ప్యూర్ ఈవీ నుంచి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు విడుదల.. ఆకట్టుకొనే డిజైన్ సహా మెరుగైన ఫీచర్లు..!
ప్యూర్ ఈవీ X ప్లాట్‌ఫాం 2.0 పైన లిమిటెడ్ ఎడిషన్ వేరియంట్లు ePluto 7G, PRO, MAX మోడల్‌ను లాంచ్ చేసింది. ఈ వాహనాలతో అధిక మైలేజీ, మెరుగైన డ్రైవింగ్ అనుభవాన్ని సొంతం చేసుకోవచ్చని సంస్థ తెలిపింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లు 12 స్టాండర్డ్ ఫీచర్లను కలిగి ఉంటాయని తెలిపింది.
గరిష్ఠంగా గంటలకు 58 కి.మీ వేగం : ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లు 7G, PRO, MAX లలో ఎకో మోడ్‌లో గరిష్ఠంగా గంటలకు 58 కి.మీ వేగంతో ప్రయాణం చేయవచ్చని సంస్థ వెల్లడించింది. ఈ మోడ్‌లో కొన్ని సంస్థల ఉత్పత్తులు గరిష్ఠంగా 35 కి.మీ వేగాన్ని మాత్రమే అందిస్తున్నాయి.

స్పోర్ట్ మోడ్‌లో గరిష్ఠంగా గంటకు 72 కి.మీ వేగం : నగరాలు, పట్టణ ప్రాంతాల్లో ప్రయాణించేందుకు ఈ ప్యూర్ ఈవీ ఎలక్ట్రిక్ స్కూటర్లు స్పోర్ట్స్ మోడ్‌ను కలిగి ఉంటాయి. ప్యూర్ ఈవీ లిమిటెడ్ ఎడిషన్ స్కూటర్లు గరిష్ఠంగా గంటకు 72kmph వేగాన్ని అందుకోగలవు. అన్ని వర్గాల వారిని మెరుగైన డ్రైవింగ్ అనుభూతి, వేగాన్ని అందించే విధంగా ఈ లిమిటెడ్ ఎడిషన్ ఈవీలు అందుబాటులోకి తెచ్చినట్లు సంస్థ చెబుతోంది.
ePluto సిరీస్ కోసం X ప్లాట్‌ఫాం 2.0 లిమిటెడ్ ఎడిషన్ వేరియంట్లను విడుదల చేస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని ప్యూ్ర్ ఈవీ సీఈవో రోహిత్ వదేరా తెలిపారు. ఈ కొత్త మోడల్‌లో ఎలక్ట్రిక్ మొబిలిటీ కొత్త శకానికి నాంది పలుకుతాయన్నారు. మరియు మెరుగైన అనుభూతిని అందిస్తాయని పేర్కొన్నారు. ఈ వాహనాల విడుదల వెనుక గత కొన్నినెలల కృషి ఉందన్నారు.

ఎలక్ట్రిక్ మొబిలిటీ రంగంలో కొత్త ప్రమాణాలను సిద్ధం చేసేందుకు ప్యూర్ ఈవీ సంసిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఈ తాజా పరిణామం వినియోగదారుల డ్రైవింగ్ అనుభూతిని మెరుగుపరచడమే కాకుండా.. పరిశ్రమ అభివృద్ధికి కూడా గణనీయంగా దోహదపడుతుందని సంస్థ అభిప్రాయం వ్యక్తం చేసినట్లు సీఈవో తెలిపారు.
ఈ ప్యూర్ ఈవీ లిమిటెడ్ ఎడిషన్ వేరియంట్లు ముందుగా బుక్‌చేసుకున్న వారికి ముందుగా అందించబడతాయని సంస్థ పేర్కొంది. బుకింగ్‌లు ఇప్పటికే తెరవబడ్డాయని, అన్ని ప్యూర్ ఈవీ డీలర్‌షిప్‌లకు వెళ్లి బుకింగ్ చేసుకోవచ్చని సంస్థ వెల్లడించింది. ఈ అవకాశాన్ని వెంటనే సద్వినియోగం చేసుకోవాలని సంస్థ సూచించింది.

భవిష్యత్‌లో సుస్థిరమైన రవాణా వ్యవస్థను తయారు చేసేందుకు ప్యూర్ ఈవీ కట్టుబడి ఉందని సంస్థ పేర్కొంది. X ప్లాట్‌ఫాం 2.0 లిమిటెడ్ ఎడిషన్ వేరియంట్ల ఆవిష్కరణ.. తమ అంకిత భావానికి నిదర్శనం అని తెలిపింది. వేగం, రేంజ్ వంటి ప్రమాణాలను మెరుగుపరచడం ద్వారా ఎలక్ట్రిక్ వాహనాల ప్రయాణాన్ని విప్లవాత్మకంగా మార్చేందుకు ఈ కొత్త మోడళ్లు అందుబాటులోకి వస్తున్నాయని సంస్థ భావిస్తోంది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








