రిపబ్లిక్‌ డేకి అదిరిపోయే ఆఫర్లు.. iVOOMi ఇ స్కూటర్లపై రూ. 20,000 భారీ తగ్గింపు.. 115 కి.మీ రేంజ్‌

జనవరి 26 న రిపబ్లిక్‌ డే సందర్భంగా ఎలక్ట్రిక్ టూ వీలర్‌ కంపెనీ iVOOMi ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. ఆ కంపెనీకి చెందిన రెండు స్కూటర్లపై దాదాపు రూ. 20,000 కు పైగా తగ్గింపలను అందిస్తోంది. మరి ఏయే స్కూటర్లపై ఎంతమేరకు తగ్గింపులు ఉన్నాయి.?? ఆఫర్‌ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు.?? పూర్తి సమాచారం ఈ కథనంలో..

భారత్‌లో పండుగలు, ప్రత్యేక రోజుల్లో వాహనాలపై ఆటో కంపెనీలు ఆకర్షణీయమైన ఆఫర్లు, డిస్కౌంట్లను అందిస్తాయనే సంగతి తెలిసిందే. అందుకే కస్టమర్లు కూడా ఎక్కువగా ప్రత్యేక సందర్భాల్లో కొత్త వాహనాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తారు. ఈ క్రమంలో iVOOMi తన రెండు ఇ స్కూటర్లపై భారీ తగ్గింపులను అందిస్తోంది.

Jeet X-S1-2.0-Republic-Day-Offers-iVOOMi

దేశంలో రోజురోజుకీ ఎలక్ట్రిక్ స్కూటర్ల విక్రయాలు గణనీయంగా పెరుగుతున్నాయి. అందుకు అనుగుణంగా ప్రముఖ ఈవీ కంపెనీలు సైతం ఆకట్టుకునే డిజైన్‌, ఫీచర్లతో వాహనాలను ప్రవేశపెడుతున్నాయి. ఎలక్ట్రిక్‌ టూ వీలర్‌ సెగ్మెంట్‌లో ఓలా, ఏథర్‌, టీవీఎస్‌ బ్రాండ్‌లు సత్తా చాటుతున్నాయి. ఈ క్రమంలో తన ఈవీల అమ్మకాలను పెంచుకోవడానికి రిపబ్లిక్‌ డే సందర్భంగా iVOOMi ఆఫర్లను ప్రకటించింది.

గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా iVOOMi కంపెనీ తన ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్లపై ప్రత్యేక క్యాష్ డిస్కౌంట్లను ప్రకటించగా.. ఈ ఆఫర్‌ సోమవారం(జనవరి 22) నుంచి అమలులోకి వచ్చింది. జనవరి 31, 2024 వరకు ఈ ఆఫర్‌ అందుబాటులో ఉంటుందని సంస్థ తెలిపింది.

Jeet X-S1-2.0-Republic-Day-Offers-iVOOMi

iVOOMi దాని ఫ్లాగ్‌షిప్ మోడల్ JeetX పై రూ. 20,000 నగదు తగ్గింపును ప్రకటించింది. ఇంకా దాని సమర్థవంతమైన మరో మోడల్‌ S1 2.0 ఎలక్ట్రిక్‌ స్కూటర్‌పై రూ. 5,000 తగ్గింపు ఆఫర్‌ను అందిస్తోంది. కాగా కంపెనీ ఫ్లాగ్‌షిప్ మోడల్ Jeet X పై రూ. 20,000 నగదు తగ్గింపుతో ఈ స్కూటర్‌ను రూ. 84,999 ఎక్స్-షోరూమ్ ధరలో కొనుగోలు చేయవచ్చు.

అలాగే S1 2.0 ఎలక్ట్రిక్‌ స్కూటర్‌పై రూ. 5,000 నగదు తగ్గింపు తర్వాత రూ. 82,999 ఎక్స్‌-షోరూమ్‌ ధరతో అందుబాటులో ఉన్నట్లు సంస్థ తెలిపింది. ఈ నెలలో కొత్త ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ను కొనుగోలు చేయాలనుకునేవారు ఈ స్కూటర్లపై ఓ లుక్కేయండి. ఈ రెండు స్కూటర్ల ఫీచర్లు, బ్యాటరీ రేంజ్‌ వివరాల్లోకి వెళితే..

iVOOMi కంపెనీ ఫ్లాగ్‌షిప్‌ ప్రీమియం మోడల్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ JeetX 5 మ్యాట్ ఫినిషింగ్‌ కలర్‌లో అందుబాటులో ఉంది. 65 kmph గరిష్ట వేగంతో ప్రయాణిస్తుంది. పూర్తి ఛార్జింగ్‌పై 115 కి.మీ రేంజ్‌ను ఇస్తుందని సంస్థ వెల్లడించింది. మెరుగైన రైడింగ్‌ అనుభవం కోసం JeetX ఇ స్కూటర్‌ కరెక్ట్‌గా సరిపోతుందని సంస్థ తెలిపింది.

ఇక S1 2.0 మోడల్.. దేశంలోనే అత్యంత తక్కువ ధరలో అందుబాటులో ఉన్న ఎలక్ట్రిక్‌ స్కూటర్‌. ఈ స్కూటర్‌ పూర్తి ఛార్జింగ్‌పై 110 కి.మీ కంటే ఎక్కువ రేంజ్‌ను ఇస్తుంది. గరిష్ఠంగా గంటకు 57 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది. తక్కువ ధరలో అద్భుతమైన సామర్థ్యంతో పనిచేసే స్కూటర్‌గా S1 2.0 మోడల్‌ నిలిచింది. ఈ స్కూటర్‌ 6 కలర్స్‌లో అందుబాటులో ఉంది.

రిపబ్లిక్‌ డే సందర్భంగా Jeet X, S1 2.0 స్కూటర్లపై ప్రత్యేక ఆఫర్ల గురించి iVOOMi కో ఫౌండర్‌, సీఈవో అశ్విన్‌ భండారి మాట్లాడారు. తక్కువ ధరలో ఎకో ఫ్రెండ్లీ స్కూటర్లను ద్వారా మెరుగైన రైడింగ్‌ను అందించడమే తమ లక్ష్యమని చెప్పారు. ప్రత్యేక ఆఫర్ల ద్వారా ఫ్లాగ్‌షిప్‌ మోడల్స్‌ అమ్మకాలను పెంచుకోవాలని భావిస్తున్నట్లు చెప్పారు. దేశంలోనే ఇవి అత్యంత సరసమైన ఇ స్కూటర్లు అని పేర్కొన్నారు.

Article Published On: Wednesday, January 24, 2024, 15:39 [IST]
English summary
Republic day special offers up to rs 20 000 discount on ivoomi e scooters till jan 31st
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+