దీపావళి బంపర్ ఆఫర్.. ఆ ఈవీ స్కూటర్లపై కనీవినీ ఎరుగని డిస్కౌంట్.. అస్సలు మిస్ చేసుకోకండి!

కొత్తగా ఎలక్ట్రిక్ స్కూటర్‌(EV)ను కొనుగోలు చేయాలని చూస్తున్న వారికి ప్రముఖ ఈవీ వాహనాల తయారీ కంపెనీ 'క్వాంటమ్ ఎనర్జీ( Quantum Energy)' దీపావళి(Diwali) పండుగకు అదిరిపోయే బంపర్ ఆఫర్ తీసుకొచ్చింది. కంపెనీ తన ఈవీ స్కూటర్లపై దాదాపు రూ. 30,000 వరకు తగ్గింపు ప్రకటించింది. దీవాళి మహోత్సవ్ పేరుతో తీసుకొచ్చిన ప్రత్యేక తగ్గింపు ఆఫర్ అక్టోబర్ 18 నుంచి అక్టోబర్ 31, 2024 వరకు ఉంటుంది. కస్టమర్లు దీన్ని సద్వినియోగం చేసుకుని అతి తక్కువకే ఈవీలను సొంతం చేసుకోవచ్చు. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎక్కువగా ఉండటంతో అందరి చూపు ఈవీలపై మళ్లింది. దీంతో ఎలక్ట్రిక్ వాహనాల(EV)ను కొనుగోళ్లు భారీగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా పండుగల టైంలో ఇవి ఎక్కువగా నమోదు అవుతుంటాయి. దీనిని దృష్టిలో పెట్టుకుని ఈవీలో దిగ్గజ కంపెనీగా పేరున్న 'క్వాంటమ్ ఎనర్జీ' దీపావళికి తన స్కూటర్లపై ఆఫర్లను ప్రకటించింది.

ఆఫర్ల వివరాలు: క్వాంటమ్ ఎనర్జీ మూడు స్కూటర్లపై ప్రత్యేక తగ్గింపును అందిస్తుంది. ఈ ఆఫర్‌లో ప్లాస్మా ఎక్స్ స్కూటర్‌ను రూ. 99,999 ధరకే సొంతం చేసుకోవచ్చు. మాములు రోజుల్లో దీని అసలు ధర రూ. 1,29,150. ప్లాస్మా XR బేస్ ధర రూ.1,09,999 కాగా, ఆఫర్‌లో రూ.89,095కే కొనుగోలు చేయవచ్చు. అలాగే, మిలన్ స్కూటర్ అసలు ధర రూ.85,999 కాగా, ఇది దీపావళి సేల్‌లో రూ.79,999కే లభిస్తుంది.

Quantum Energy Diwali Offers

ఈవీ స్కూటర్లను కొనుగోలు చేయాలని చూస్తున్న వారు ఈ ఆఫర్ ద్వారా ఏకంగా రూ. 30 వేల వరకు ఆదా చేసుకోవచ్చు. టెస్ట్ రైడింగ్ చేయాలనుకుంటున్న వారు క్వాంటమ్ ఎనర్జీ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో రైడ్‌ను షెడ్యుల్ చేసుకోవచ్చు, లేదంటే నేరుగా ఇండియాలోని అన్ని క్వాంటమ్ ఎనర్జీ షోరూమ్‌లలో సంప్రదించవచ్చు.

ఈ మూడు మోడళ్లు అదిరిపోయే ఫీచర్లను కలిగి ఉన్నాయి. ప్లాస్మా ఎక్స్(Plasma X) ఈవీ స్కూటర్ శక్తివంతమైన 1500W మోటార్‌తో 65 km/h గరిష్ట వేగాన్ని అందుకోగలదు. దీన్ని ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 120 కి.మీ వరకు ప్రయాణిస్తుంది. ప్లాస్మా ఎక్స్‌ఆర్(Plasma XR)కూడా 1500W మోటార్‌తో గరిష్టంగా 60 kmph వేగాన్ని అందుకోగలదు. ఇది సింగిల్ ఛార్జింగ్‌తో 100 కి.మీల రేంజ్‌ను అందిస్తుంది.

Quantum Energy Diwali Offers Three Ev Scooters

మరో మోడల్ మిలన్(Milan) స్కూటర్ 1000W మోటార్‌‌తో గరిష్టంగా 60 km/h వేగాన్ని అందుకోగలదు. ఇది ఒక్క ఛార్జింగ్‌తో 100 కి.మీల దూరం వరకు ప్రయాణిస్తుంది. ఈ తగ్గింపు ఆఫర్లు దేశంలోని అన్ని క్వాంటమ్ ఎనర్జీ షోరూమ్‌లలో అందుబాటులో ఉన్నాయి. అలాగే, ఇటీవల కొత్తగా ఓపెన్ అయిన ఆగ్రా, లక్నో, కాన్పూర్‌ ఓట్‌లెట్‌లలో కూడా ఈ దీపావళి తగ్గింపు ఆఫర్‌ను పొందవచ్చు.

క్వాంటమ్ ఎనర్జీ లిమిటెడ్ డైరెక్టర్ చేతన మాట్లాడుతూ, దేశంలో దీపావళి పండుగ సందడి మొదలైంది. ఈవీ స్కూటర్లను కొనుగోలు చేయడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తారు. ఇలాంటి సమయంలో ప్రత్యేకంగా తగ్గింపు ధరలో వీటిని అందించడం చాలా సంతోషంగా ఉంది. క్వాంటమ్ ఎనర్జీ ఎలక్ట్రిక్ స్కూటర్ల పనితీరు, విశ్వసనీయత పట్ల కస్టమర్లలో బలమైన నమ్మకం ఉందని అన్నారు.

సాధారణ పెట్రోల్, డీజిల్ వాహనాలతో పోలిస్తే ప్రస్తుతం ఈవీలకు భారీ డిమాండ్ ఏర్పడింది. దీంతో తయారీ కంపెనీలు సైతం వేగంగా కొత్త కొత్త మోడళ్లను మార్కెట్లోకి విడుదల చేస్తూ, డిస్కౌంట్‌లు వంటి పలు ఆఫర్లను అందిస్తూ ప్రజలకు తక్కువ ధరలో ఈవీ స్కూటర్లను అందిస్తున్నాయి.

ముఖ్యంగా పండుగల సమయంలో కొత్త మోడళ్ల లాంచ్‌తో పాటు, ఇప్పటికే ఉన్న వాటిపై ప్రత్యేకంగా తగ్గింపు ఆఫర్లను ఇస్తున్నాయి. ఇప్పుడు క్వాంటమ్ ఎనర్జీ సైతం ఇదే దారిలో బంపర్ ఆఫర్‌తో ముందుకు వచ్చింది. ఈ ఆఫర్‌తో అమ్మకాలు భారీగా పెరిగే అవకాశం ఉంది.

More from DriveSpark

Article Published On: Tuesday, October 22, 2024, 16:56 [IST]
English summary
Quantum energy diwali offers on electric scooters check all details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+