భారత్‌లో బంపర్ హిట్ అయిన కంపెనీ.. ఇప్పుడు ఆఫ్రికాను అల్లాడించడమే టార్గెట్‌గా ప్లాన్.. మరి సక్సెస్ అవుతుందా!

భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల వాడకం రోజు రోజుకు విపరీతంగా పెరిగిపోతుంది. ఆటోమొబైల్ తయారీదారులు ఇన్నాళ్లు పెట్రోల్, డీజిల్ వేరియంట్లను మార్కెట్లోకి తీసుకురాగా, ఇప్పుడు తమ ధోరణిని మార్చుకుని ఈవీలను వరుసగా విడుదల చేస్తున్నారు. అంతర్జాతీయంగానే కాకుండా దేశీయ కంపెనీలు కూడా ఈవీలను లాంచ్ చేస్తున్నాయి. కంపెనీలు ఒకరికొకరు సహకరించుకుంటూ తమ మార్కెట్‌ను మరింత విస్తరించడానికి ఒప్పందాలు చేసుకుంటున్నాయి. ఇలాంటి భాగస్వామ్యాలు ఇటీవల ఎక్కువగా అయ్యాయి. తాజాగా దేశీయ ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కంపెనీ ప్యూర్ ఈవీ( pure ev) తన వ్యాపారాన్ని మరింత పెంచుకోడానికి క్లారియన్ ఇన్వెస్ట్‌మెంట్స్ LLCకి అనుబంధంగా ఉండే అర్వా(ARVA) ఎలక్ట్రిక్ వెహికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ LLCతో డీల్‌ను కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ద్వారా ప్యూర్ ఈవీ తన టూవీలర్లను మిడిల్ ఈస్ట్‌తో పాటు ఆఫ్రికా దేశాల్లో విక్రయిస్తుంది. కంపెనీ అమ్మకాలు మరింత పెంచుకోడానికి ఈ డీల్ ఉపయోగపడుతుంది.

ఇండియాలో ప్యూర్ ఈవీ టూవీలర్ విక్రయాలు మెరుగ్గానే ఉన్నాయి. ఈ కొత్త డీల్ ద్వారా ఇకపై విదేశాల్లోనూ తన ప్రతాపాన్ని చూపించడానికి సిద్ధమైంది. ప్యూర్ ఈవీ తన ఈవీ టూవీలర్లను అర్వా ఎలక్ట్రిక్‌కు సరఫరా చేయడంతో పాటు, తన ఈవీ సాంకేతికతను సైతం అందిస్తుంది. ఈ భాగస్వామ్యం ప్రకారం, అర్వా ఎలక్ట్రిక్‌ విదేశాల్లో వాహనాల డెలివరీ, సర్వీస్ వంటి ప్రక్రియలు చూసుకుంటుంది.

Pure Ev Ties Up With Arva Electrics

ఒప్పందంలో భాగంగా ప్యూర్ ఈవీ , అర్వా ఎలక్ట్రిక్ సహయంతో రెండేళ్లలో మొదటి దఫా దాదాపు 50,000 యూనిట్లు వాహనాలను ఆయా దేశాలకు ఎగుమతి చేస్తుంది. ఇది పూర్తయిన వెంటనే ఏడాదికి 60,000 యూనిట్ల వాహనాలను సరఫరా చేస్తుంది. ఈ డీల్ ద్వారా దేశీయంగా తయారైన ఈవీలు విదేశాల్లో కూడా సందడి చేయనున్నాయి.

ప్యూర్ ఈవీ కంపెనీ మిడిల్ ఈస్ట్‌తో పాటు ఆఫ్రికా దేశాల్లోకి ఎగుమతి చేయనున్న ప్రధాన మోడళ్లలో రూ.1,49,999 (ఎక్స్ షోరూమ్) ధర కలిగిన 'ఈట్రిస్ట్ ఎక్స్' (eTryst X)' ఉంది. ఇది సింగిల్ ఛార్జ్‌తో 171 కి మీ రేంజ్‌ అందిస్తుంది , మరో మోడల్ రూ. 1,19,999 (ఎక్స్ షోరూమ్) ధర కలిగిన 'ఎకోడ్రిఫ్ట్' (ecoDryft)'ఉంది, ఈ మోడల్ 151 కి మీ రేంజ్ ప్రయాణిస్తుంది.

ప్రస్తుతం సాంప్రదాయ వాహనాల కంటే ఈవీలను ప్రజలు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో ప్యూర్ ఈవీ ఈ విభాగంలో ఉన్న డిమాండ్‌ను ఉపయోగించుకుని క్రమంగా విదేశాల్లో తన పాగా వేయడానికి సిద్ధమైంది. దీని కోసం అర్వా ఎలక్ట్రిక్ వెహికల్స్‌ను భాగస్వామిగా ఎంచుకుంది. ఈ డీల్ ద్వారా మిడిల్ ఈస్ట్ దేశాల్లో ప్యూర్ ఈవీ ఎంట్రీ ఇచ్చినట్లయితే అక్కడ అడుగుపెట్టిన మొదటి భారతీయ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కంపెనీగా నిలవనుంది.

ఈ భాగస్వామ్యంపై ప్యూర్ ఈవీ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ డా. నిశాంత్ డోంగరి ఒక ప్రకటనలో మాట్లాడుతూ, కస్టమర్ల నుంచి వస్తున్న డిమాండ్‌కు అనుగుణంగా నిబద్దతకు కట్టుబడి ఉన్నాం. ఎలక్ట్రిక్ మొబిలిటీ సొల్యూషన్‌‌లలో పెరుగుతున్న సమస్యలను తీర్చడానికి వినియోగదారులకు మెరుగైన సౌకర్యవంతమైన సేవలు అందించడానికి కట్టుబడి ఉన్నామని అన్నారు.

భారత్‌లోనే కాకుండా విదేశీ మార్కెట్లో సైతం ప్రజలకు ఎలక్ట్రిక్ టూవీలర్లను సరఫరా చేయడానికి అన్ని విధాలా కృషి చేస్తామని తెలిపారు. ఈ భాగస్వామ్యం ద్వారా అర్వా ఎలక్ట్రిక్‌తో మంచి సంబంధాలు ఏర్పరుచుకుని ప్రపంచవ్యాప్తంగా మా ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలను పెంచుకోవడానికి ప్రయత్నిస్తామని మేనేజింగ్ డైరెక్టర్ నిశాంత్ అన్నారు.

అర్వా ఎలక్ట్రిక్ వెహికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ LLC మేనేజింగ్ డైరెక్టర్ అనియన్ కుట్టి మాట్లాడుతూ, రెండు కంపెనీలు పర్యావరణ అనుకూలమైన వాహనాలను కస్టమర్లకు అందించడానికి కట్టుబడి ఉన్నాయి. ఈ టూవీలర్లు కర్బన ఉద్గారాలను తగ్గించే పరిష్కారాలుగా నిలుస్తాయని అన్నారు. ఈ భాగస్వామ్యం ద్వారా విదేశాల్లో కూడా వ్యాపారం పెరుగుతుందని పేర్కొన్నారు.

More from DriveSpark

Article Published On: Wednesday, November 20, 2024, 14:26 [IST]
English summary
Pure ev ties up with arva electric to expand footprint in africa middle east
Read more on: #auto #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+