రూ. 85 వేలకే కొత్త ఎలక్ట్రిక్‌ బైక్‌ విడుదల.. 160 కి.మీ రేంజ్‌, రివర్స్‌ లోనూ వెళ్తుంది, ఇంకా మరెన్నో ఫీచర్లు!

దేశంలో ఎలక్ట్రిక్ బైక్స్‌కి ఆదరణ పెరుగుతోంది. అందులో భాగంగా చాలా కంపెనీలు మోటార్‌ సైకిళ్ల ఉత్పత్తిపై దృష్టి సారిస్తున్నాయి. మార్కెట్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన ఎలక్ట్రిక్‌ బైక్స్‌లో రివోల్ట్ మోటార్స్‌(Revolt Motors) నంబర్‌ వన్‌ స్థానంలో ఉంది. మొత్తం భారతీయ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్ల అమ్మకాల్లో 70 శాతం వాటాతో ఈ బైక్స్‌ ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నాయి. ఏడాదికి మొత్తం 1.25 కోట్ల మోటార్‌సైకిళ్లు సేల్‌ అవుతుండగా.. ఇందులో 80 లక్షలకు పైగా మోటార్ సైకిళ్లు రివోల్ట్ మోటార్స్‌ నుంచే ఉండటం గమనార్హం. ఈ కంపెనీకి చెందిన బైక్స్‌కి మార్కెట్‌లో రోజు రోజుకి డిమాండ్‌ ఎక్కువ పెరుగుతోంది. తాజాగా సరికొత్త RV1 ఎలక్ట్రిక్ బైక్‌ని కంపెనీ లాంచ్‌ చేసింది. ఈ సరికొత్త బైక్‌పై ఓ లుక్కేయండి.

ఈ సరికొత్త రివోల్ట్ ఆర్‌వీ 1 ఎలక్ట్రిక్ బైక్‌ని రెండు వేరియంట్లలో కంపెనీ విడుదల చేసింది. ఇందులో RV1 బైక్‌ని ధర రూ.84,990 వద్ద విడుదల చేసింది. RV1 ప్లస్ ప్రీమియం వెర్షన్ ధర రూ.99,990గా నిర్ణయించింది. ఈ రెండు వేరియంట్లను పెట్రోల్ మోటార్ సైకిళ్ల కంటే తక్కువ ధరలో తీసుకువచ్చి ఆశ్చర్యానికి గురిచేసింది.

Revolt RV1 Electric Bike

ఈ ధర ఎలక్ట్రిక్ బైక్స్‌కి మారాలనుకునే వారిని ఆకర్షించనుంది. ఈ బైక్‌ ఓలా రోడస్టర్ సిరీస్‌లోని రోడ్‌స్టర్‌ ఎక్స్‌ బైక్‌కి ప్రత్యర్థిగా ఉంటుంది. ఈ రివోల్ట్ ఆర్‌వీ 1 ఎలక్ట్రిక్ బైక్ మిడ్-మోటార్, చైన్ డ్రైవ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఇందులోని రెండు బ్యాటరీ ఆప్షన్స్‌ ఉన్నాయి. 2.2 kWh బ్యాటరీ 100 కిలోమీటర్ల రేంజ్‌ని, 3.24 kWh బ్యాటరీ 160 కిలోమీటర్ల రేంజ్‌ని అందిస్తుంది.

ఈ రెండు బ్యాటరీ ఆప్షన్లు ఐపీ 67-రేటింగ్ వాటర్ రెసిస్టెన్స్‌తో వస్తుంది. ఇది కఠినమైన సమయాల్లో ఇతర వాతావరణ పరిస్థితుల్లో మంచి ఫర్ఫామెన్స్‌ అందించేందుకు దోహదపడుతుంది. RV 1+ ను ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ ద్వారా కేవలం 1.5 గంటల్లో ఛార్జ్ చేయవచ్చు. దీంతో కస్టమర్‌కి ఎక్కువ సమయం ఆదా అవుతుంది. రివోల్ట్ RV 1 పేలోడ్ సామర్థ్యం 250 కిలోలుగా ఉంది.

Revolt RV1 Electric Bike

రివోల్ట్ RV1లో ఎల్ఈడీ హెడ్‌లైట్స్‌, 6 ఇంచెస్‌ డిజిటల్ LCD ఇన్‌స్ట్రూమెంట్ క్లస్టర్, డ్యూయల్ డిస్క్ బ్రేక్స్ వంటివి ఉన్నాయి. కఠినమైన రోడ్లలోనూ ప్రయాణించేలా ఈ బైక్ భారీ టైర్లతో వస్తుంది. డ్యూయల్ డిస్క్ బ్రేక్స్‌తో సేఫ్టీని మరింత మెరుగుపరిచారు. ఇందులో మల్టీ రైడ్స్‌ ఎక్స్‌పీరియన్స్‌ కోసం వివిధ రకాల స్పీడ్ మోడ్స్‌, రివర్స్ మోడ్స్‌ని అదనంగా అందిస్తుంది. ఇందులోని రివర్స్‌ మోడ్‌ పార్కింగ్‌ సమయాల్లో సమస్యలకు చెక్‌ పెట్టనుంది.

కొత్త బైక్ విడుదలతో పాటు రివోల్ట్ తన ఫ్లాగ్‌షిప్‌ మోడల్ RV 400ని మెరుగైన ఫర్ఫామెన్స్‌, సేఫ్టీ ఫీచర్లతో అప్‌డేట్‌ చేసింది. ఇప్పుడు ఈ బైక్‌ని ఫాస్ట్ ఛార్జర్‌ సహాయంతో కేవలం 90 నిమిషాల్లో పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు. అదనంగా, రివోల్ట్ RV 400 రివర్స్ మోడ్, డిజిటల్ డిస్ప్లే, బ్లూటూత్‌ కనెక్టివిటీతో పాటు 160 కిలోమీటర్ల పొడిగించిన రేంజ్‌ని కూడా అందించారు.

డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Wednesday, September 18, 2024, 10:36 [IST]
English summary
Revolt launches affordable rv1 electric motorcycle with 160 km range
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+