స్కూటర్ కొంటే రూ. 15 వేల స్మార్ట్‌ఫోన్ ఉచితం.. అదనంగా రూ.20 వేల క్యాష్‌బ్యాక్.. బంపర్ ఆఫర్ ఇచ్చిన కంపెనీ

దేశంలో దసరా, దీపావళి ముగిసిన తర్వాత ఇప్పుడు మరోసారి పండుగ వాతావరణం నెలకొంది. డిసెంబర్ 25న క్రిస్మస్, ఆ తర్వాత మరికొద్ది రోజులకు 2024 ఏడాది ముగిసి కొత్త ఏడాది ప్రారంభం కానుంది. మళ్లీ జనవరి నెలలో పొంగల్ పండుగ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆటోమొబైల్ రంగం అప్పటి వరకు సేల్స్ పరంగా బాగా బిజీగా ఉంటాయి. ఈ సమయంలో చాలా మంది కొత్త వాహనాలను కొనుగోలు చేయడానికి ముందుకు వస్తారు. కార్లు, బైకులతో పాటు, ఇతర వాహనాలను తయారు చేసే కంపెనీలు కస్టమర్లను ఆకట్టుకోవడానికి పోటా పోటీగా ఆఫర్స్, డిస్కౌంట్స్ వంటివి అందిస్తుంటాయి. దీని ద్వారా కంపెనీల సేల్స్ విపరీతంగా పెరుగుతుంటాయి. ఈ నేపథ్యంలో దేశంలోనే ఎలక్ట్రిక్ స్కూటర్ల విక్రయాల్లో పేరొందిన కంపెనీ క్వాంటమ్ ఎనర్జీ (Quantum Energy) వినియోగదారులను ఆకట్టుకోడానికి అదరిపోయే ఆఫర్‌ను తీసుకొచ్చింది.

కంపెనీ తన ఎలక్ట్రిక్ స్కూటర్ల సేల్స్‌ను మరింత పెంచుకోడానికి ఆఫర్‌ను ప్రకటించింది. 2025 జనవరి 18వ తేదీ వరకు అందుబాటులో ఉండే ఈ ఆఫర్‌లలో క్వాంటమ్ ఎనర్జీ ఎలక్ట్రిక్ స్కూటర్లపై ప్రత్యేకంగా డిస్కౌంట్‌ను ఇస్తుంది. కంపెనీ ప్లాస్మా (plasma), మిలన్ (milan), బిజినెస్ సిరీస్ (business series) ఎలక్ట్రిక్ స్కూటర్లపై రూ.20,000 వరకు క్యాష్‌బ్యాక్‌ను అందిస్తుంది. ఈ ఆఫర్ లిమిటెడ్ కాలం వరకు మాత్రమే.

Quantum Energy Offers

మరి ముఖ్యంగా ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది, క్వాంటమ్ ఎనర్జీ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కొనుగోలు చేసే వారికి కంపెనీ ప్రత్యేకంగా రూ.15,000 విలువైన స్మార్ట్‌ఫోన్‌ను ఉచితంగా ఇస్తామని ప్రకటించింది. క్రిస్మస్, కొత్త సంవత్సరం, పొంగల్ వంటి రాబోయే అన్ని పండుగలను కవర్ చేస్తూ జనవరి 18 వరకు ఈ ఆఫర్స్ అందుబాటులో ఉంటాయి. ఇండియాలోని అన్ని క్వాంటమ్ డీలర్‌షిప్ షోరూమ్‌లలో ఆఫర్స్ లభిస్తాయి.

అందరిని ఆశ్చర్యానికి గురిచేసే విధంగా క్వాంటమ్ ఎనర్జీ ఇచ్చిన ఆఫర్‌ను సద్వినియోగం చేసుకుని కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కొనుగోలు చేయాలని అనుకున్న వారు దగ్గరలోని షోరూమ్‌లలో సంప్రదించాలి. క్వాంటమ్ ఎనర్జీ ఇండియాలో టాప్ 10 ఎలక్ట్రిక్ టూవీలర్ తయారీలో మంచి స్థానంలో ఉంటుంది. కంపెనీ ఇప్పటి వరకు దాదాపు 10,000 కంటే ఎక్కువ స్కూటర్లను విక్రయించింది. దేశంలో ప్రధాన నగరాలు, పట్టణాల్లో ఈ కంపెనీ షోరూమ్‌లు ఉన్నాయి.

Quantum Energy Offers Cashback On Electric scooters

ఎలక్ట్రిక్ స్కూటర్ల వాడకం విపరీతంగా పెరిగింది. చాలా మంది పెట్రోల్ మోడళ్లతో పాటే ఈవీల వైపు ఆసక్తి చూపిస్తున్నారు. దేశంలో చాలా కంపెనీలు కొత్త కొత్త ఈవీ టూవీలర్లను లాంచ్ చేస్తున్నాయి. ఇలాంటి సమయంలో పోటీ ఎక్కువగా నెలకొంది. దేశీయ కంపెనీలు మాత్రమే కాకుండా అంతర్జాతీయంగా మంచి పేరున్న కంపెనీలు కూడా భారత్‌‌లో కొత్త మోడళ్లను లాంచ్ చేస్తూ ఈవీ మార్కెట్లో పోటీని మరింత తీవ్రతరం చేస్తున్నారు.

ఇంత పోటీ ప్రపంచంలో మార్కెట్లో వాటాను సాధించడానికి టాప్ ఈవీ మేకర్‌గా ఎదగడానికి ఇలాంటి ఆఫర్స్ తప్పనిసరిగా ఇవ్వాల్సిందే. అందుకే ఇప్పుడు క్వాంటమ్ ఎనర్జీ కూడా తన ఎలక్ట్రిక్ స్కూటర్ల సేల్స్‌ను పెంచుకోడానికి క్యాష్‌బ్యాక్, స్మార్ట్‌ఫోన్ గిఫ్ట్‌ను అందిస్తున్నట్లు ప్రకటన విడుదల చేసింది. ఇక, ప్లాస్మా ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి మాట్లాడుకుంటే ఇది X, XR అనే రెండు వేరియంట్‌లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది.

Quantum Energy Offers Free Smartphone

ఈ రెండిట్లో కూడా 1000W ఎలక్ట్రిక్ మోటార్ ఇచ్చారు. మిలన్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో కూడా 1000W ఎలక్ట్రిక్ మోటార్‌ను అమర్చారు. దీనిలో అందించిన బ్యాటరీ పూర్తి ఛార్జింగ్‌తో 100 కి.మీ దూరం వరకు ప్రయాణిస్తుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 60 కి.మీలుగా ఉంది. అదే బిజినెస్ ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి మాట్లాడుకుంటే X, XP అనే రెండు వేరియంట్‌లలో లభిస్తుంది. ఇవి 1200W ఎలక్ట్రిక్ మోటార్‌ను కలిగి ఉంటాయి.

More from DriveSpark

Article Published On: Friday, December 20, 2024, 12:55 [IST]
English summary
Quantum energy announced free smartphone and cashback offers on electric scooters
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+