River Indie రివర్ ఇండీ ఇ స్కూటర్ బుకింగ్‌లు మళ్లీ ఓపెన్.. హాట్ కేకుల్లా సేల్.. ఏంటీ ఇందులో అంత స్పెషల్.!
రివర్ ఇండీ(River Indie) ఎలక్ట్రిక్ స్కూటర్ల బుకింగ్‌లు మళ్లీ ప్రారంభమయ్యాయి. మార్కెట్లో మంచి డిమాండ్ సంపాందించుకోవడంతో.. ఈ స్కూటర్ బుకింగ్‌లు మళ్లీ మొదలయ్యాయి. ఆసక్తి గల కస్టమర్లు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను రూ. 2,500 చెల్లించితో ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు. బెంగళూరులోని కంపెనీ షోరూమ్‌లో ముందస్తుగా బుక్ చేసుకోవచ్చు. పూర్తి సమాచారం ఈ కథనంలో..
బెంగుళూరుకు చెందిన స్టార్టప్ ఎలక్ట్రిక్ టూ వీలర్ తయారీదారు.. రివర్ 2021 లో ప్రారంభించబడింది. ఎలక్ట్రిక్ స్కూటర్లను డిజైన్ చేసి, తయారు చేస్తోంది.. కాగా కంపెనీ తన మొదటి ఉత్పత్తిని ఫిబ్రవరి 2023లో ప్రారంభించగా.. రివర్ ఇండీ(River Indie Electric Scooter) ఎలక్ట్రిక్ స్కూటర్లు హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. దీంతో తర్వాత మళ్లీ ఆగస్ట్ 2023లో కంపెనీ ఉత్పత్తిని మొదలుపెట్టింది.

అటు ఉత్పత్తి పూర్తయిన వెంటనే.. బుకింగ్‌లు కూడా మొదలు కావడంతో కస్టమర్లు ఈ స్కూటర్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబరిచారు. కేవలం నెల రోజుల్లోనే దాదాపు 200 రివర్ ఇండీ(River Indie Bookings) స్కూటర్లు అమ్ముడుపోవడంతో ఈ ఇ స్కూటర్‌కు ప్రజల్లో మంచి ఆదరణ లభిస్తోంది. ఇంతలా ఈ స్కూటర్‌కు మంచి ఆదరణ లభించడానికి ప్రధాన కారణం డిజైన్ అనే చెప్పవచ్చు.
ఆకర్షించే డిజైన్, మెరుగైన పనితీరు, అధిక బూట్ స్పేస్ కారణంగా బెంగళూరుకు చెందిన చాలా మంది ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కొనుగోలు చేస్తున్నారు. బెంగళూరులో లాంచ్ చేసి విక్రయించిన మొదటి సంస్థగా రివర్ ఇండీ నిలిచింది. అందుకే మొదటి టాక్‌లోనే ఉత్పత్తి అయిన రివర్ ఇండీ ఎలక్ట్రిక్ స్కూటర్లన్నీ అమ్ముడుపోగా.. కంపెనీ తాజాగా తన ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం మళ్లీ బుకింగ్‌లను ఓపెన్ చేసింది.

రివర్ ఇండీ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కంపెనీ అధికారిక వెబ్‌సైట్ నుండి లేదా కంపెనీ బెంగళూరులో తెరిచిన షోరూమ్‌లను సందర్శించడం ద్వారా బుక్ చేసుకోవచ్చు. బుకింగ్‌లు కూడా త్వరలోనే ప్రారంభమవుతాయి. ఇక రివర్ ఇండి ఎలక్ట్రిక్ స్కూటర్ విషయానికొస్తే, ఇది 6.7 KW మోటార్‌తో పనిచేస్తుంది. 90 kmph గరిష్ఠ వేగంతో ప్రయాణిస్తుంది. కేవలం 3.9 సెకన్లలో 0 నుండి 40 kmph స్పీడ్‌ను అందుకుంటుంది.

రివర్ ఇండీ ఎలక్ట్రిక్ స్కూటర్(Electric Scooter) పూర్తి ఛార్జింగ్‌పై 120 కి.మీ రేంజ్‌ను ఇస్తుంది. అంతేకాకుండా ఈ స్కూటర్‌లో వివిధ రైడింగ్ మోడ్‌లను సంస్థ అందిస్తోంది. రివర్ ఇండీ ఇ స్కూటర్‌ను బ్యాటరీని ఛార్జ్ చేయడానికి 800 పోర్టబుల్ ఛార్జర్‌లను ఇస్తోంది. త్వరలో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఛార్జర్ కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
రివర్ ఇండీ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో లగేజీ స్పేస్ కోసం సీటు కింద 43 లీటర్ల స్టోరేజీని ఇవ్వడం కస్టమర్లకు ప్లస్ పాయింట్. ఇంకా ముందు భాగంలో 12 లీటర్ల గ్లోవ్ బాక్స్ అందించారు. ఈ స్కూటర్ 14 అంగుళాల వీల్స్‌తో వస్తుంది. మార్కెట్లో ప్రస్తుతం ఈ స్కూటర్ ధర రూ.1.38 లక్షలుగా ఉంది.

రివర్ ఇండీ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ధర ఈ స్కూటర్ ధర రూ.13,000 పెరిగింది. మార్కెట్లో ఉన్న ఏథర్ 450S, TVS iCube S మరియు బజాజ్ చేతక్ ప్రీమియమ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లకు రివర్ ఇండీ గట్టి పోటీనిస్తోంది.

ప్రస్తుతం బెంగళూరు నగరంలో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విక్రయిస్తుండటంతో.. నగరంలో చాలా మంది ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. రివర్ ఇండీ స్కూటర్ యొక్క ప్రత్యేకమైన డిజైన్ ఎలక్ట్రిక్ స్కూటర్‌కు మంచి సేల్స్ అందిస్తోంది. ఈ కంపెనీ త్వరలో తన ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచి, దేశవ్యాప్తంగా విక్రయాలు ప్రారంభిస్తే సేల్స్ మరిన్ని పెరగవచ్చని ఆటో నిపుణులు భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications








