స్కూటర్లలో స్టెప్నీ తొలగించడానికి కారణాలు తెలుసా? దీనికి వెనుక అసలు కథ ఇదే!
ప్రతీ ఇంట్లో స్కూటర్లు అనేవి నేడు కామన్ ఆయ్యాయి. ఎందుకంటే వీటి ద్వారా భారీ మొత్తంలో సరుకులను మోసుకెళ్లవచ్చు. అలాగే ఇంట్లో మహిళలతో పాటు ఏ వయసు వారినా సులభంగా డ్రైవ్ చేసేలా అనువుగా ఉంటాయి. అయితే మన పాత రోజుల్లో స్కూటర్ వెనుక భాగంలో స్టెప్నీ టైర్ ఉండటం మీరు చూసే ఉంటారు. ఇప్పటికీ పాత చేతక్, కైనెటిక్ స్కూటర్, టీవీఎస్ పెప్ట్ స్కూటర్లు వెనక టైర్లతో రోడ్డుపై కనిపిస్తాయి. కానీ కాలం మారడంతో స్కూటర్లలో ఈ టైర్లను తొలగించడం ఆరంభం అయ్యింది. ఈ భాగంలో కంపెనీలు బ్యాక్‌రెస్ట్‌ని అందిస్తున్నాయి. కొన్ని కంపెనీలు బ్యాక్‌రెస్ట్‌లను కూడా అందించడం లేదు. అసలు ఈ టైర్లను తొలగించడానికి గల ముఖ్య కారణాలు ఈ కథనంలో..
వెనక టైర్ల తీసివేయడం వెనుక దీని వెనుక కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. మనలో చాలా మంది ఇంకా వీటి గురించి తెలియదు. కాలం గడుస్తున్న కొద్దీ కొత్తగా విడుదలవుతున్న వాహనాల్లో సరికొత్త టెక్నాలజీతో కంపెనీలు స్కూటర్లు, మోటార్‌సైకిళ్లను ఉత్పత్తి చేస్తున్నాయి. బైకులు, స్కూటర్ల కంటే నేడు మార్కెట్‌లో విడుదలవుతున్న బైక్స్, స్కూటర్లు మరింత సమర్థవంతంగా పనిచేస్తాయనడంలో సందేహం లేదు.

ఇక ఈ స్టెప్నీ విషయానికి వస్తే పాత స్కూటర్లలో స్కూటర్ పంక్చర్ అయిన సందర్భాల్లో అప్పటికప్పుడు దాని స్థానంలో స్టెప్నీ టైర్‌ని రిప్లేస్ చేసేలా అందించేవారు. దీనిని సులభంగా ఒకే వ్యక్తి మార్చుకోవచ్చు. ఆ రోజుల్లో పంక్చర్ షాప్స్, టైర్ల షాపులు విరివిగా ఉండేవి కావు. యాక్టివాను మొదట వెనుక భాగంలో స్టెపినీ లేకుండా విడుదల చేయడంతో మార్కెట్‌లో తొలిసారిగా సక్సెస్‌ని సాధించింది.
ట్యూబ్‌లెస్ టైర్ల వాడకం: నేడు చాలా స్కూటర్లు ట్యూబ్‌లెస్ టైర్లతో వస్తున్నాయి. పంక్చర్ అయినా వెంటనే గాలి తగ్గేందుకు చాలా సమయం పడుతుంది. ఇది రైడర్లకు సమీపంలోని టైర్ రిపేర్ షాప్‌కి తీసుకెళ్లే వరకు సహాయ పడుతుంది. ట్యూబ్ లేని టైరుని పంక్చర్ రిపేర్ చేయడం కూడా చాలా సులభం. ప్రస్తుతం ఈ రకం టైర్లతో చాలా మందికి స్టెప్నీ అవసరం తగ్గింది.
డిజైన్ & స్సేస్: పాత స్కూటర్లలో స్టెప్నీ వల్ల ఎక్కువ స్థలం కోల్పోవాల్సి వస్తుంది. అండర్-సీట్ స్టోరేజ్, ఇతర ఫీచర్లకు డిమాండ్ పెరుగుతున్నందున తయారీదారులు కూడా దశల వారీగా ఎక్కువ స్థలం అందిస్తున్నారు. స్టెప్నీ ఉంటే స్కూటర్ బరువు సుమారు 5-6 కిలోలు పెరుగుతుంది. ఇది స్కూటర్ యొక్క మైలేజ్ తగ్గడానికి కూడా దారితీస్తుంది. ఈ మార్పులు వల్ల స్కూటర్ల బరువు తగ్గడంతో మైలేజీకి కూడా పెరిగే అవకాశం ఉంటుంది.
పంక్చర్ రిపేర్ చేయడం సులభం: పైన చెప్పిన విధంగా సర్వీస్ సెంటర్లు, పంక్చర్ రిపేర్ షాపులు ఇప్పుడు చాలా చోట్ల ఉన్నాయి. రోడ్లపై వాహనాల సంఖ్య పెరగడంతో ఇలాంటి సర్వీసు సెంటర్లు కూడా ఎక్కువ అయ్యాయి. కాబట్టి స్టెప్నీని అవసరం మునుపటిలా లేదు. టైర్లను మార్చడం కంటే పంక్చర్లను అతికించడం ప్రజలకు సులభంగా ఉంటుంది.
టెక్నాలజీ: నేటి టైర్లు పాత స్కూటర్లలో కనిపించే టైర్ల కంటే ఎక్కువ కాలం ఉంటాయి. వీటిని ఎప్పటికప్పుడు మార్చాల్సిన లేదా మరమ్మత్తు చేయాల్సిన అవసరం ఉండదు. దీంతో స్కూటర్ల నుంచి స్టెప్నీని మినహాయించడానికి దారితీసింది. కొత్త టెక్నాలజీతో స్కూటర్లు మరింత యూజర్ ఫ్రెండ్లీగా మారడం కూడా స్టెప్పినీ అవసరాన్ని తగ్గిచింది. ఇవన్నీ కారణాలు ఆధునిక స్కూటర్ల నుంచి స్టెప్నీ కనుమరుగయ్యేలా చేశాయి.
డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








