డ్రిఫ్ట్ ఎలక్ట్రిక్ బైక్ రోజువారీ వినియోగానికి అనువైన ఎలక్ట్రిక్ బైక్‌గా ఉంది. ఈ బైక్‌ మంచి 171 రేంజ్‌ని అందిస్తుంది. ఈ బైక్ ఎక్కువ రేంజ్‌ అందిస్తుంది కాబట్టి ప్రతిరోజూ ఎక్కువ దూరం ప్రయాణించగలదు.

మరో ప్యూర్ ఈవీ ఇట్రిస్ట్‌ ఎక్స్ ఎలక్ట్రిక్ బైక్ ఫుల్‌ ప్యాక్ట్‌ ఫర్ఫామెన్స్‌ బైక్‌గా ఉంది. దీనిని హైస్పీడ్ ట్రావెల్, ఇన్ స్టంట్ టార్క్ కావాలనుకునే వారు కొనుగోలు చేయవచ్చు. ఈ బైక్‌ కూడా ఎకో డ్రిఫ్ట్ 350 మాదిరిగా 171 కిలోమీటర్ల రేంజ్‌తో వస్తుంది. ఈ ఎలక్ట్రిక్ బైక్స్‌తో పాటు ప్యూర్ ఈవీ ట్రాన్స్ నియో, ఇప్లూటో 7 జీ వంటి ఎలక్ట్రిక్ బైక్స్‌ని కూడా విక్రయిస్తుంది.

డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Friday, October 25, 2024, 13:25 [IST]
English summary
Pure ev announced diwali discounts on ecodryft 350 and etryst x motorcycles
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+